NTR: ఎన్నాళ్లకెన్నాళ్లకు... ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ - 'వార్ 2' థియేటర్స్ దద్దరిల్లాల్సిందే...
War 2 Trailer Reaction: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ 'వార్ 2' ట్రైలర్ వచ్చేసింది. చాలా రోజుల తర్వాత ఈ మూవీలో సిక్స్ ప్యాక్‌లో ఎన్టీఆర్ కనిపించారు.

NTR Six Pack In War 2 Movie: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ మూవీ 'వార్ 2' ట్రైలర్ వచ్చేసింది. బాలీవుడ్ స్టార్, టాలీవుడ్ టాప్ స్టార్ సిల్వర్ స్క్రీన్ వార్ కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, గ్లింప్స్ భారీ హైప్ క్రియేట్ చేయగా... ట్రైలర్ ఆ అంచనాలను పదింతలు చేసింది.
ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్
ట్రైలర్‌లో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ హోరాహోరీ డైలాగ్స్, భారీ యాక్షన్ సీక్వెన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తుండగా ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ వేరే లెవల్‌లో ఉంది. చాలా రోజుల తర్వాత ఆయన సిక్స్ ప్యాక్ లుక్ ఆకట్టుకుంటోంది. కెరీర్ స్టార్టింగ్ మూవీ 'స్టూడెంట్ నెం.1' మూవీలో బొద్దుగా ఉన్న ఎన్టీఆర్ ఆ తర్వాత చాలా మూవీస్ వరకూ అదే లుక్ కంటిన్యూ చేశారు. ఆది, నాగ, సింహాద్రి, రాఖీ మూవీస్‌లోనూ అలానే బొద్దుగా కనిపించడంతో ఆయన లుక్‌పై సోషల్ మీడియాలోనూ ట్రోలింగ్స్ వచ్చాయి.
ఆ తర్వాత 'యమదొంగ' మూవీతో ఎన్టీఆర్ లుక్ పూర్తిగా మారిపోయింది. సన్నగా మాస్ బ్యూటిఫుల్ లుక్‌లో అదరగొట్టారు. అప్పటి నుంచీ దాదాపు అన్నీ మూవీస్‌లో అదే లుక్ మెయింటెయిన్ చేశారు.
రెండో మూవీ...
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన 'అరవింద సమేత' మూవీలో ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్‌తో కనిపించారు. ఫస్ట్ ఫైట్ సీన్‌లో షర్ట్ లేకుండా సిక్స్ ప్యాక్‌తో అదరగొట్టారు. ఎన్టీఆర్‌ను పవర్ ఫుల్ మాస్ లుక్‌లో సిల్వర్ స్క్రీన్‌పై అలా చూసిన ఫ్యాన్స్ జోష్‌కు అవధుల్లేకుండా పోయాయి. ఇప్పుడు మళ్లీ ఇన్నాళ్లకు తన ఫస్ట్ బాలీవుడ్ ఎంట్రీ మూవీ 'వార్ 2'లో అదే సిక్స్ ప్యాక్‌లో కనిపించనున్నారు ఎన్టీఆర్. ట్రైలర్‌లో షర్ట్ లేకుండా పవర్ ఫుల్ డైలాగ్‌తో ఆకట్టుకున్నారు.
Also Read: తెలుగు 'బిగ్ బాస్'లో కన్నడ హీరోయిన్... లాస్ట్ ఇయర్ ఛాన్స్ మిస్, ఈసారి పక్కా!
నేను ఓ వెపన్
'నేను మాటిస్తున్నాను... ఎవ్వరూ చేయలేని పనుల్ని నేను చేసి చూపిస్తాను. ఎవ్వరూ పోరాడలేని యుద్ధాన్ని నేను పోరాడతాను.', 'ఇప్పుడు నేను మనిషిని కాను. ఓ ఆయుధాన్ని. యుద్ధంలో ఆయుధాన్నై చస్తా లేదా చంపుతా.' అంటూ ఎన్టీఆర్ చెప్పే డైలాగ్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ మూవీ రాబోతుండగా... ఎన్టీఆర్ స్పై అధికారిగా కనిపించనున్నారు. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ ప్రాంఛైజీలో భాగంగా ఆరో చిత్రంగా 'వార్ 2' రాబోతోంది.
ఈ మూవీలో హృతిక్ రోషన్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఎన్నో అంచనాల మధ్య ఆగస్ట్ 14న హిందీ, తెలుగు, తమిళంలో ఏకకాలంలో రిలీజ్ కానుంది. 2019లో వచ్చిన 'వార్' మూవీకి సీక్వెల్‌గా రానుంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రొడ్యూసర్ నాగవంశీ మూవీని రిలీజ్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా మూవీని డాల్బీ అట్‌మోస్ థియేటర్లలో ప్రదర్శించనున్నారు. ఆడియన్స్‌కు ఓ స్పెషల్ ఎక్స్‌పీరియన్స్ అందించేందుకు చిత్ర నిర్మాణ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది.






















