HBD Nagarjuna: మన్మథుడిలో మనకు నచ్చే 5 క్వాలిటీస్.. నాగార్జున ఎందుకంత సూపర్ కూల్
అమ్మాయిల మనసుల్ని కొల్లగొట్టిన నవ మన్మథుడు నాగార్జున. చైన్ పట్టుకుంటే మాస్ హీరోలా శివమెత్తగలడు. అదే చేత్తో పువ్వు పట్టుకుంటే క్లాస్ హీరోగా ప్రేమను కురిపించగలడు.
ఆగస్టు 29.. టాలీవుడ్ మన్మథుడు నాగర్జున బర్త్ డే. భక్తికైనా.. రక్తికైనా.. క్లాస్ కైనా.. మాస్ కైనా.. బాస్.. ఈ పాత్ర.. ఆ పాత్ర అనేం లేదు.. ఏ పాత్రైనా.. ప్రయోగాలు చేయడంలోనైనా..ఆయనకు ఆయనే సాటి. ఎన్నో పాత్రలను పోషించి ముప్పై ఐదేళ్లుగా... సినీ జైత్రయాత్రను నిరాటంకంగా కొనసాగిస్తున్నాడు. నాగర్జునను చూస్తే ఎంత కూల్ గా ఉంటారో కదా. ఆయనలో కోపాన్ని చూడటం చాలా తక్కువగా కనిపిస్తుంది.
'నా రేంజ్ హీరోకి 50 కోట్లు వసూలు చేసే సినిమా వస్తుందనుకోలేదంటాడు. కవ్వించే సోగ్గాణ్ని అంటూనే కాళ్లు లేని క్యారెక్టర్ చేస్తాడు. కళ్ల ముందే స్టైల్ మార్చి, ఇమేజ్ అంటే నేను వేసుకునే చొక్కాలాంటిదని తేల్చేస్తాడు. కుర్ర హీరోలు ఇంత మంది ఉండగా వయసైనోళ్ళని ఎవరు చూస్తారు అనుకున్నవాళ్లతోనే.. చిన్న బ్రేక్.. చిటికెలో వచ్చేస్తా.. అంటూ వెయిట్ చేయిస్తాడు.' వావ్ అనిపిస్తున్న మన్మథుడిలో మనకు నచ్చే 5 క్వాలిటీస్ చూద్దాం.
నాగ్ చాలా కూల్ అండ్ కంపోజ్డ్ పర్సన్. ప్రయోగాలు చేయటానికి ముందుంటాడు. కొత్త డైరెక్టర్స్ ని పరిచయం చేస్తాడు. నాగ్ టాలీవుడ్ కి పరిచయం చేసినంత మంది హీరోయిన్స్, మరే హీరో చేయలేదేమో. నాగ్ క్లారిటీ వున్న హీరో. స్టార్ డమ్ పక్కనపెట్టి బుల్లితెర మీద ట్రెండ్ సెట్ చేసిన హీరో నాగార్జున. ఏజ్ నే ఛాలెంజ్ చేసే ఫిట్ నెస్ ఆయన సొంతం. మీ అబ్బాయిలకన్నా.. మీరే యంగ్ గా కనిపిస్తున్నారంటే మురిసిపోతారు.
ఈ వయసులో కూడా బాలీవుడ్ ప్రత్యేకంగా పిలుస్తుందంటే అది నాగ్ ఇమేజ్. పాన్ ఇండియా మూవీస్ ఇప్పుడు బాగా పాపులర్ అయ్యాయి కానీ.. రెండు దశాబ్దాల క్రితమే నాగ్ మూవీస్ వేరే భాషల్లో వచ్చేవి. నాగ్ గట్టిగా మాట్లాడ్డం, సీరియస్ అవ్వటం చాలా రేర్. ట్రెండ్ ఎలా సెట్ చేయాలో నాగ్ కి తెలిసినంతగా మరే హీరోకి తెలీదేమో. అందుకే ఊపిరి లాంటి సినిమా చేశారు.
ఓ హీరోగా ఎన్ని మెట్లు ఉంటాయో అన్నీ ఎక్కేస్తున్నాడు నాగ్. కమర్షియల్ సక్సెస్ గా శివ తొలిమెట్టు. డివోషనల్ లో అన్నమయ్య, ఫామిలీ ఎంటర్ టైనర్ సంతోషం. ఛాలెంజింగ్ రోల్ లో ఊపిరి. ఇలా ఎంత చెప్పుకున్నా తక్కువే. 51 ఏళ్లకి సిక్స్ పాక్ చూపించి.. ఆ తర్వాత వీల్ చెయిర్ కేరెక్టర్ చేయడమేంటి? క్రైసిస్ ని ఛాలెంజ్ చేసే కెపాసిటీ ఉన్నోడే ఇలాంటి డేరింగ్ డెసిషన్స్ తీసుకోగలడు. ఇంత మైన్యూట్ హ్యాండ్లింగ్ మరొకరిలో కనిపించదు ఇండియన్ స్క్రీన్ మీద.
ఏం కావాలో తెలిసినోడికి, ఎవరినీ నొప్పించాల్సిన అవసరం లేదు. ఎలా ఉండాలో అర్థమైనోడికి ఏం చేయాలో ఎవరో చెప్పాల్సిన పని లేదు. సింపుల్ గా ఇదే సీక్రెట్. ఫేడ్ అవుట్ అయ్యే సమయంలో బుల్లితెర మీదికి రావడం అంతులేని అడ్వాంటేజ్ అయ్యింది నాగ్ కి. ఆంటీలని, అమ్మాయిల్నీ, కుర్రోళ్లనీ, పెద్దోళ్ళని.. అందరినీ బుల్లితెరతో ఇంటింటికి వెళ్లి పలకరించాడు. నేను మీ నాగార్జున అనేసరికి అవును కదూ అంటూ అక్కున చేర్చుకున్నారు. సినిమా థియేటర్లకి రానివాళ్లని తనే ఇళ్లలోకి వచ్చి పలకరించాడు. అంతే రెండు పనులు అయిపోయాయ్. ఒకటి షో సక్సెస్. రెండోది ఇమేజ్ రినొవేషన్. నాగార్జునకి బలమేంటో కాదు.. బలహీనతలేంటో కూడా తెలుసు.
కాంట్రవర్సీలకు దూరంగా ఉంటూనే.. వ్యాపారాలు చేసుకోటం కూడా నాగ్ ప్రత్యేకత. సినిమాల్లో అయినా, సైలెంట్ గా చేసుకునే బిజినెస్ లో అయినా.. పర్సనల్ ప్రమోషన్స్ లో అయినా నాగ్ ఈజ్ ఎ కూల్ పర్సన్. చాలామందికి ఇది అంత తేలిగ్గా అబ్బే ఆర్ట్ కాదు. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్. కాబట్టే అంత ప్రశాంతత సాధ్యమవుతోందేమో అనిపిస్తుంది నాగ్ ని చూస్తుంటే.