Nagarjuna Birthday Special: అక్కినేని ‘లవ్ స్టోరీ’.. నాగ్-అమలను కలిపింది రామానాయుడే! కింగ్‌ను భయపెట్టిన కిస్
టాలీవుడ్ కింగ్ నాగార్జున. వయస్సు 60 ఏళ్లు దాటినా.. నవ మన్ముథుడిలా ఆకట్టుకోవడం ఈ గ్రీకువీరుడి స్టైల్. మరి, ఆయన జీవితంలోని కొన్ని విశేషాలను తెలుసుకుందామా!
అభిమానులంతా ఆయన్ని ‘కింగ్’ అంటారు. అమ్మాయిలంతా ‘మన్మథుడు’ అంటారు. వెంకన్న భక్తులు మాత్రం ఆయన్ని ‘అన్నమయ్యా’ అంటారు. ఎవరు ఎలా పిలిచినా.. ఎలాంటి సాయమడిగినా ‘నేనున్నాను’ అంటారు నాగ్. టాలీవుడ్ సినీ పెద్ద మనుషుల్లో ఒకరిగా.. ఎంతోమంది యువ నటీనటుల్లో స్ఫూర్తిని నింపుతున్న అక్కినేని నాగార్జున పుట్టిన రోజు నేడు (ఆగస్టు 29). ఒక వైపు సినిమాల్లో హీరోగా.. మరో వైపు బుల్లితెర హోస్ట్‌గా బిజీగా గడిపేస్తూనే.. వ్యాపారాలను సైతం చక్కగా చక్కబెట్టేసే ఆల్ రౌండర్ మన కింగ్ నాగార్జున. మరి, ఆయన గురించి చాలామందికి కొన్ని విషయాలు తెలియవు. అవేంటో చూద్దామా.
అక్కినేని ‘లవ్‌స్టోరీ’: నాగార్జునకు 1984లో ప్రముఖ నిర్మాత డి.రామానాయుడు కుమార్తె, నటుడు విక్టరీ వెంకటేష్ సోదరి లక్ష్మీ దగ్గుబాటితో పెళ్లయ్యింది. వారికి కలిగిన సంతానమే నాగ చైతన్య. అయితే, నాగార్జున 1990లో లక్ష్మీకి విడాకులు ఇచ్చారు. అనంతరం 1992లో నటి అమలను పెళ్లి చేసుకున్నారు. 1994లో అఖిల్ జన్మించాడు. విడాకులకు ముందుగానే నాగార్జునకు అమలతో పరిచయం ఏర్పడింది. చిత్రం ఏమిటంటే.. అమల, నాగార్జులను కలిపింది రామానాయుడే. అయితే, రియల్ లైఫ్‌లో కాదు రీల్ లైఫ్‌లో.
ఔనండి.. డి.రామానాయుడు నిర్మించిన ‘చినబాబు’ సినిమాతోనే అమల టాలీవుడ్‌కు పరిచయమైంది. ఆ చిత్రంలో ఆమె నాగార్జున సరసన హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత 1989లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘శివ’ సినిమాతో ఇద్దరి మనసులు కలిశాయి. అప్పటి నుంచి ఇద్దరూ వరుసగా సినిమాలు చేశారు. ‘ప్రేమ యుద్ధం’, హిందీలో రీమేక్ చేసిన ‘శివ’ సినిమాలో కలిసి నటించారు. అయితే, 1991లో విడుదలైన ‘నిర్ణయం’ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరూ మరింత దగ్గరయ్యారు. అమలతో ప్రేమలో మునిగిపోయిన నాగార్జున ఆమె కోసం అమెరికా కూడా వెళ్లారు. అక్కడ షూటింగులో బిజీగా ఉన్న ఆమెకు తన మనసులో మాట చెప్పారట. ఆ వెంటనే ఆమె కూడా ఒకే చెప్పేసిందట. ఈ విషయం తెలిసి ఎ.ఎన్.ఆర్ షాకయ్యారట.
నాగేశ్వరరావుకు ఇష్టం లేదా?: లక్ష్మీతో విడాకులు.. ఆ వెంటనే అమలతో ప్రేమ వ్యవహారం.. నాగేశ్వరరావుకు ఇబ్బంది కలిగించాయని తెలిసింది. అమలతో పెళ్లి వద్దని చెప్పినా నాగార్జున మాట వినలేదని, దీంతో ఆయన నాగ్‌తో మాట్లాడటం మానేశారని సమాచారం. ఈ నేపథ్యంలో నటుడు మురళీ మోహన్.. నాగేశ్వరరావుతో మాట్లాడి.. కొడుకును దూరం చేసుకోవద్దని సూచించారట. దీంతో ఆయన కొడుకు, కోడలిని ఆశీర్వదించారట. ఇదీ.. నాగ్-అమల లవ్‌స్టోరీ. మరి నాగ్ జీవితంలో మరికొన్ని విశేషాలను కూడా చూసేద్దాం.
⦿ ఓ సినిమా షూటింగ్‌లో అమల వేసుకున్న కాస్ట్యూమ్స్ ఇబ్బందికరంగా ఉండటంతో నాగార్జున దర్శకుడికి చెప్పి మార్పించారట.
