అన్వేషించండి

Pawan Kalyan OG Glimpse : పవన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - ఆకలిగా ఉన్న చిరుతలా పవర్ స్టార్ వచ్చేది ఎప్పుడంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతోన్న యాక్షన్ సినిమా 'ఓజీ'. పవన్ పుట్టినరోజు సందర్భంగా సినిమా వీడియో గ్లింప్స్ విడుదల చేయనున్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానులకు గుడ్ న్యూస్. ఆయన పుట్టిన రోజుకు ఎంతో దూరం లేదు. మరికొన్ని గంటల సమయమే ఉంది. పవన్ అభిమానులకు సెప్టెంబర్ 2 అంటే పండగ రోజు. పండగ సంబరాలకు మరింత జోష్ తీసుకువచ్చే కబురు చెప్పింది డీవీవీ సంస్థ ఎంటర్‌టైన్‌మెంట్స్. 

పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా ఆయన వీరాభిమానుల్లో ఒకరైన సుజీత్ దర్శకత్వం వహిస్తున్న సినిమా 'ఓజీ' (OG Movie). 'దే కాల్ హిమ్ ఓజీ - ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్' అనేది ఉపశీర్షిక. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా వీడియో గ్లింప్స్ విడుదల చేయనున్నారు. ఈ సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏ సమయానికి ఆ వీడియో విడుదల చేస్తామనేది కూడా చెప్పారు. 

సెప్టెంబర్ 2... శనివారం ఉదయం 10.35 గంటలకు 'ఓజీ' వీడియో గ్లింప్స్ 'హంగ్రీ చీతా' (Hungry Cheetah) విడుదల చేస్తామని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ రోజు తెలిపారు. 'హంగ్రీ చీతా' అంటే ఆకలితో ఉన్న చిరుత పులి అని అర్థం. 'ఓజీ'లో పవన్ కళ్యాణ్ మాఫియా, గ్యాంగ్ స్టర్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. దాంతో ఇప్పుడు విడుదల చేయబోయే వీడియోలో యాక్షన్ ఓ రేంజ్ ఉంటుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

Also Read : ఫ్లాప్ ప్రొడ్యూసర్లకు వరుణ్ తేజ్ భరోసా - వాళ్ళకు అండగా నిలబడటం కోసం...

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by DVV Entertainment (@dvvmovies)

పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంకా అరుల్ మోహన్ నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై శ్రీమతి పార్వతి సమర్పణలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. 'నాటు నాటు...'కు ఆస్కార్ అందుకున్న 'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' తర్వాత ఆయన నిర్మిస్తున్న చిత్రమిది. 'సాహో' తర్వాత సుజీత్‌ దర్శకత్వం వహిస్తున్న సినిమా కూడా ఇదే. పాన్‌ ఇండియా రిలీజ్‌ చేయనున్నారు.

'ఓజీ' సినిమాలో నటి శ్రియా రెడ్డి కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. 'సలార్' తర్వాత ఆమె చేస్తున్న చిత్రమిది. నిజం చెప్పాలంటే... 'సలార్' సినిమా చేయాలని శ్రియా రెడ్డి అనుకోలేదట. ఆ ఒక్క సినిమా చేసి మళ్ళీ నటనకు ఫుల్ స్టాప్ పెట్టాలని అనుకుంటే... తనకు స్క్రిప్ట్ విపరీతంగా నచ్చడంతో 'ఓజీ' ఓకే చేశానని ఆమె చెప్పారు. పవన్ కళ్యాణ్ సినిమా ఒక్కటి కూడా చూడలేదని ఆమె చెప్పారు.

Also Read నితిన్ జోడీగా 'కాంతార' కథానాయిక సప్తమి, కీలక పాత్రలో లయ కూడా - ఏ సినిమాలోనో తెలుసా?

'ఓజీ' సినిమా గురించి శ్రియా రెడ్డి మాట్లాడుతూ ''నాకు సినిమాటోగ్రాఫర్ రవి కె. చంద్రన్ గారు బాగా తెలుసు. నా చిన్నప్పటి నుంచి పరిచయం ఉంది. మాకు ఫ్యామిలీ ఫ్రెండ్. దర్శకుడు సుజీత్ ఫోన్ చేస్తారని, మాట్లాడమని చెప్పారు. సుజీత్ ఫోన్ చేసి ఐదారు నిమిషాలు మాట్లాడిన తర్వాత 'ఓజీ' చేయాలని ఫిక్స్ అయ్యా. కథ అంత బాగా నచ్చింది. 'ఓజీ' ఓకే చేయడానికి మొదటి కారణం స్క్రిప్ట్. ఆ తర్వాతే పవన్ కళ్యాణ్ గారు'' అని చెప్పారు.

ప్రేక్షకుల ఊహలన్నీ తప్పే!
'ఓజీ' సినిమాలో హిందీ హీరో ఇమ్రాన్ హష్మీ, ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్, తమిళ నటుడు అర్జున్ దాస్... ఇలా భారీ తారాగణం ఉంది. శ్రియా రెడ్డి పేరు బయటకు రావడంతో వారిలో ఎవరో ఒకరికి జోడిగా ఆమె నటిస్తున్నారని ప్రేక్షకులు ఊహిస్తున్నారని, కామెంట్స్ చేస్తున్నారని... ఆ ఊహలన్నీ తప్పేనని శ్రియా రెడ్డి తెలిపారు. తన క్యారెక్టర్ ఏమిటనేది సినిమా చూస్తే తెలుస్తుందన్నారు. 

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Ajay Arasada: పవన్ కళ్యాణ్ గారు పిలిచారు... PKCWలో ఛాన్స్? యువ సంగీత దర్శకుడు అజయ్ అరసాడ ఇంటర్వ్యూ
పవన్ కళ్యాణ్ గారు పిలిచారు... PKCWలో ఛాన్స్? యువ సంగీత దర్శకుడు అజయ్ అరసాడ ఇంటర్వ్యూ
Shravan Reddy: శ్రవణ్ రెడ్డి కెరీర్‌కు గేమ్ ఛేంజర్... 'అగధ'తో తెలుగబ్బాయికి ప్రశంసలు
శ్రవణ్ రెడ్డి కెరీర్‌కు గేమ్ ఛేంజర్... 'అగధ'తో తెలుగబ్బాయికి ప్రశంసలు
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Bigg Boss Winner Wedding: తమిళ నటుడిగా బిగ్ బాస్ విన్నర్ పెళ్లి... సింపుల్‌గా గురువాయూర్ టెంపుల్‌లో!
తమిళ నటుడిగా బిగ్ బాస్ విన్నర్ పెళ్లి... సింపుల్‌గా గురువాయూర్ టెంపుల్‌లో!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Kids Brushing Tips : పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
Embed widget