Maata Vinaali Song: 'హరిహర వీరమల్లు' నుంచి ఫుల్ సాంగ్ వచ్చేసిందోచ్... పవన్ కళ్యాణ్ ఎలా పాడారో విన్నారా?
Maata Vinaali Song : 'హరిహర వీరమల్లు' సినిమాలో పవన్ కళ్యాణ్ పాడిన 'మాట వినాలి' ఫుల్ సాంగ్ తాజాగా రిలీజ్ అయ్యింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'హరిహర వీరమల్లు పార్ట్ 1 : స్వార్డ్ వర్సెస్ స్పిరిట్'. తాజాగా ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాడిన 'మాట వినాలి' ఫుల్ సాంగ్ ను నిర్మాతలు రిలీజ్ చేశారు.
'మాట వినాలి' సాంగ్ రిలీజ్...
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, జ్యోతి కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ 'హరిహర వీరమల్లు'. టాలీవుడ్ బడా నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో, మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏ దయాకర్ రావు ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా, 'హరిహర వీరమల్లు' ఫస్ట్ సాంగ్ గురించి పవర్ స్టార్ అభిమానులు చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. 'మాట వినాలి' అనే ఈ సాంగ్ ను ఎట్టకేలకు ఈరోజు రిలీజ్ చేశారు. స్వయంగా ఈ పాటను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాడడం విశేషం.
వాయిదా తరువాత...
తాజాగా రిలీజ్ అయిన 'మాట వినాలి' లిరికల్ వీడియోను రిలీజ్ చేయడంతో 'హరిహర వీరమల్లు' మేకర్స్ మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఇక ఈ పాటలో 'వినాలి, వీరమల్లు మాట చెప్తే వినాలి' అంటూ పవన్ కళ్యాణ్ తెలంగాణ మాండలికంలో పాడే పాట పవర్ ఫుల్ గా ఉంది. మంచి జానపద బీట్ తో సాగిన ఈ పాటకు పెంచల్ దాస్ సాహిత్యం అందించారు. అటవీ నేపథ్యంలో రూపొందించిన 'మాట వినాలి' పాట విజువల్స్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. అడవిలో మంట చుట్టూ వీరమల్లు తన అనుచరులతో కలిసి కూర్చోవడం, ఆ టైంలో పవన్ కళ్యాణ్ ఈ పాట పాడడం లిరికల్ వీడియోలో కనిపిస్తోంది. ఈ పాట రిలీజ్ అయిన కొన్ని నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 'మాట వినాలి' పాటకు కీరవాణి అందించిన సంగీతం స్పెషల్ గా ఉంది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్వయంగా ఈ పాటలు పాడడం మరో స్పెషల్ అట్రాక్షన్. ఈ పాట జనవరి 6 నే రిలీజ్ కావలసి ఉంది. కానీ వాయిదా పడి, ఎట్టకేలకు ఈరోజు రిలీజ్ అయ్యింది.
#HariHaraVeeraMallu 1st Single is OUT NOW! 🔥 🌪#MaataVinaali - https://t.co/2oP0dJCtZK#BaatNirali - https://t.co/ddruCeq6yc#KekkanumGuruve - https://t.co/3z7eSa9cVc#MaathukeLayya - https://t.co/BJxpqgHtZI#KelkkanamGuruve - https://t.co/MrHNmQo2LX pic.twitter.com/bs2vonazje
— Hari Hara Veera Mallu (@HHVMFilm) January 17, 2025
5 భాషల్లో సాంగ్ రిలీజ్
'హరిహర వీరమల్లు' మూవీ భారీ స్థాయిలో ఒకేసారి ఐదు భాషల్లో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కాబోతోంది. అందులో భాగంగానే తాజాగా 'మాట వినాలి' పాటను తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేశారు. ఈ పాటని తెలుగులో పెంచల్ దాస్, తమిళంలో పీఏ విజయ్, మలయాళంలో మంకొంగు గోపాలకృష్ణ, కన్నడలో ఆజాద్ వరదరాజ్, హిందీలో అబ్బాస్ టైరేవాలా సాహిత్యం అందించారు.
17వ శతాబ్దపు మొగల్ సామ్రాజ్యం నేపథ్యంలో భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న 'హరిహర వీరమల్లు' సినిమాలో పవన్ కళ్యాణ్ యోధుడిగా కనిపించబోతున్నారు. ఇందులో బాబి డియోల్, నిధి అగర్వాల్, నర్గీస్ ఫక్రి తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం చివరి దశ షూటింగ్ లో ఉన్న 'హరిహర వీరమల్లు' సినిమాను 2025 మార్చి 28న భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. మరోవైపు ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.
Also Read: సైఫ్ అలీ ఖాన్ మీద ఎటాక్ జరుగుతుంటే కరీనా ఎక్కడ ఉంది? కత్తిపోట్ల నుంచి ఐసీయూలో సర్జరీ వరకు...





