⦿ అక్కినేని నాగార్జున తొలిసారిగా.. 1961లో నాగేశ్వరరావు, సావిత్రి జంటగా నటించిన ‘వెలుగు నీడలు’ సినిమాలో పసివాడిగా వెండితెరపై కనిపించారు. అప్పుడు ఆయనకు సుమారు ఏడాది వయస్సు ఉంటుంది. ఆ తర్వాత ఆయన 1968లో విడుదలైన ‘సుడిగుండాలు’ సినిమాలో బాలనటుడిగా మెప్పించారు.
⦿ నాగార్జున అక్కినేని నాగేశ్వరరావు, అన్నపూర్ణ దంపతులకు నాగార్జున రెండవ కుమారుడు. నాగార్జున అన్నయ్య అక్కినేని వెంకట్ ప్రముఖ నిర్మాత.
⦿ 1976లో అక్కినేని నాగేశ్వరరావు హైదరాబాద్‌లోని 22 ఎకరాల స్థలంలో నిర్మించిన అన్నపూర్ణ స్టూడియో బాధ్యతలను నాగార్జున భుజాన్న వేసుకున్నారు.
⦿ అక్కినేని ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా సంస్థకు నాగార్జున, ఆయన సోదరుడు వెంకట్‌లు డైరెక్టర్లుగా ఉన్నారు.
⦿ రామ్ గోపాల్ వర్మ తండ్రి కృష్ణంరాజు.. తన కొడుకు ఒక కథ చెబుతాడు వినండని నాగార్జునను అడిగారట. ఆయనకు ఇచ్చిన మాటతోనే నాగ్ ‘శివ’ కథ విన్నారు.
⦿ ‘శివ’ స్టోరీ కంటే ముందు రామ్ గోపాల్ వర్మ ఓ హర్రర్ స్టోరీని నాగార్జునకు వినిపించారట.
⦿ ‘‘రాము నేను హర్రర్ చూడను, చేయను. తెలుగువాళ్లకు అది నచ్చుతుందో లేదో తెలీదు. మంచి కమర్షియల్ సినిమా చేద్దాం’’ అని చెబితే.. ‘శివ’ స్టోరీ చెప్పాడట.
⦿ నాగార్జునకు రూ.850 కోట్ల ఆస్తులు ఉన్నట్లు 2019లో ఓ వార్తా సంస్థ వెల్లడించింది.
⦿ సినిమాలు, ప్రకటనల్లో నటనకు వచ్చే పారితోషికంతోపాటు ఆయనకు చెందిన భవన నిర్మాణ సంస్థ, స్టూడియో ద్వారా కూడా మంచి ఆదాయం లభిస్తోందట.
⦿ నాగార్జునకు ఏటా రూ.30 కోట్లు సంపాదన వస్తుందనేది ఒకప్పటి సమాచారం.
⦿ నాగార్జునకు కార్లంటే చాలా ఇష్టమట. ఆయనకు రూ.65 లక్షలు విలువ చేసే రేంజ్ రోవర్, రూ.1.02 కోట్ల ఆడి A7, రూ.1.32 కోట్ల బీఎండబ్ల్యూ 7 సీరిస్, రూ.3 కోట్లు విలువ చేసే మెర్సిడెజ్ ఎస్-క్లాస్ కార్లు ఉన్నాయట.
⦿ ఫిల్మ్‌నగర్‌లోని నాగార్జున ఇల్లు రూ.42.3 కోట్లు విలువ చేస్తుందని నాలుగేళ్ల కిందటి టాక్. ప్రస్తుత ధర ప్రకారం దాని విలువ రెండింతలు ఉండవచ్చు.
ఆ ముద్దు సీన్ తీసేస్తారని నాగ్ భయం:
⦿ నాగార్జున నటించిన ‘గీతాంజలి’ సినిమాలో ముద్దు సీన్ అప్పట్లో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది.
⦿ ‘గీతాంజలి’ సినిమాలో నాగార్జున సుమారు రెండున్న నిమిషాలు ముద్దుపెట్టారట. అయితే, ఆ సీన్‌ను సెన్సార్ బోర్డు కట్ చేస్తుందని చాలా భయపడ్డారట.
⦿ ఆ ముద్దు సీన్ చూసిన ఆయన తండ్రి నాగేశ్వరరావు ఈ సినిమాకు ఇదే కీలకమని చెప్పారు. సెన్సార్ కట్ పడదని ధైర్యం చేప్పారని నాగ్ తెలిపారు.
⦿ ‘గీతాంజలి’ సినిమాలో ముద్దు సీన్ చేసిన దాదాపు 30 ఏళ్ల తర్వాత నాగ్.. ‘మన్మథుడు-2’ చిత్రంలో ముద్దుల దాడి చేశారు.
⦿ నాగార్జున తన ఫ్రెండ్, నటి టబుతో పదేళ్లు డేటింగ్ చేసినట్లు రూమర్స్ ఉన్నాయి. ఆమెకు ఇల్లు కూడా కొనిచ్చారనే ప్రచారం జరిగింది. నాగ్ పెళ్లికి నిరాకరించడంతో ఆమె బ్రేకప్ చెప్పినట్లు కొన్నాళ్ల కిందట వార్తలు షికార్లు చేశాయి.
Read Also: సావిత్రి చేతిలోని ఈ పసివాడు.. ఇప్పుడు స్టార్ హీరో, చెప్పుకోండి చూద్దాం