(Source: Poll of Polls)
Rashmika Mandanna : వారియర్‌గా నేషనల్ క్రష్ - రష్మిక 'మైసా' మూవీ అప్జేట్...
Mysaa Movie : నేషనల్ క్రష్ రష్మిక మందన్న నెక్స్ట్ మూవీ 'మైసా ' షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఇందులో డిఫరెంట్ రోల్‌లో గోండు గిరిజన మహిళగా రష్మిక నటించనున్నారు.

Rashmika Mandanna's Mysaa Movie Shooting Started : నేషనల్ క్రష్ రష్మిక మందన్న 'ది గర్ల్ ఫ్రెండ్'తో ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న సంగతి తెలిసిందే. ఇక ఆమె నెక్స్ట్ మూవీ 'మైసా'పై ఫోకస్ చేస్తున్నారు. ఫస్ట్ టైం ఓ వారియర్‌గా ఇందులో కనిపించబోతున్నారు. ఇక ఈ మూవీ షూటింగ్ సోమవారం ప్రారంభమైంది.
కేరళ అటవీ ప్రాంతంలో...
ఈ మూవీకి రవీంద్ర పూలే దర్శకత్వం వహిస్తుండగా ఆయనకు ఇదే ఫస్ట్ మూవీ. కేరళలోని అతిరప్పలి అటవీ ప్రాంతంలో 'మైసా' షూటింగ్ ప్రారంభించినట్లు డైరెక్టర్ తెలిపారు. 'ఇది ప్రారంభమవుతుంది. ప్రతీ కథ ఫస్ట్ ప్రేమ్‌కు ముందే దాని లయను కనుగొంటుంది. జలపాతాలు, అడవుల గుసగుసల్లో, సృష్టి ముందు ప్రశాంతతలో... ఈ దృష్టి ఊపిరి పీల్చుకోవడం ప్రారంభిస్తుంది.' అంటూ తన ఇన్ స్టాలో రాసుకొచ్చారు.
View this post on Instagram
పవర్ ఫుల్ లుక్
ఈ మూవీలో రష్మిక గోండు గిరిజన మహిళగా కనిపించనున్నారు. నేషనల్ క్రష్‌ను ఇదివరకు ఎప్పుడూ చూడని ఓ డిఫరెంట్, మాస్, భయానక లుక్‌లో కనిపించారు. 'మైసా' అంటే అమ్మ అని అర్థం. గోండు తెగల బ్యాక్ డ్రాప్‌తో ఓ పవర్ ఫుల్ యాక్షన్ డ్రామాను తెరకెక్కించనున్నట్లు తెలుస్తుండగా... ఓ యోధురాలిగా రష్మిక కనిపించనున్నట్లు తెలుస్తోంది. స్వేచ్ఛా ఆలోచనల నుంచి వచ్చిన ఓ సహజ నాయకురాలి రోల్ కోసం 'మైసా' అనే టైటిల్ ఫిక్స్ చేశారు మేకర్స్.
ఈ మూవీని పాన్ ఇండియా స్థాయిలో అన్ ఫార్ములా ఫిల్మ్స్ బ్యానర్‌పై అజయ్, అనిల్ సయ్యపురెడ్డిలు నిర్మిస్తున్నారు. రష్మికతో పాటు 'పుష్ప 2'లో విలన్ పాత్రలో మెప్పించిన తారక్ పొన్నప్ప కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రభాస్ 'కల్కి 2898AD' మూవీకి వర్క్ చేసిన ఆండీ లాంగ్ గ్యుయెన్ స్టంట్ మాస్టర్‌గా పని చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఇతర యాక్టర్స్, అప్డేట్స్ రానున్నాయి.





















