Breathe Telugu Movie: డిసెంబర్‌లో థియేటర్లలో నందమూరి హీరో - ఇది ఎన్టీఆర్ మనవడి సినిమా!
Breathe Telugu movie release date: నందమూరి కథానాయకుడు, సీనియర్ ఎన్టీఆర్ మనవడు చైతన్య కృష్ణ హీరోగా నటించిన 'బ్రీత్' సినిమా విడుదల తేదీ వెల్లడించారు.
![Breathe Telugu Movie: డిసెంబర్‌లో థియేటర్లలో నందమూరి హీరో - ఇది ఎన్టీఆర్ మనవడి సినిమా! Breathe 2023 movie starring Nandamuri Chaitanya Krishna release on December 2nd Telugu News Breathe Telugu Movie: డిసెంబర్‌లో థియేటర్లలో నందమూరి హీరో - ఇది ఎన్టీఆర్ మనవడి సినిమా!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/19/b6e2592bbef79457c358285c3e021f011700399471707313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Whose son is Nandamuri Chaitanya Krishna : విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు (NT Rama Rao) ఫ్యామిలీ నుంచి మరో వారసుడు వస్తున్నారు. ఎన్టీఆర్ పెద్ద కుమారుడు జయకృష్ణ వారసుడు హీరోగా వస్తున్నారు. నందమూరి చైతన్య కృష్ణ కొన్నాళ్ల క్రితం హీరోగా సినిమాలు చేశారు. కొంత విరామం తర్వాత ఆయన హీరోగా నటించిన సినిమా 'బ్రీత్'
డిసెంబర్ 2న 'బ్రీత్' విడుదల!
Breathe movie 2023 Telugu: సినిమా నిర్మాణం నందమూరి కుటుంబానికి కొత్త కాదు. అయితే... కుమారుడి కోసం నందమూరి జయకృష్ణ నిర్మాతగా మారారు. బసవతారక రామ క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 1గా ఆయన నిర్మించిన సినిమా 'బ్రీత్'. వైద్యో నారాయణో హరి అనేది ఉప శీర్షిక. ఈ సినిమాను డిసెంబర్ 2న విడుదల చేయనున్నట్లు ఈ రోజు అనౌన్స్ చేశారు.
ప్రపంచం చూడని కొత్త మెడికల్ క్రైమ్!
'రక్ష', 'జక్కన్న' సినిమాలు తీసిన వంశీకృష్ణ ఆకెళ్ళ 'బ్రీత్' చిత్రానికి దర్శకత్వం వహించారు. కొన్ని రోజుల క్రితం ట్రైలర్ విడుదల చేశారు. మెడికల్ మాఫియా నేపథ్యంలో సినిమా తెరకెక్కించారని ఆ ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది.
Also Read : విజయ్ దేవరకొండ, రష్మిక ప్రేమను బయటపెట్టిన బాలకృష్ణ!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, పీపుల్స్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఆదిత్య వర్మ కళ్ళు తిరిగి పడిపోవడంతో బ్రీత్ ఆస్పత్రికి తీసుకు వెళతారు. అక్కడ ఏం జరిగింది? అనేది సినిమా కథ. హీరో డాక్టరా? పేషెంటా? అనేది క్లారిటీ ఇవ్వలేదు. 'ప్రాణం కాపాడటం కాదు... తీయడం ఇంకా కష్టం' అని చైతన్య కృష్ణ చెప్పే డైలాగ్ వింటుంటే... ప్రాణాలు తీస్తున్న వ్యక్తులపై పోరాటం చేస్తున్నట్లు ఉంది. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం : రాకేష్ హోస్మనీ, ఎడిటర్ : బొంతల నాగేశ్వర్ రెడ్డి, సంగీతం : మార్క్ కె. రాబిన్, రచన, దర్శకత్వం : వంశీకృష్ణ ఆకెళ్ళ.
డిసెంబర్ తొలి వారంలో 'యానిమల్'
రణబీర్ కపూర్, రష్మికా మందన్నా జంటగా 'అర్జున్ రెడ్డి', 'కబీర్ సింగ్' సినిమాల ఫేమ్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన 'యానిమల్' డిసెంబర్ 1న విడుదల అవుతోంది. తెలుగులో కూడా ఆ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇక, అదే రోజున టీవీ స్టార్ 'సుడిగాలి' సుధీర్ హీరోగా నటించిన 'కాలింగ్ సహస్త్ర' కూడా విడుదల అవుతోంది. ఆ సినిమా విడుదలైన తర్వాత రోజున 'బ్రీత్' వస్తోంది.
Also Read : మంగళవారం సినిమా రివ్యూ: అమ్మాయిలో లైంగిక వాంఛ ఎక్కువ అయితే? కోరికలు పెరిగితే?
ఎన్టీ రామారావు తర్వాత నందమూరి కుటుంబం నుంచి రెండో తరంలో వచ్చిన వారిలో బాలకృష్ణ తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నారు. అగ్ర హీరోగా నందమూరి వారసత్వాన్ని నిలబెట్టారు. హరికృష్ణ కూడా హీరోగా సినిమాలు చేశారు. కానీ, ఆయన చేసిన సినిమాల సంఖ్య తక్కువే. అయితే, వాటిలో విజయాల శాతం ఎక్కువ. ఎన్టీఆర్ ఫ్యామిలీలో మూడో తరంలో హరికృష్ణ కుమారులు కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ సక్సెస్ అయ్యారు. దివంగత కథానాయకుడు తారకరత్న కొన్ని సినిమాలతో సరిపెట్టుకున్నారు. బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు వెయిట్ చేస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)