అన్వేషించండి

ఓం రౌత్, మనోజ్‌లను చంపేస్తాం, ముంబైలోనే లేపేస్తాం - ‘ఆదిపురుష్’ డైలాగ్స్‌పై క్షత్రియకర్ని సేన ఆగ్రహం

'ఆదిపురుష్'పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సినిమా దర్శకుడు ఓం రౌత్, మాటల రచయిత మనోజ్ ని చంపేస్తాం అంటూ క్షత్రియ కర్ణి సేన బెదిరించింది.

బాలీవుడ్ దర్శకుడు ఓమ్రావ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ కాంబినేషన్లో తెరకెక్కిన లేటెస్ట్ మైథలాజికల్ ఫిల్మ్ 'ఆదిపురుష్' జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై మిశ్రమ స్పందన కనబరిచిన సంగతి తెలిసిందే. రామాయణం ఇతిహాసం ఆధారంగా మోషన్ క్యాప్షన్ 3d టెక్నాలజీతో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను ఒకింత నిరాశపరిచిందనే చెప్పాలి. ఇక సినిమా టాక్ గురించి పక్కన పెడితే సినిమా విడుదలైనప్పుడు నుంచి ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉంది. ఈ సినిమాలో శ్రీరాముడు, సీత, హనుమంతుడు, రావణుని చూపించిన తీరుపై సినిమాలోని డైలాగులపై తీవ్రమైన విమర్శలు రావడం జరిగింది. దాంతో పలుచోట్ల నుంచి ఈ సినిమాను బ్యాన్ చేయాలనే డిమాండ్ కూడా వినిపించింది.

ఇక ఇదిలా ఉంటే తాజాగా ఆదిపురుష్ సినిమా యూనిట్ పై క్షత్రియ కర్ణి సేన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదిపురుష్ సినిమాలో వివాదాస్పద డైలాగులు ఉండడం, రాముడు, సీత, హనుమంతుడు, రావణుడి పాత్రలపై తీవ్ర అభ్యంతరాల వ్యక్తం చేయడమే కాకుండా తాజాగా మధ్యప్రదేశ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో క్షత్రియ కర్ణిసేన చిత్ర దర్శకుడు ఓం రౌత్, డైలాగ్ రైటర్ మనోజ్‌ని చంపేస్తామని బెదిరించింది. క్షత్రియకర్ని సేన జాతీయ అధ్యక్షుడు డాక్టర్ రాజ్ షేకావత్ మధ్యప్రదేశ్ రాజ్ గఢ్ లోని బియోరాలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. "ఆదిపురుష్ డైరెక్టర్ ని చంపడానికి ముంబైలో ఓ బృందాన్ని ఏర్పాటు చేసి ఆయుధాలతో ముంబై అంత వెతికి పట్టుకొని చంపేయమని చెబుతాం" అంటూ తాజా ప్రెస్ మీట్ లో రాజ్ షేకవత్ పేర్కొన్నారు. ఇక మరో నేత ఇందళ్ సింగ్ రానా సినిమాలోడైలాగ్ రైటర్ మనోజ్ ముంతాసిర్ ని అతను రాసిన ఓ డైలాగ్ ని అనుసరిస్తూ చంపేస్తాం అంటూ బెదిరించాడు. కాగా ఇప్పటికే 'ఆదిపురుష్' మూవీ లోని కొన్ని డైలాగ్స్ పై విమర్శకుల నుండి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి.

ఇందులో భాగంగానే హిందూ సంఘాలు బిజెపి కాంగ్రెస్ నేతలు సైతం ఆదిపురుష్ సినిమాలోని సంభాషణలు ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని చిత్ర యూనిట్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆదిపురుష్ లోని డైలాగ్స్ ని మార్చడానికి మూవీ యూనిట్ నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ..' ప్రేక్షకుల మనోభావాలు వారి సెంటిమెంట్స్ వారి సూచనలను గౌరవించి 'ఆదిపురుష్' సినిమాలోని కొన్ని డైలాగ్స్ ని మార్చబోతున్నాం. కొద్ది రోజుల్లోనే ఈ మార్పులతో థియేటర్స్ లో ఆదిపురుష్ సినిమాను చూడవచ్చు' అంటూ ప్రకటనలో భాగంగా పేర్కొన్నారు నిర్మాతలు.

ఇక ఆదిపురుష్ మూవీకి ఎన్ని వివాదాలు, విమర్శలు తలెత్తుతున్న కూడా కలెక్షన్స్ విషయంలో మాత్రం సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. మొదటిరోజు ఆదిపురుష్ మూవీ ఏకంగా రూ.150 కోట్ల గ్రాస్ ని ప్రపంచవ్యాప్తంగా అందుకుంది. ఇక రెండో రోజుకి కలెక్షన్స్ మరింత పెరిగాయి. రెండో రోజు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి రూ.240 కోట్ల కలెక్షన్స్ వచ్చినట్లు మూవీ యూనిట్ అధికారికంగా పేర్కొంది. ఇక మూడో రోజు ఈ సినిమా మరో రూ.100 కోట్లు కలెక్ట్ చేసినట్లు సమాచారం. కాగా రెట్రో ఫైల్ సమర్పణలో టి సిరీస్ బ్యానర్ పై సుమారు 500 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని భూషణ్ కుమార్ నిర్మించగా, అజయ్ - అతుల్ స్వరాలు సమకూర్చారు.

