Peddi Special Song: మృణాల్ కాదు... మానస లేదు... సంయుక్తకు 'పెద్ది' స్పెషల్ సాంగ్ ఛాన్స్
Peddi Latest Update: పెద్ది స్పెషల్ సాంగ్ విషయంలో కన్‌ఫ్యూజన్ తీరినట్టే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో స్టెప్పులు వేసే అవకాశాన్ని యంగ్ అండ్ హ్యాపెనింగ్ హీరోయిన్ సంయుక్త సొంతం చేసుకున్నారని తెలిసింది.

- పెద్ది సినిమాలో రామ్ చరణ్ తో సంయుక్త స్పెషల్ సాంగ్ చేస్తున్నారని తెలిసింది.
- పెద్ది చిత్రంలోని ప్రత్యేక పాట చిత్రీకరణ త్వరలో మొదలుకానుంది.
- పెద్ది సినిమా జూన్ 4న విడుదల కానుందని టాక్
- సానా బుచ్చిబాబు దర్శకత్వంలోని 'పెద్ది' చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) సినిమాలో స్పెషల్ సాంగ్ అంటే ఓ క్రేజ్ ఉంటుంది. 'రంగస్థలం'లో సమంత హీరోయిన్ అయినప్పటికీ... 'జిల్ జిల్ జిగేలు రాణి' సాంగ్ చేసిన పూజా హెగ్డేకు సైతం అంతే పేరు వచ్చింది. అందుకే, 'పెద్ది' స్పెషల్ సాంగ్ గురించి ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లోనూ ఆ సాంగ్ ఎవరు చేస్తారు? అనే ఆసక్తి నెలకొంది. ఆ అవకాశం సంయుక్తను వరించిందని తెలిసింది.
'పెద్ది'లో సంయుక్త స్పెషల్ సాంగ్...
రామ్ చరణ్‌తో పాటు స్టెప్పులే స్టెప్పులు!
Samyukta For Peddi Special Song: 'పెద్ది' స్పెషల్ సాంగ్ విషయంలో ఎంతో మంది హీరోయిన్ల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. మృణాల్ ఠాకూర్ నుంచి 'కపుల్ ఫ్రెండ్లీ' ఫేమ్ మానసా వారణాసి వరకు... పలువురు అందాల భామలు రామ్ చరణ్ తో పాటు స్టెప్పులు వేసే అవకాశాన్ని అందుకున్నారని వార్తలు వచ్చాయి. అసలు స్పెషల్ సాంగ్ చేసేది ఎవరు? అనే కన్‌ఫ్యూజన్ కూడా నెలకొంది. ఇప్పుడు ఆ కన్‌ఫ్యూజన్‌కు ఫుల్ స్టాప్ పడినట్టే.
రామ్ చరణ్ సరసన 'పెద్ది' సినిమాలో స్పెషల్ సాంగ్ చేసే అవకాశం యంగ్ అండ్ హ్యాపెనింగ్ హీరోయిన్ సంయుక్తను వరించిందని తెలిసింది. పెర్ఫార్మన్స్ స్కోప్ ఉన్న హీరోయిన్ రోల్స్ చేశారు సంయుక్త. అయితే గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణతో 'అఖండ 2 తాండవం'లో 'జాజికాయ జాజికాయ' పాటలో మాస్ స్టెప్స్ కూడా వేశారు. సో... రామ్ చరణ్, సంయుక్త వేసే స్టెప్స్ మాస్ ఫీస్ట్ ఇస్తాయని చెప్పవచ్చు. త్వరలో ఈ సాంగ్ షూట్ చేయనున్నారు.
View this post on Instagram
జూన్ 4వ తేదీన థియేటర్లలోకి 'పెద్ది'
Peddi Movie New Release Date: 'పెద్ది'ని ఏప్రిల్ నెలాఖరున థియేటర్లలోకి తీసుకు రావాలని ప్లాన్ చేశారు. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులకు మరింత సమయం అవసరం అవుతుందని జూన్ నెలకు వాయిదా వేశారు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... జూన్ 4వ తేదీన విడుదల చేయడానికి ప్లాన్ చేశారట.
Also Read: Prakash Raj: రాముణ్ణి వెక్కరించలేదు... ఇది మతోన్మాద రాజకీయ నాయకులు ఏడుపు - ప్రకాష్ రాజ్ రియాక్షన్
రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న 'పెద్ది' చిత్రానికి సానా బుచ్చిబాబు దర్శకుడు. 'ఉప్పెన' తర్వాత ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థల సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు.
Also Read: Shruti Haasan: ఎవర్రా మమ్మీ... శృతి హాసన్‌కు కోపం వచ్చింది
Before You Go
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
ట్రెండింగ్ వార్తలు






















