అన్వేషించండి

Operation Valentine OTT Release: ఓటీటీలోకి ‘ఆపరేషన్ వాలెంటైన్’ వచ్చేది అప్పుడే, ముందు తెలుగులో ఆ తర్వాతే హిందీ!

వరుణ్ తేజ్ లేటెస్ట్ మూవీ 'ఆపరేషన్ వాలెంటైన్' ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అనే విషయంలోనూ సదరు ఓటీటీ సంస్థ ఓ క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది.

Operation Valentine OTT Release: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆపరేషన్ వాలెంటైన్’. ఎయిర్ ఫోర్స్ ఆపరేషన్స్‌కు సంబంధించిన కథాంశంతో ఈ మూవీ రూపొందుతోంది. వైమానిక దాడులు, దేశభక్తి కలబోతగా తెరకెక్కుతోంది. తెలుగు, హిందీ భాషల్లో ఈ మూవీ నిర్మించారు. బాలీవుడ్ నటి, మాజీ మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతోంది. శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నఈ సినిమా మార్చి 1న విడుదలకు రెడీ అవుతోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ బాగా ఆకట్టుకోవడంతో, ఈ సినిమా కోసం మెగా అభిమానులు, సినీ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

‘ఆపరేషన్ వాలెంటైన్’ ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే?

‘ఆపరేషన్ వాలెంటైన్’ ఓటీటీ విడుదలకు సంబంధించి ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. స్ట్రీమింగ్ పార్ట్నర్ ప్రైమ్ వీడియో అని మేకర్స్ గతంలోనే టీజర్ ద్వారా వెల్లడించారు. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా, పలు కారణాలతో రెండు సార్లు వాయిదా పడింది. చివరకు మార్చి 1న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.  ఈ మూవీ థియేట్రికల్ రన్  పూర్తయిన తర్వాత అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రానుంది. థియేటర్లో రిలీజ్ అయిన నాలుగు వారాలకు తెలుగుతో పాటు ఇతర భాషల్లో విడుదలకానుంది. హిందీలో మాత్రం 8 వారాల తర్వాత రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది.

కళ్లు చెదిరే విజువల్ ట్రీట్

ఇక ఇప్పటికే విడుదలైన ‘ఆపరేషన్ వాలెంటైన్’  ట్రైలర్ లో కళ్లు చెదిరే ఎయిర్ విన్యాసాలు ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించాయి. ఎయిర్ ఫోర్స్ కమాండర్ గా వరుణ్ తేజ్ అద్భుత నటనతో ఆకట్టుకున్నారు. వరుణ్ డైలాగులు బుల్లెట్లలా పేలాయి.  యుద్ధ విమానాలతో వరుణ్ చేసే సాహసాలు అబ్బురపరిచాయి. వైమానిక దాడులను దర్శకుడు అత్యద్భుతంగా వెండితెరపై ఆవిష్కరించారు. కెప్టెన్ రుద్రగా వరుణ్ కనిపించడగా, ఎయిర్ ఫోర్స్ అధికారిగా హీరోయిన్ మానుషి నటించింది. ఇద్దరి మధ్య కెమెస్ట్రీ కూడా జనాలను ఆకట్టుకునేలా ఉంది.

మార్చి 1న ప్రేక్షకుల ముందుకు

‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమాను భారత వైమానికి దాడులకు సంబంధించిన కొన్ని యథార్థ సంఘటనలను బేస్ చేసుకుని రూపొందిస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. సర్జికల్ స్ట్రైక్స్ తో పాటు, వురి సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసన్స్ పిక్చర్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ మూవీ మార్చి 1న పలు భాషల్లో విడుదలకు రెడీ అవుతోంది. ఈ సినిమాతోనే హిందీ ప్రేక్షకులకు వరుణ్ పరిచయం కాబోతున్నారు.

Read Also: సూపర్ స్టార్ లవ్ స్టోరీ: రజనీకాంత్ మామోలోడు కాదు, ఇంటర్వ్యూ చేసిన అమ్మాయినే పడేశాడు - ఆ బంధానికి 43 ఏళ్లు!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun: అల్లు అర్జున్‌కు భారీ ఊరట- నంద్యాల కేసు కొట్టేసిన హైకోర్టు 
అల్లు అర్జున్‌కు భారీ ఊరట- నంద్యాల కేసు కొట్టేసిన హైకోర్టు 
US Election 2024 Updates: అమెరికా అధ్యక్ష పదవికి చేరువలో డొనాల్డ్ ట్రంప్‌- 200పైగా ఎలక్టోరల్స్‌లో విజయం
అమెరికా అధ్యక్ష పదవికి చేరువలో డొనాల్డ్ ట్రంప్‌- 200పైగా ఎలక్టోరల్స్‌లో విజయం
Telangana Survey: 75 ప్రశ్నలతో తెలంగాణలో ఇంటింట సమగ్ర సర్వే- సేకరించే వివరాలు ఇవే
75 ప్రశ్నలతో తెలంగాణలో ఇంటింట సమగ్ర సర్వే- సేకరించే వివరాలు ఇవే
AP DSC 2024: ఏపీలో నిరుద్యోగులకు షాక్, 'మెగా డీఎస్సీ' ప్రకటనను వాయిదా వేసిన విద్యాశాఖ, కారణమిదేనా!
ఏపీలో నిరుద్యోగులకు షాక్, 'మెగా డీఎస్సీ' ప్రకటనను వాయిదా వేసిన విద్యాశాఖ, కారణమిదేనా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నాపై హత్యాయత్నం? ఆ ఖర్మ లేదు.. విజయమ్మ భావోద్వేగంIPL 2025 Mega Auction Date Announced | ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది | ABP Desamఇజ్రాయెల్ చేతిలో ఇరాన్ టెర్రర్ ఏజెంట్, ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ ఫెయిల్!బాంబు వెలిగించి దానిపై కూర్చున్న యువకుడు - షాకింగ్ సీసీటీవీ వీడియో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun: అల్లు అర్జున్‌కు భారీ ఊరట- నంద్యాల కేసు కొట్టేసిన హైకోర్టు 
అల్లు అర్జున్‌కు భారీ ఊరట- నంద్యాల కేసు కొట్టేసిన హైకోర్టు 
US Election 2024 Updates: అమెరికా అధ్యక్ష పదవికి చేరువలో డొనాల్డ్ ట్రంప్‌- 200పైగా ఎలక్టోరల్స్‌లో విజయం
అమెరికా అధ్యక్ష పదవికి చేరువలో డొనాల్డ్ ట్రంప్‌- 200పైగా ఎలక్టోరల్స్‌లో విజయం
Telangana Survey: 75 ప్రశ్నలతో తెలంగాణలో ఇంటింట సమగ్ర సర్వే- సేకరించే వివరాలు ఇవే
75 ప్రశ్నలతో తెలంగాణలో ఇంటింట సమగ్ర సర్వే- సేకరించే వివరాలు ఇవే
AP DSC 2024: ఏపీలో నిరుద్యోగులకు షాక్, 'మెగా డీఎస్సీ' ప్రకటనను వాయిదా వేసిన విద్యాశాఖ, కారణమిదేనా!
ఏపీలో నిరుద్యోగులకు షాక్, 'మెగా డీఎస్సీ' ప్రకటనను వాయిదా వేసిన విద్యాశాఖ, కారణమిదేనా!
Congress Nalgonda:  మూసిపై బీఆర్ఎస్ వాదనకు నల్లగొండ సెంటిమెంట్‌తో చెక్ - రేవంత్‌కే అడ్వాంటేజ్ !
మూసిపై బీఆర్ఎస్ వాదనకు నల్లగొండ సెంటిమెంట్‌తో చెక్ - రేవంత్‌కే అడ్వాంటేజ్ !
Andhra Politics: కూటమి పార్టీల మధ్య గ్యాప్ సృష్టించిన పవన్ - వైఎస్‌ఆర్‌సీపీ చేయాలనుకున్నదే చేసి పెట్టారా ?
కూటమి పార్టీల మధ్య గ్యాప్ సృష్టించిన పవన్ - వైఎస్‌ఆర్‌సీపీ చేయాలనుకున్నదే చేసి పెట్టారా ?
Actress Kasthuri: తెలుగు వారికి క్షమాపణలు చెప్పిన నటి కస్తూరి- కామెంట్స్‌పై తమిళనాడులో కేసు నమోదు
తెలుగు వారికి క్షమాపణలు చెప్పిన నటి కస్తూరి- కామెంట్స్‌పై తమిళనాడులో కేసు నమోదు
RRB: ఇకపై ఆంధ్రప్రదేశ్‌లో ఒకటే గ్రామీణ బ్యాంక్‌ - స్పెషల్‌ కేస్‌గా తెలంగాణ
ఇకపై ఆంధ్రప్రదేశ్‌లో ఒకటే గ్రామీణ బ్యాంక్‌ - స్పెషల్‌ కేస్‌గా తెలంగాణ
Embed widget