అన్వేషించండి

NTR: రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు ఎదురుచూస్తున్నా - హృతిక్ రోషన్‌ సర్ ప్రైజ్‌పై స్పందించిన ఎన్టీఆర్

War 2 Movie: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా సర్ ప్రైజ్ ఇవ్వనున్నట్లు బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ తెలిపారు. తాజాగా దీనిపై ఎన్టీఆర్ స్పందిస్తూ.. దాని కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు.

NTR About Hrithik Roshan Surprise On War 2 Movie: మ్యాన్ ఆఫ్ మాసెస్ బాలీవుడ్ ఎంట్రీ అవెయిటెడ్ మూవీ 'వార్ 2'. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా..

ఈ నెల 20న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా 'వార్ 2' (War 2) మూవీ నుంచి స్పెషల్ సర్ ప్రైజ్ ఇవ్వనున్నట్లు హృతిక్ రోషన్ (Hrithik Roshan) ఇప్పటికే ప్రకటించారు. అయితే.. ఆ రోజు మూవీలో ఎన్టీఆర్ ఫస్ట్ లుక్‌తో టీజర్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని అంతా భావిస్తున్నారు. అదేంటి అనేది తెలియాలంటే ఎన్టీఆర్ బర్త్ డే వరకూ ఆగాల్సిందే.

తాజాగా.. హృతిక్ సర్ ప్రైజ్‌పై ఎన్టీఆర్ స్పందించారు. దీని కోసం తాను ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. అలాగే.. 'కబీర్.. నిన్ను వేటాడి నీకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చేందుకు ఎదురుచూస్తున్నా.' అంటూ రాసుకొచ్చారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీ తెరకెక్కుతుండగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

Also Read: పవర్ స్టార్ ఫ్యాన్స్ గెట్ రెడీ - 'హరిహర వీరమల్లు' కొత్త రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్!

'వార్ 2' సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తుండగా.. ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. ఆగస్ట్ 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. మూవీలో ఎన్టీఆర్ 'రా' (RAW) ఏజెంట్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఏజెంట్ పాత్రలన్నింటి కంటే ఆయన రోల్ డిఫరెంట్‌గా ఉండనున్నట్లు సమాచారం. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా తెరకెక్కిన స్పై థ్రిల్లర్ మూవీ 'వార్'. ఈ స్పై త్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది.

ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా 'వార్ 2' తెరకెక్కుతోంది. ఈ సినిమాలో హృతిక్ రోషన్, ఎన్టీఆర్‌లపై ఓ స్పెషల్ సాంగ్ కూడా ఉందని తెలుస్తోంది. ఇద్దరు స్టార్ హీరోలు, 500 మంది డ్యాన్సర్లతో భారీగా ఈ సాంగ్ ఉండనున్నట్లు తెలుస్తుండగా.. బాస్కో మార్టిస్ ఈ పాటకు కొరియాగ్రాఫర్‌గా ఉన్నట్లు సమాచారం. ఈ పాట మూవీకే హైలెట్‌గా ఉండనుందని మేకర్స్ అంటున్నారు. బాలీవుడ్‌లోనూ ఎన్టీఆర్ హిట్ కొట్టాలని ఆయన ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు.

అదే రోజున ఎన్టీఆర్ నీల్ మూవీ గ్లింప్స్

ఇక అదే రోజున ఎన్టీఆర్ (NTR), ప్రశాంత్ నీల్ కాంబో భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'డ్రాగన్' (ప్రచారంలో ఉన్న టైటిల్) మూవీ నుంచి ఫస్ట్ గ్లింప్స్ రానుంది. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లు ఇదివరకే మూవీ టీం ప్రకటించింది. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, టీ సిరీస్ ఫిలిమ్స్ సమర్పణలో  మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన 'సప్త సాగరాలు దాటి' ఫేం రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. రవి బ్రసూర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది జూన్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
Jo Jo Movie: దేవ కట్టా సమర్పణలో... రస్టిక్ రొమాంటిక్ కామెడీ 'జో జో'
దేవ కట్టా సమర్పణలో... రస్టిక్ రొమాంటిక్ కామెడీ 'జో జో'
Husharu Pittalu Review - 'హుషారు పిట్టలు' రివ్యూ: మారుతి 'ఈ రోజుల్లో', 'బస్ స్టాప్' రేంజ్‌లో... బోల్డ్ సినిమా ఎలా ఉందంటే?
'హుషారు పిట్టలు' రివ్యూ: మారుతి 'ఈ రోజుల్లో', 'బస్ స్టాప్' రేంజ్‌లో... బోల్డ్ సినిమా ఎలా ఉందంటే?
Varun Tej : మెగా బ్రదర్స్ పిక్‌తో వాయువ్ తేజ్ - మెగా బుడ్డోడి క్యూట్ ఫోటో
మెగా బ్రదర్స్ పిక్‌తో వాయువ్ తేజ్ - మెగా బుడ్డోడి క్యూట్ ఫోటో

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: ఎర్రకోటలో 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
ఎర్రకోటలో 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
Petrol-Diesel Windfall Tax: పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
Embed widget