Also Read: ‘ఆదిపురుష్’పై సర్వత్రా విమర్శలు, సినీ అభిమానులకు కోపం తెప్పించిన 10 మిస్టేక్స్ ఇవే!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Dhanush : సీఎం విజయ్‌కు పోటీగా ధనుష్ - పాలిటిక్స్‌లోకి మరో కోలీవుడ్ స్టార్?
సీఎం విజయ్‌కు పోటీగా ధనుష్ - పాలిటిక్స్‌లోకి మరో కోలీవుడ్ స్టార్?
Ram Charan : ఫ్యాన్స్ కోసం రక్తం చిందిస్తా... పెద్ది ఆడలేదు పోరాడాడు - రామ్ చరణ్ స్పీచ్ హైలెట్స్
ఫ్యాన్స్ కోసం రక్తం చిందిస్తా... పెద్ది ఆడలేదు పోరాడాడు - రామ్ చరణ్ స్పీచ్ హైలెట్స్
Janhvi Kapoor : తెలుగులో స్పీచ్ అదరగొట్టిన జాన్వీ - ట్రెడిషనల్ లుక్‌లో అచ్చియమ్మ
తెలుగులో స్పీచ్ అదరగొట్టిన జాన్వీ - ట్రెడిషనల్ లుక్‌లో అచ్చియమ్మ
Peddi Pre Release Event Live Highlights: చచ్చేవరకు ఎంటర్టైన్ చేస్తా... రామ్ చరణ్ ఎమోషనల్ స్పీచ్ - 'పెద్ది' ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలైట్స్
చచ్చేవరకు ఎంటర్టైన్ చేస్తా... రామ్ చరణ్ ఎమోషనల్ స్పీచ్ - 'పెద్ది' ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలైట్స్

వీడియోలు

Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం
Masterplan Behind RCB's IPL 2026 Victory | ఆర్సీబీ విజయానికి కారణం ఇదే
Reason for GT Lost The IPL 2026 Final | గుజరాత్ పతనం వెనుక అసలు నిజాలు
RCB Celebrations With Family IPL 2026 | ఫ్యామిలీతో ఆర్సీబీ ప్లేయర్స్ సెలబ్రేషన్
RCB Wins IPL 2026 Final | రెండోసారి ఐపీఎల్ టైటిల్ సొంతం చేసుకున్న ఆర్సీబీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila Rajya Sabha Seat Congress: షర్మిలకు రాజ్యసభ - కాంగ్రెస్ గేమ్‌ ప్లాన్‌ ఏంటి? జగన్‌కు చెక్ పెట్టడానికా.. లేక దోస్తీకా?
షర్మిలకు రాజ్యసభ - కాంగ్రెస్ గేమ్‌ ప్లాన్‌ ఏంటి? జగన్‌కు చెక్ పెట్టడానికా.. లేక దోస్తీకా?
Telangana Formation Day 2026: ఉమ్మడి రాష్ట్ర విభజనకు 12 ఏళ్లు - రెండు రాష్ట్రాలకు మేలు జరిగిందా? కీడు జరిగిందా?
ఉమ్మడి రాష్ట్ర విభజనకు 12 ఏళ్లు - రెండు రాష్ట్రాలకు మేలు జరిగిందా? కీడు జరిగిందా?
Hyderabad Traffic Diversions: సికింద్రాబాద్‌ పరేడ్‌గ్రౌండ్స్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. మధ్యాహ్నం 12 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
పరేడ్‌గ్రౌండ్స్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. మధ్యాహ్నం 12 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
EPFO 3.0 PF withdrawal via ATM:ఏటీఎం నుంచి పీఎఫ్‌ విత్‌డ్రా చేస్తే పింఛన్ తగ్గుతుందా?
ఏటీఎం నుంచి పీఎఫ్‌ విత్‌డ్రా చేస్తే పింఛన్ తగ్గుతుందా?
Rains In AP and Telangana: ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలో పలుచోట్ల వర్షాలు.. అక్కడ పిడుగుల వార్నింగ్
ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలో పలుచోట్ల వర్షాలు.. అక్కడ పిడుగుల వార్నింగ్
ABP India at 2047: అభివృద్ధి చెందిన భారత్ దిశగా అడుగులు.. జూన్ 3న ఏబీపీ నెట్‌వర్క్ ఇండియా @ 2047 కాన్‌క్లేవ్
అభివృద్ధి చెందిన భారత్ దిశగా అడుగులు.. జూన్ 3న ఏబీపీ నెట్‌వర్క్ ఇండియా @ 2047 కాన్‌క్లేవ్
Maruti Suzuki May Sales Record: అద‌ర‌గొట్టిన మారుతి సుజుకి.. మేలో ఆల్ టైమ్ హైయెస్ట్ మంత్లీ సేల్స్ తో సరికొత్త రికార్డ్
అద‌ర‌గొట్టిన మారుతి సుజుకి.. మేలో ఆల్ టైమ్ హైయెస్ట్ మంత్లీ సేల్స్ తో సరికొత్త రికార్డ్
Shocking FASTag Scam: ఫాస్ట్‌ట్యాగ్ స్కామ్ పై మున్నాభాయ్ యాక్టర్ అశ్విన్ ముష్రాన్ సంచలన పోస్ట్: అకౌంట్ లో రూ. 3000 ఉన్నా రూ. 200 పెనాల్టీ.. 
ఫాస్ట్‌ట్యాగ్ స్కామ్ పై మున్నాభాయ్ యాక్టర్ అశ్విన్ ముష్రాన్ సంచలన పోస్ట్: అకౌంట్ లో రూ. 3000 ఉన్నా రూ. 200 పెనాల్టీ.. 
Embed widget