Mammootty Birthday : మమ్ముట్టి మాస్, ఫైర్ అంతే - 'భ్రమ యుగం'లో మలయాళ మెగాస్టార్ లుక్ చూశారా?
Bramayugam First Look Poster : మలయాళ స్టార్ మమ్ముట్టి పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న 'భ్రమయుగం' సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు. ఈ పోస్టర్లో మమ్ముట్టి లుక్ భయంకరంగా ఉంది.
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి (Mammootty)కి మలయాళం తో పాటు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. మహి. వి రాఘవ తెరకెక్కించిన 'యాత్ర' సినిమాతో మమ్ముట్టి తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యారు. ఈ మధ్య ఆయన నటిస్తున్న మలయాళీ సినిమాలు తెలుగులో డబ్ అయి ఇక్కడ కూడా మంచి రెస్పాన్స్ అందుకుంటున్నాయి. ఇదిలా ఉంటే మమ్ముట్టి ఈ రోజు (సెప్టెంబర్ 7 న) తన 72వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకి బర్త్డే విషెస్ అందజేస్తున్నారు. మరోవైపు మమ్ముట్టి పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న కొత్త సినిమాలకు సంబంధించి వరుస అప్డేట్స్ ఇస్తున్నారు మేకర్స్.
ఈ క్రమంలోనే మమ్ముట్టి నటిస్తున్న 'భ్రమయుగం' (Bramayugam Movie) సినిమా నుంచి ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ నిర్మాతలు విడుదల చేశారు. రీసెంట్ గానే మేకర్స్ ఈ సినిమా నుంచి విడుదల చేసిన టైటిల్ పోస్టర్ మంచి రెస్పాన్స్ ని అందుకుంది. హారర్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి 'భూతకాలం' మూవీ ఫేమ్ రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఫస్ట్ లుక్ లో మమ్ముట్టి చాలా భయంకరంగా కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ టోటల్ బ్లాక్ థీమ్ తోనే డిజైన్ చేశారు మేకర్స్. అందులో మమ్ముట్టి తన స్మైల్ తో అదరగొట్టేసారు. సినిమాలో ఆయన పాత్ర చాలా డిఫరెంట్ గా ఉండబోతుందని అర్థమవుతుంది. ఈ పోస్టర్ తో సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో మమ్ముట్టి ఫస్ట్ లుక్ వైరల్ అవుతోంది.
#HappyBirthdayMammukka ! ✨
— Night Shift Studios LLP (@allnightshifts) September 7, 2023
Here is the #Bramayugam Special Poster in Tamil, Telugu, Kannada & Hindi !@mammukka #Mammootty #RahulSadasivan@chakdyn @sash041075@allnightshifts @studiosynot@SureshChandraa @pro_sabari @venupro pic.twitter.com/DSQkLFbbto
కేరళలోని చీకటి యుగాల నేపథ్యంలో ఈ సినిమా ఉండనున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ తో నైట్ షిఫ్ట్ స్టూడియోస్, వై నాట్ స్టూడియోస్ బ్యానర్ల పై రామచంద్ర, ఎస్. శశికాంత్ ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో అర్జున్ అశోకన్, సిద్ధార్థ్ భరతన్, అమల్దా లిజ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. షెహ్నాద్ జలాల్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. జోతిశ్ శంకర్ ప్రొడక్షన్ డిజైనర్‌గా, షాఫిక్ మహ్మద్ అలీ ఎడిటర్‌గా, క్రిస్టో.. మ్యూజిక్, టీడీ రామకృష్ణన్ డైలాగ్స్‌ను అందిస్తున్నారు. 2024 లో పాన్ ఇండియా లెవెల్ లో మలయాళం తో పాటు హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఈ సినిమాని విడుదల చేయనున్నారు.
ఇక రీసెంట్గా టాలీవుడ్ లో అక్కినేని అఖిల్ నటించిన 'ఏజెంట్' సినిమాలో మమ్ముట్టి కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీ బాక్స్ డిజాస్టర్ గా నిలిచింది. మరోవైపు 'భ్రమయుగం' సినిమాతో పాటు మమ్ముట్టి మలయాళంలో 'బజూక' అనే సినిమా చేస్తున్నారు. డీనో డెన్నిస్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ గేమ్ థ్రిల్లర్గా తెరకెక్కుతోంది. మమ్ముట్టి తో పాటూ గౌతమ్ వాసుదేవ్ మీనన్, టామ్ షైన్ ఛాకో, సుమిత్ నావల్, సిద్దార్ధ్ భరతన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial