(Source: Poll of Polls)
Most Popular Stars: మరోసారి టాప్‌లో నిలిచిన 'డార్లింగ్' ప్రభాస్ - అల్లు అర్జున్, రామ్ చరణ్‌లు ఏమే స్థానాల్లో ఉన్నారంటే..
మోస్ట్ పాపులర్ స్టార్స్ జాబితాలో మరోసారి డార్లింగ్ ప్రభాస్ టాప్‌లో నిలిచాడు. కాగా జూన్ నెలలకు సంబంధించిన ఇండియన్ మోస్ట్ పాపులర్ మేల్ స్టార్స్ జాబితాను ఆర్మాక్స్ మీడియా రిలీజ్ చేసింది.
Most Popular Indian Movie Stars List Of June 2024: ఈ మధ్య తెలుగు సినిమాలు వరల్డ్ బాక్సాఫీసును ఎలేస్తున్నాయి. 'బాహుబలి' నుంచి మొదలు టాలీవుడ్ చిత్రాలు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటున్నాయి. ఆ తర్వాత వచ్చిన బాహుబలి 2, పుష్ప, ఆర్ఆర్‌ఆర్ సినిమాలు ఇంటర్నేషనల్ స్థాయిలో సత్తా చాటాయి. దీంతో మన తెలుగు స్టార్స్ మార్కెట్ కూడా పెరిగిపోయింది. ఇక బాహుబలి తర్వాత అగ్ర హీరోలంతా పాన్ ఇండియా బాటపట్టారు. దీంతో నార్త్ నుంచి సౌత్ వరకు స్టార్ హీరో సినిమాలన్ని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతూ ప్రపంచవ్యాప్తంగా సత్తాచాటుతున్నాయి.
అలా వరల్డ్ వైడ్‌గా మన ఇండియన్ హీరోలకు గుర్తింపు పొందుతున్నారు. అలా ఈ ఏడాది మోస్ట్ పాపులర్ అయిన మన ఇండియన్ హీరో జాబితా విడుదలైంది. ప్రముఖ ఆర్మాక్స్ మీడియా సంస్థ నిర్వహించన సర్వే ప్రకారం మన టాలీవుడ్ రెబల్ స్టార్ టాప్ ఉన్నారు. జూన్ నెలకు సంబంధించి ఇండియా వ్యాప్తంగా మోస్ట్ పాపులర్ స్టార్స్ జాబితాను తాజాగా ఆర్మాక్స్ మీడియా సంస్థ ప్రకటించింది. ఈ లిస్ట్‌లో ప్రభాస్ మొదటిస్థానంలో నిలవగా.. ఆ తర్వాత ప్లేస్‌లో బాలీవుడ్ కింగ్ ఖాన షారుక్ ఖాన్ నిలిచారు. ఈ జాబితా ప్రభాస్ నెంబర్ వన్‌గా ఉన్నాడు.
ఇక రెండు స్థానంలో షారుక్ ఖాన్, మూడవ స్థానంలో తమిళ స్టార్ హీరో దళపతి విజయ్, నాలుగో స్థానంలో అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ ఐదో ప్లేస్‌లో ఉన్నారు. ఆ తర్వాత వరుసగా మహేశ్ బాబు, అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, రామ్ చరణ్, హృతిక్ రోషన్ ఉన్నారు. కాగా ప్రభాస్ మే నెలలో రిలీజ్ ఈ సర్వేలోనూ ప్రభాస్ మొదటి స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా ఇదే సర్వేలో మరోసారి 'డార్లింగ్' టాప్‌లో నిలవడం విశేషం. సినిమా హిట్, ఫ్లాప్ అనే సంబంధం లేకుండా ప్రభాస్ వరల్డ్ వైడ్‌గా ఫుల్ క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. డార్లింగ్ సినిమా అంటే కాసలు వర్షమే అనేట్టు ప్రస్తుతం ప్రభాస్ మార్కెట్ పెరిగింది. మూవీ రిజల్ట్ ఎలా ఉన్న కనీసం రూ.350 నుంచి రూ.400 కోట్ల వరకు డార్లింగ్ సినిమాలు కలెక్షన్లు కొల్లగొడుతున్నాయి.
తాజాగా 'కల్కి 2898 ఏడీ'తోనూ ప్రభాస్ రికార్డులు కొల్లకొట్టాడు. ఈ సినిమా ఇప్పటికే వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరిన సంగతి తెలిసిందే. దీంతో ప్రభాస్ కేరీర్‌లో బాహుబలి తర్వాత వెయ్యి కోట్లు గ్రాస్ కలెక్షన్స్ చేసిన రెండో సినిమా కల్కి 2898 ఏడీ నిలిచింది. అంతేకాదు ప్రభాస్ కెరీర్‌లో రెండు సినిమాలు వెయ్యి కోట్లు సాధించిన రికార్డు కొట్టేశాడు. అంతేకాదు ఓవర్సిస్‌లోనూ కల్కి 2898 ఏడీ సత్తా చాటుతోంది. ఇది వరకు ఎన్నడు ఏ తెలుగు మూవీ చేయని కలెక్షన్స్ చేస్తూ రికార్ట్స్ నెలకొల్పుతుంది. నార్త్ అమెరికాలో 17 మిలియన్ల డాలర్లు గ్రాస్ వసూళ్లు చేసిన తొలి తెలుగు సినిమాగా కల్కి 2898 ఏడీ నిలిచింది. ఇక మూవీ విడుదలై నెల రోజుల గడిచిన ఇప్పటికి థియేటర్లో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతుంది ఈ చిత్రం.
Also Read: 'గేమ్ ఛేంజర్' రిలీజ్ ఎప్పుడో చెప్పిన నిర్మాత 'దిల్' రాజు - పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్