Payal Rajput: పాన్ ఇండియా సినిమాలో ఛాన్స్ కొట్టేసిన పాయల్ రాజ్ పుత్... మూవీ లాంచ్ అప్డేట్ వచ్చేసింది
Payal Rajput : పాయల్ రాజ్ పుత్ ను తాజాగా పాన్ ఇండియా ఛాన్స్ వరించింది. ఈ మూవీకి సంబంధించిన డీటైల్స్ ను మూవీ లాంచ్ సందర్భంగా జనవరి 24న అనౌన్స్ చేయనున్నారు.

'ఆర్ఎక్స్ 100' సినిమాతో యూత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను దక్కించుకున్న గ్లామరస్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ (Payal Rajput). గత కొన్నాళ్ల నుంచి ఈ బ్యూటీకి పెద్దగా సినిమాలు కలిసి రావట్లేదు. అయితే ఇటీవల కాలంలో సినిమాల వేగాన్ని తగ్గించిన పాయల్ 2025లో ఏకంగా పాన్ ఇండియాను టార్గెట్ చేసింది. తాజాగా పాయల్ రాజ్ పుత్ పాన్ ఇండియా సినిమా అప్డేట్ వచ్చేసింది.
పాన్ ఇండియా సినిమాలో పాయల్
పంజాబీ ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పుత్ మొదటి సినిమా 'ఆర్ఎక్స్ 100'తోనే టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ అమ్మడి అందాల ఆరబోతకు యూత్ ఫిదా అయ్యింది. ఆ తర్వాత వరుస సినిమాలు చేసే అవకాశం వచ్చినప్పటికీ అదృష్టం మాత్రం అదనంత దూరంలోనే ఉండిపోయింది పాయల్ కి. 'మంగళవారం' సినిమాతో మరోసారి సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న పాయల్ కు ఓవైపు సినిమాలు, మరోవైపు వెబ్ సిరీస్ లు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ బ్యూటీ ఓ పాన్ ఇండియా సినిమాతో తెరపైకి రాబోతోంది.
పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా, టికెట్ ఎంటర్టైన్మెంట్స్, అర్జున్ ఆర్ట్స్ బ్యానర్లపై ఓ పాన్ ఇండియా సినిమా సిద్ధం కాబోతోంది. ఈ మూవీకి ముని దర్శకత్వం వహిస్తుండగా, జనవరి 24న హైదరాబాద్లోని రామనాయుడు స్టూడియోలో మూవీ లాంచ్ ఈవెంట్ జరగబోతోంది. ఇందులో పాయల్ రాజ్ పుత్ పాత్ర ఎమోషనల్ గా ఉండబోతుందని తెలుస్తోంది. గ్లామర్ తో పాటు పాయల్ ను సరికొత్తగా చూపించబోతున్నారని సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను జనవరి 24న మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేయబోతున్నారు. ఇక 'ఆర్ఎక్స్ 100', 'మంగళవారం' తర్వాత ఆ రేంజ్ లో హిట్ ఇచ్చే మూవీ ఇదే అవుతుందని, ఆశలన్నీ పాయల్ రాజ్ పుత్ ఈ సినిమాపైనే పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది.
Also Read: 'హరిహర వీరమల్లు' నుంచి ఫుల్ సాంగ్ వచ్చేసిందోచ్... పవన్ కళ్యాణ్ ఎలా పాడారో విన్నారా?
పాయల్ కిట్టిలో ఉన్న సినిమాలు
గత ఏడాది ఒకే ఒక్క మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన పాయల్... ప్రస్తుతం సినిమాలో ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ బోల్డ్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న 'త్రీ రోజెస్' వెబ్ సిరీస్ సీజన్ 2 లో నటిస్తోంది. త్వరలోనే ఈ సిరీస్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. అలాగే ఈ అమ్మడు 'గోల్ మాల్' అనే సినిమాతో కోలీవుడ్ లోకి కూడా అడుగు పెట్టబోతోంది. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ జానర్ లో రూపొందుతున్న ఈ మూవీలో తమిళ నటుడు జీవా హీరోగా నటిస్తున్నాడు. మొత్తానికి ఈ ఏడాది ఇటు పాన్ ఇండియా, అటు కోలీవుడ్లో అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది పాయల్. ఇప్పటికే తెలుగులో వెంకీ మామ, డిస్కో రాజా వంటి సినిమాలలో పాయల్ వెంకటేష్, రవితేజ వంటి స్టార్ హీరోల సరసన నటించింది. కానీ ఆ రెండు సినిమాలు కూడా ఆమె కెరీర్ కు పెద్దగా ఉపయోగపడలేదు. మరి ఈ పాన్ ఇండియా సినిమాతో పాయల్ ఫేట్ మారుతుందేమో చూద్దాం.
Also Read: పటౌడీ వారసుడు, వేల కోట్ల ఆస్తులకు అధిపతి... నవాబ్ సైఫ్ జీవితంలో ఆసక్తికర విషయాలు తెలుసా?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

