అన్వేషించండి

పవర్ స్టార్ ఈజ్ బ్యాక్, గన్‌తో అదరగొట్టిన పవన్ - యాక్షన్‌లోకి దిగిన ఉస్తాద్ భగత్ సింగ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా 'ఉస్తాద్ భగత్ సింగ్' షూటింగ్లో జాయిన్ అయ్యారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ సోషల్ మీడియాలో ఓ పోస్టర్ ని రిలీజ్ చేశారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మళ్లీ యాక్షన్ మోడ్ లోకి వచ్చేసారు. ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీస్ లో 'ఉస్తాద్ భగత్ సింగ్' (Ustaad Bhagat Singh Movie) కూడా ఒకటి. తాజాగా ఈ సినిమా చిత్రీకరణలో జాయిన్ అయ్యారు పవన్ కళ్యాణ్. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. రాజకీయాలతో బిజీగా ఉండడంతో తాను కమిటీ అయిన సినిమాలకు సమయం దొరికినప్పుడల్లా కాల్ షీట్స్ కేటాయిస్తూ షూటింగ్ పూర్తి చేస్తున్నారు పవన్. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కావడంతో ఆయన నటిస్తున్న 'OG' సినిమాకు సంబంధించి టీజర్, ఈ 'ఉస్తాద్ భగత్ సింగ్' పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.

గత వారం రోజులుగా పవర్ స్టార్ ఫ్యాన్స్ అంతా 'OG' మత్తులోనే ఉన్నారు. టీజర్ లో దర్శకుడు సుజిత్ స్టైలిష్ మేకింగ్ తో పాటు గ్యాంగ్ స్టర్ గా పవన్ కళ్యాణ్ ని స్టైల్, యాక్షన్, స్వాగ్ ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. దానికి తోడు తమన్ బీజీయం టీజర్ ని నెక్స్ట్ లెవెల్ ఎలివేట్ చేసింది. దీంతో ఫ్యాన్స్ అంతా ప్రస్తుతం 'OG' వైబ్ లో ఉండగా దాన్ని మరింత రెట్టింపు చేస్తూ దర్శకుడు హరీష్ శంకర్ 'ఉస్తాద్ భగత్ సింగ్ ' నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. తాజాగా పవన్ కళ్యాణ్ మళ్లీ 'ఉస్తాద్ భగత్ సింగ్' సెట్స్ లో అడుగుపెట్టారు. నిజానికి ఈ మూవీ లేటెస్ట్ షెడ్యూల్ రెండు రోజుల ముందే మొదలవ్వాల్సి ఉన్నా, తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపిలేని వర్షాల కారణంగా షూటింగ్ ఆగిపోయింది.

అయితే తాజాగా ఈ సినిమాను నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ పవన్ కళ్యాణ్ షూటింగ్లో జాయిన్ అయ్యారు అంటూ ఓ పోస్టర్ ని రిలీజ్ చేస్తూ 'మాసివ్ షెడ్యూల్ లో పవర్ ప్యాక్డ్ సీన్స్ ని షూట్ చేస్తున్నట్లు' తెలిపారు. పోస్టర్ లో పవన్ కళ్యాణ్ గన్ పట్టుకుని చైర్ లో కూర్చుని మాస్ లుక్ లో అదరగొట్టేసారు. ఈ అప్డేట్ తో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇక ఈ షెడ్యూల్లో పవన్ కళ్యాణ్ పై  భారీ యాక్షన్ సీక్వెన్స్ ని చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని తెలియజేస్తూ దర్శకుడు హరీష్ శంకర్ రెండు రోజుల క్రితం 'ఉస్తాద్ భగత్ సింగ్' షూటింగ్ సెప్టెంబర్ 5 నుంచి పునః ప్రారంభం కాబోతుందని అప్డేట్ ఇస్తూ ఓ పిక్ ని షేర్ చేశారు. అందులో హరీష్ శంకర్ నిలబడి ఉండగా, ఆయన ఎదురుగా రకరకాల కత్తులు ఉన్నాయి.

దీంతో లేటెస్ట్ షెడ్యూల్లో హరిశ్ శంకర్ ఓ మాసివ్ యాక్షన్ ఎపిసోడ్ ని చిత్రీకరించినట్లు తెలుస్తోంది. 'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత హరీష్ శంకర్ - పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో రాబోతున్న మూవీ కావడంతో ఈ సినిమాపై ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్లే హరీష్ శంకర్ ఈ మూవీని ప్లాన్ చేసినట్లు సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్ సరసన శ్రీ లీలా హీరోయిన్గా నటిస్తోంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని వచ్చే ఏడాది వేసవి కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

Also Read : మమ్ముట్టి మాస్, ఫైర్ అంతే - 'భ్రమ యుగం'లో మలయాళ మెగాస్టార్ లుక్ చూశారా?

