NTR : ఇంజ్యూరీ నుంచి రికవరీ - ఎలాంటి గొడవల్లేవ్... 'డ్రాగన్' షూట్ కోసం ఎన్టీఆర్ రెడీ
NTRNeel Movie Update : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబో హై యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ నుంచి అప్డేట్ వచ్చింది. ఇంజ్యూరీ తర్వాత ఎన్టీఆర్ త్వరలోనే షూట్‌లో పాల్గొననున్నారు.

NTR To Join Dragon Movie Shooting Soon : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో మూవీ రాబోతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ కాగా... ఓ షెడ్యూల్ కూడా కంప్లీట్ అయింది. ఓ యాడ్ షూట్‌లో ఎన్టీఆర్‌కు గాయం తర్వాత ఆయన త్వరలోనే మూవీ షూటింగ్‌లో పాల్గొననున్నారు. ఈ మేరకు న్యూ లుక్‌లో రెడీ అవుతున్నారు.
ఆ రూమర్లకు చెక్
నిజానికి 'వార్ 2' రిలీజ్ కంటే ముందే ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లింది. అప్పుడు ఎన్టీఆర్ షూటింగ్‌లో పాల్గొనలేదు. కొద్ది రోజుల తర్వాత ఎన్టీఆర్ షూటింగ్‌లో జాయిన్ అయ్యారు. ఈ క్రమంలో ఓ యాడ్ షూట్‌లో ఎన్టీఆర్‌కు గాయాలయ్యాయి. దీంతో షూట్‌కు బ్రేక్ పడింది. అయితే, ఎన్టీఆర్, నీల్ మధ్య గొడవలు వచ్చాయని... అందుకే షూటింగ్ ఆగిపోయిందంటూ పుకార్లు షికారు చేశాయి. ఫిలింనగర్ వర్గాల్లో ఇది హాట్ టాపిక్‌గా మారింది. 20 రోజుల కంటే ఎక్కువగా షూటింగ్ చేయాల్సి ఉన్నా ఎన్టీఆర్ అలా చేయలేదంటూ కొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు. దీంతో రూమర్స్ హల్చల్ చేశాయి.
అయితే, ఎన్టీఆర్‌కు గాయం కారణంగానే షూటింగ్ కాస్త బ్రేక్ వచ్చిందని స్పష్టం అవుతోంది. రీసెంట్‌గా 'కాంతార చాప్టర్ 1' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లోనూ ఎన్టీఆర్ భుజంపై చేయి వేస్తూ నొప్పిని భరిస్తూనే కనిపించారు. దీనిపై ఫ్యాన్స్ సైతం ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా గాయం నుంచి కోలుకుని ఎన్టీఆర్ షూటింగ్‌కు రెడీ అవుతున్నారు.
Also Read : ముదిరిన 'మంగళ సూత్రం' వివాదం - ట్విట్టర్‌లో రచ్చ... సింగర్ ట్వీట్‌పై సీపీ సజ్జనార్ రియాక్షన్
న్యూ లుక్... త్వరలోనే షూటింగ్
ఈ మూవీ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుందని... చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా వెల్లడించింది. 'బీస్ట్ మోడ్ మళ్లీ రాజుకోబోతోంది. #NTRNeel తదుపరి షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కానుంది.' అంటూ ప్రశాంత్ నీల్ దగ్గరుండి ఎన్టీఆర్‌కు మేకోవర్ చేయిస్తోన్న ఫోటోను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది.
View this post on Instagram
తారక్, ఈ మూవీ కోసం గత కొంతకాలంగా పూర్తి ఫిట్నెస్‌పై దృష్టి పెట్టారు. రీసెంట్‌గా తన బావమరిది నార్నె నితిన్ పెళ్లిలో చాలా సన్నగా కనిపించారు. తాజాగా... ఎయిర్ పోర్టు నుంచి బయటకు వస్తుండగా... మీసం తిప్పుతూ ఫోటోలకు ఫోజులిచ్చారు. గెడ్డంతో సన్నగా స్టైలిష్ మాస్ లుక్ అదిరిపోయింది. ఈ ఫోటోస్ వైరల్ కాగా... ఇంత సన్నగా అయ్యారేంటి? నీల్ మూవీ ఎలా ఉండబోతోంది? అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
The Fierce 🐉🔥#ManOfMassesNTR @tarak9999 @NTRNeelFilm pic.twitter.com/uPHf5y6Yz9
— NTR Trends (@NTRFanTrends) November 5, 2025
'#NTRNeel' వర్కింగ్ టైటిల్‌తో మూవీ రూపొందుతుండగా 'డ్రాగన్' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. సినిమాలో ఎన్టీఆర్ సరసన రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రవి బ్రసూర్ మ్యూజిక్ అందిస్తున్నారు.





















