అన్వేషించండి

Payal Rajput: పాయల్ ప్రమోషన్ చెయ్యనని చెప్పిన కాంట్రవర్షియల్ సినిమా టీజర్ - ఇప్పుడు ఏం చేస్తుందో హీరోయిన్?

Rakshana Teaser: పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా నటించిన ‘రక్షణ’ మూవీ చుట్టూ ఎన్ని కాంట్రవర్సీలు క్రియేట్ అవుతున్నా మేకర్స్ తాజాగా టీజర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

Payal Rajput Rakshana movie teaser is out now: ప్రస్తుతం పాయల్ రాజ్‌పుత్ అప్‌కమింగ్ మూవీ ‘రక్షణ’ గురించి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ నడుస్తోంది. ఈ సినిమాకు తాను ప్రమోషన్స్ చేయను అని, తనకు ఇంకా పేమెంట్ రావాలని పాయల్ ఓపెన్‌గా స్టేట్‌మెంట్ ఇచ్చింది. ఆమెకు ఇవ్వాల్సింది ఆరు లక్షలేనని, ప్రమోషన్స్ చేస్తే ఆ డబ్బులు ఇస్తామని చెప్పినా రాలేదని దర్శక నిర్మాత ప్రణదీప్ ఠాకోర్ తరఫున తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి లేఖ విడుదల చేసింది. తాజాగా ‘రక్షణ’ సినిమా టీజర్‌ విడుదల చేశారు.

వాడెవడో తెలీదు... టీజర్ చూశారా?

ఒక బిల్డింగ్‌పై నుండి ఒక అమ్మాయి కింద పడిపోవడంతో ‘రక్షణ’ టీజర్ మొదలవుతుంది. ఆ తర్వాత పాయల్ రాజ్‌పుత్ ఉలిక్కిపడి లేస్తుంది. ‘వాడెవడో తెలీదు.. కానీ ఎలాంటి వాడో తెలుసు’ అంటూ తను వెతుకుతున్న వ్యక్తి గురించి చెప్తుంది. ఆ వ్యక్తి కోసం వేట మొదలు పెడుతుంది. ‘ఇప్పటివ రకు నేను వాడిని కచ్చితంగా కలవలేదు. ఏ రోజు నేను వాడిని కలుస్తానో అదే వాడికి ఆఖరి రోజు’ అంటూ కనిపించని విలన్‌కు వార్నింగ్ ఇస్తుంది. అలా కొన్ని డైలాగులు, చాలా ఫ్లాష్ కట్స్‌తో ‘రక్షణ’ టీజర్‌ను విడుదల చేసింది మూవీ టీమ్. మొత్తానికి ఇదొక క్రైమ్ థ్రిల్లర్ అని మాత్రం స్పష్టమవుతుంది.

మొదటిసారి పోలీస్ ఆఫీసర్‌గా..

‘రక్షణ’ టీజర్‌ను బట్టి చూస్తే.. ఇందులో కథను ఏ మాత్రం రివీల్ చేయడానికి ఇష్టపడలేదు దర్శకుడు ప్రణదీప్ ఠాకోర్. పాయల్ రాజ్‌పుత్ ఒక పోలీస్ ఆఫీసర్.. తను ఒక కేసును ఇన్వెస్టిగేట్ చేస్తుంది. కానీ అది ఏం కేసు, అసలు విలన్ ఎవరు అనే విషయాన్ని టీజర్‌లో సీక్రెట్‌గా ఉంచారు. మొదటిసారిగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించినా కూడా పాయల్.. తన నటనతో అందరినీ ఆకట్టుకోనుందని టీజర్ చూస్తే అర్థమవుతోంది. పైగా ‘రక్షణ’ టీజర్ మధ్యలో ఇది ఒక నిజ జీవిత సంఘటన ఆధారంగా తెరకెక్కిందని చెప్తూ ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి క్రియేట్ చేశాడు దర్శకుడు. క్రైమ్ థ్రిల్లర్ జోనర్ సినిమాలను ఇష్టపడేవారికి ‘రక్షణ’ కచ్చితంగా నచ్చుతుందని టీజర్‌ను చూసిన నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

స్పందించలేదు..

‘రక్షణ’ సినిమా షూటింగ్ పూర్తయ్యి దాదాపు మూడు సంవత్సరాలు అయిపోయింది. అయితే ఇప్పుడు తన క్రేజ్‌ను, స్టార్‌డమ్‌ను ఉపయోగించుకొని ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారని పాయల్ రాజ్‌పుత్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఆరోపించింది. అంతే కాకుండా తనకు ఇవ్వాల్సిన పేమెంట్ కూడా ఇంకా ఇవ్వలేదని చెప్తూ వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించింది. దీంతో మూవీ నిర్మాతలు స్పందించారు. పాయల్‌కు ఇవ్వాల్సింది 6 లక్షలే అని, ఈ విషయం మాట్లాడడానికి ఫోన్ చేసినా కూడా పాయల్ సరిగా స్పందించలేదని సినీ నిర్మాతలు తెలిపారు. అంతే కాకుండా తాము కాంటాక్ట్ అవ్వడానికి ప్రయత్నించినా స్పందించకుండానే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిందని తెలిపారు.

Also Read: పాయల్‌కు ఇవ్వాల్సింది 6 లక్షలే - నాన్ కోపరేషన్ చేసి ఇన్‌స్టాలో పోస్ట్, ఆమె ఆరోపణల్ని ఖండించిన TFPC

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget