Salaar Songs: 'సలార్'లో పాటలు ఉండవా? - ఇది అస్సలు ఊహించలేదే?
Latest Update On Salaar : ప్రభాస్ హీరోగా నటిస్తున్న 'సలార్' మూవీలో కేవలం రెండు పాటలు మాత్రమే ఉంటాయని సోషల్ మీడియాలో ఓ న్యూస్ తెగ వైరల్ గా మారింది.
Salaar Movie Update : టాలీవుడ్ అగ్ర హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న 'సలార్' (Salaar) మూవీ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 'కేజిఎఫ్' (KGF) సిరీస్ ని డైరెక్ట్ చేసిన ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ మొదటిసారి చేస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ కావడంతో ఈ సినిమాపై ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఇప్పటికే ప్రమోషన్స్ విషయంలో ఆలస్యం చేసిన మూవీ యూనిట్ ఇక నుంచి సినిమాపై బజ్ క్రియేట్ చేసేందుకు బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇవ్వడానికి రెడీ అయింది.
మొన్నటి వరకు సలార్ విడుదల ఉంటుందా? లేదా అనే అనుమానాలు చాలానే వచ్చాయి. మూవీ నుంచి ఎటువంటి అప్డేట్ లేకపోవడమే దీనికి కారణం. నిజానికి సెప్టెంబర్ నెలలోనే సలార్ విడుదల కావాల్సింది. కానీ వీఎఫ్ఎక్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం అవ్వడంతో డిసెంబర్ కి షిఫ్ట్ చేశారు. డిసెంబర్ 1న 'సలార్' ట్రైలర్ విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే మేకర్స్ ట్రైలర్ కి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా చేశారు. దీంతో ట్రైలర్ కోసం సినీ లవర్స్ ఎంతో ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది.
అదేంటంటే, సలార్ లో కేవలం రెండు పాటలే ఉంటాయని సోషల్ మీడియాలో ఓ న్యూస్ తెగ వైరల్ అవుతుంది. అందులో ఒక ఐటమ్ సాంగ్ ఉండబోతుందని ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చింది. నిజానికి ఐటమ్ సాంగ్ ముందు ప్లానింగ్ లో లేదు. కానీ సినిమాకు హైప్ తేవడం కోసం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మళ్లీ ఫ్రెష్ గా ఐటమ్ సాంగ్ ని రెడీ చేయించినట్లు తెలుస్తోంది. సంగీత దర్శకుడు రవి బసూర్ ఎక్కువ బ్యాగ్రౌండ్ స్కోర్ మీదే ఫోకస్ చేయడంతో సలార్ లో రెండు పాటలే ఉంటాయని వార్తలు వినిపిస్తున్నాయి. 'కేజిఎఫ్' మూవీ విషయంలోనూ ఇదే జరిగింది. 'కేజిఎఫ్' లో యశ్ ఇంట్రో, ఐటమ్ సాంగ్ తో పాటూ అమ్మ పాట ఉంటుంది. ఇప్పుడు ‘సలార్’లో కేవలం రెండు పాటలే ఉంటాయట.
మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే ఐటెం సాంగ్ లో అయితే అసలు ప్రభాస్ కనిపించడని అంటున్నారు. అంటే ఐటమ్ సాంగ్ లో ప్రభాస్ ఎలాంటి స్టెప్పులు వేయడని తెలుస్తోంది. ఈ ఐటెం సాంగ్ షూటింగ్ జరిగినప్పుడు ప్రభాస్ ఇండియాలో లేడు. సర్జరీ కోసం విదేశాలకు వెళ్ళాడు. దీన్నిబట్టి సలార్ ఐటమ్ సాంగ్ లో ప్రభాస్ ఉండడనే విషయం స్పష్టమవుతుంది. మొత్తంగా సలార్ కేవలం రెండు పాటలే ఉంటాయని, అందులో ఐటమ్ సాంగ్ లో ప్రభాస్ కనిపించడనే వార్తలు నెట్టింట వైరల్ గా మారాయి.
మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే 'సలార్' ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యేంతవరకు వేచి చూడాల్సిందే. కాగా రీసెంట్ గా విదేశాల నుంచి హైదరాబాదులో ల్యాండ్ అయిన ప్రభాస్ సలార్ రెగ్యులర్ ప్రమోషన్స్ కోసం సిద్ధమవుతున్నాడు. మరి కొద్ది రోజుల్లోనే సౌత్, నార్త్ లో ప్రభాస్ సలార్ కోసం ప్రత్యేకంగా ప్రమోషన్స్ చేయబోతున్నారని, డార్లింగ్ తో పాటు మరి కొందరు యాక్టర్స్ ఈ ప్రమోషన్స్ లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది.
Also Read : ప్రకృతితో మమేకం, దైవ చింతనకు దగ్గరగా- భూటాన్ లో సామ్ ఎంజాయ్