HHVM Box Office Collections Day 1: 'హరిహర వీరమల్లు' ఫస్ట్ డే కలెక్షన్స్ - పవన్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్
HHVM First Day Collections: పవన్ కల్యాణ్ 'హరిహర వీరమల్లు' ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్‌తో దూసుకెళ్లింది. పవర్ స్టార్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన మూవీస్‌లో ఒకటిగా నిలిచింది.

Pawan Kalyan's HHVM First Day Box Office Collections: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లేటెస్ట్ పీరియాడికల్ అడ్వెంచర్ 'హరిహర వీరమల్లు' గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. విడుదలకు ముందే భారీ హైప్ క్రియేట్ కాగా... రిలీజ్ తర్వాత అంతే హైప్‌తో థియేటర్స్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. చాలా రోజుల గ్యాప్ తర్వాత పవన్‌ను సిల్వర్ స్క్రీన్‌పై పవర్ ఫుల్ రోల్‌లో చూసిన ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవు.
ఈ మూవీ ఫస్ట్ డే రికార్డు కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ప్రీమియర్, బెనిఫిట్ షోస్‌తో పాటు ఫస్ట్ డే అన్నీ థియేటర్లలోనూ హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిచ్చాయి. పవన్ కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన మూవీస్‌లో ఒకటిగా నిలిచింది. పవన్ గ్రేస్, పవర్ ఫుల్ డైలాగ్స్ అదిరిపోయాయంటూ సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
'హరిహర వీరమల్లు' ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా రూ.32.50 కోట్లు రాబట్టినట్లు సాక్నిల్క్ నివేదికల ద్వారా తెలుస్తోంది. అలాగే, ప్రీమియర్ షోస్ ద్వారా రూ.12.7 కోట్లు వసూలైనట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో భారీ ఓపెనింగ్స్ వచ్చాయని నివేదిక పేర్కొంది. వీకెండ్ కావడంతో థియేటర్స్ వద్ద అదే జోరు కొనసాగుతోందని... రాబోయే 3 రోజుల్లో కలెక్షన్స్ మరింత పెరగొచ్చని అంచనా వేసింది. ఫస్ట్ డే థియేటర్స్ ఆక్యుపెన్సీ 60 శాతం నుంచి 70 శాతం వరకూ ఉందని... ప్రధాన నగరాల్లో ఆక్యుపెన్సీ వంద శాతం రీచ్ అయినట్లు టాక్ వినిపిస్తోంది.
Also Read: విశ్వంభర స్పెషల్ సాంగ్ షూటింగ్ షురూ... హైదరాబాద్ వచ్చిన బాలీవుడ్ బ్యూటీ
భీమ్లా నాయక్ తర్వాత...
'భీమ్లా నాయక్' తర్వాత పాలిటిక్స్‌లో పవన్ బిజీగా మారిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో ఘన విజయం సాధించి ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మూవీస్‌కు కాస్త దూరమైన పవన్... 'హరిహర వీరమల్లు'తో సందడి చేశారు. సినిమాలో సనాతన ధర్మం, పవర్ ఫుల్ డైలాగ్స్, యోధుడిగా పవన్ భారీ యాక్షన్ సీక్వెన్స్ ఆడియన్స్‌ను కట్టిపడేశాయి. ఫస్టాఫ్ గూస్ బంప్స్ అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా హోరెత్తించారు.
బాయ్ కాట్ ట్రెండ్‌పై పవన్ రియాక్షన్
మూవీ రిలీజ్‌కు ముందు బాయ్ కాట్ 'హరిహర వీరమల్లు' అంటూ వైసీపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా ట్రెండ్ చేశాయి. విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ మీద విమర్శలు గుప్పించగా ఈ విషయం పవన్ దృష్టికి వెళ్లింది. సోషల్ మీడియా కామెంట్స్ చూసి నలిగిపోవద్దని ఫ్యాన్స్‌కు సూచించారు పవన్. తనకు విమర్శలు కొత్త కాదని... తన గురించి నెగిటివ్‌గా మాట్లాడుతున్నారంటే బలంగా ఉన్నట్లు అర్థమని అన్నారు. 'ఫస్ట్ పార్ట్‌లో విజువల్ ఎఫెక్ట్స్‌పై కొందరు విమర్శలు చేశారు. ఆ సూచనలు పరిగణలోకి తీసుకుని సెకండ్ పార్ట్‌లో కరెక్ట్ చేస్తాం.
ఫ్యాన్స్ ఏం చేయాలో అది చేయండి. కామెంట్స్ చూసి నలిగిపోయి బాధ పడొద్దు. నెగిటివ్ అంశాలను నలిపేయండి. తిరిగి ఎలా దాడి చేయాలో ఆలోచించండి. మరీ అంత సున్నితంగా ఉండొద్దు.' అంటూ కామెంట్స్ చేశారు.






















