అన్వేషించండి

Goodachari Sequel : 'గూఢచారి' సీక్వెల్ లో హీరోయిన్ గా బనితా సంధు - లండన్ బ్యూటీతో అడివి శేష్ రొమాన్స్!

Goodachari 2 : అడవి శేష్ హీరోగా నటిస్తున్న 'గూడచారి' సీక్వెల్ లో బనితా సంధు హీరోయిన్ గా నటిస్తున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.

Goodachari 2 : టాలీవుడ్ యంగ్ హీరో అడవి శేష్ కొత్త సినిమాకి హీరోయిన్ దొరికేసింది. 'గూడచారి' సీక్వెల్ లో అడవి శేష్ ఏకంగా హాలీవుడ్ బ్యూటీతో రొమాన్స్ చేయబోతున్నాడు. ఇంతకీ ఎవరా హీరోయిన్? డీటెయిల్స్ లోకి వెళితే.. అడవి శేష్ హీరోగా 2018 లో వచ్చిన 'గూడచారి'(Goodachari) మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అడవి శేష్ కి జోడిగా శోభిత ధూళిపాళ్ల హీరోయిన్ గా నటించింది. ప్రకాష్ రాజ్, జగపతిబాబు, మధుశాలిని, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషించారు. స్పై అండ్ యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

ముఖ్యంగా సినిమాలో అడివి శేష్ నటన, కథలోని ట్విస్టులు ఆడియన్స్ ని ఎంతో థ్రిల్ చేశాయి. కేవలం రూ.6 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం ఫుల్ రన్ లో బాక్సాఫీస్ వద్ద రూ.25 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకొని కమర్షియల్ గానూ నిర్మాతలకు మంచి లాభాలను అందించింది. అంతేకాదు 2018 సంవత్సరంలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా 'గూడచారి 2'(G2) మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో వినయ్ కుమార్ దర్శకుడుగా వెండితెరకు ఆరంగేట్రం చేస్తున్నాడు. స్పై అండ్ యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్ లో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు.

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన మోషన్ టీజర్, పోస్టర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ అందించారు మేకర్స్. 'గూడచారి 2'(G2) లో హీరోయిన్ గా బనితా సంధు(Banita Sandhu) నటిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇదే విషయాన్ని తెలియజేస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. 'వెల్కమ్ టు ద మిషన్ బనితా సంధు' అంటూ రిలీజ్ చేసిన ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక హీరోయిన్ బనిత సందు విషయానికొస్తే.. బాలీవుడ్లో 'అక్టోబర్'(October) మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

ఆ తర్వాత 'అర్జున్ రెడ్డి' తమిళ రీమేక్ ఆదిత్య వర్మ(Adithya Varma) లో చియాన్ విక్రమ్ కొడుకుతో కలిసి నటించింది. బాలీవుడ్, సౌత్ సినిమాలతో పాటుగా హాలీవుడ్ లో 'ఎటర్నల్ బ్యూటీ', 'మదర్ తెరిసా అండ్ మీ' అనే సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఇప్పుడు 'గూడచారి' సీక్వెల్ తో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతోంది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాని వచ్చే ఏడాది విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే 'మేజర్', 'హిట్ 2' వంటి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న అడవి శేష్ ఈ మూవీతో హ్యాట్రిక్ అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

Also Read : డిసెంబర్‌లో థియేటర్లలో నందమూరి హీరో - ఇది ఎన్టీఆర్ మనవడి సినిమా!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Chandrababu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Chandrababu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
Yogi Adityanath: ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్-  అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్- అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
Daaku Maharaaj: డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
Embed widget