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Renu Desai Reaction : అందుకే ఆ రోజు నేను సైలెంట్‌గా ఉన్నా - రేణూ దేశాయ్ స్ట్రాంగ్ రియాక్షన్
అందుకే ఆ రోజు నేను సైలెంట్‌గా ఉన్నా - రేణూ దేశాయ్ స్ట్రాంగ్ రియాక్షన్
Medical Thriller OTT : మనిషికి గుండె కుడివైపు ఉంటే? - ఓటీటీలోకి మెడికల్ సస్పెన్స్ థ్రిల్లర్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
మనిషికి గుండె కుడివైపు ఉంటే? - ఓటీటీలోకి మెడికల్ సస్పెన్స్ థ్రిల్లర్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Pawan Kalyan Anna Konidela : పవన్ కల్యాణ్ అనా విడాకులు - అసలు రీజన్ ఏంటి?... గతాన్ని గుర్తు చేసుకుంటూ ఫ్యాన్స్ ఎమోషనల్
పవన్ కల్యాణ్ అనా విడాకులు - అసలు రీజన్ ఏంటి?... గతాన్ని గుర్తు చేసుకుంటూ ఫ్యాన్స్ ఎమోషనల్
Polimera 3 Viraavi : 'పొలిమేర'లో పవర్ ఫుల్ విరావి వచ్చేశాడు - యాక్షన్ కింగ్ అర్జున్ న్యూ లుక్ చూశారా?
'పొలిమేర'లో పవర్ ఫుల్ విరావి వచ్చేశాడు - యాక్షన్ కింగ్ అర్జున్ న్యూ లుక్ చూశారా?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: 9 సార్లు ఛాన్స్ ఇచ్చిన కాంగ్రెస్.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా చిన్నారెడ్డి! అసలేం జరుగుతోంది?
9 సార్లు ఛాన్స్ ఇచ్చిన కాంగ్రెస్.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా చిన్నారెడ్డి! అసలేం జరుగుతోంది?
పవన్ కల్యాణ్ అనా విడాకులు - వైరల్ అవుతోన్న చాగంటి కోటేశ్వరరావు ప్రవచనం!
పవన్ కల్యాణ్ అనా విడాకులు - వైరల్ అవుతోన్న చాగంటి కోటేశ్వరరావు ప్రవచనం!
Revanth Reddy KTR Personal Attack : కేసీఆర్ సైలెన్స్ - కేటీఆర్‌నే ఇక ప్రత్యర్థిగా రేవంత్ పరిగణిస్తున్నారా?
కేసీఆర్ సైలెన్స్ - కేటీఆర్‌నే ఇక ప్రత్యర్థిగా రేవంత్ పరిగణిస్తున్నారా?
AP CPS Employees: సీపీఎస్ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్... ఓపీఎస్‌లోకి మారేందుకు అవకాశం!
సీపీఎస్ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్... ఓపీఎస్‌లోకి మారేందుకు అవకాశం!
Pawan kalyan Divorce: షాకింగ్ విషయం తెలిపిన పవన్ కల్యాణ్.. అనా లెజ్‌నెవాతో వివాహబంధానికి వీడ్కోలు
Pawan kalyan Divorce: షాకింగ్ విషయం తెలిపిన పవన్ కల్యాణ్.. అనా లెజ్‌నెవాతో వివాహబంధానికి వీడ్కోలు
Telangana Politics: కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీ సమరం.. కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్!
కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీ సమరం.. కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్!
Tulsi Leaves Benefits : తులసి ఆకులు రోజూ తింటే ఏమవుతుంది? జీర్ణక్రియ నుంచి రోగనిరోధక శక్తి వరకు లాభాలివే
తులసి ఆకులు రోజూ తింటే ఏమవుతుంది? జీర్ణక్రియ నుంచి రోగనిరోధక శక్తి వరకు లాభాలివే
Polimera 3 Viraavi : 'పొలిమేర'లో పవర్ ఫుల్ విరావి వచ్చేశాడు - యాక్షన్ కింగ్ అర్జున్ న్యూ లుక్ చూశారా?
'పొలిమేర'లో పవర్ ఫుల్ విరావి వచ్చేశాడు - యాక్షన్ కింగ్ అర్జున్ న్యూ లుక్ చూశారా?
Embed widget