Arjun Son Of Vyjayanthi OTT Streaming: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Arjun Son Of Vyjayanthi OTT Platform: నందమూరి కల్యాణ్ రామ్, విజయశాంతి తల్లీకొడుకులుగా నటించిన రీసెంట్ మూవీ అర్జున్ సన్నాఫ్ వైజయంతి. ఈ మూవీ తాజాగా ఓటీటీలోకి సడన్‌గా అందుబాటులోకి వచ్చింది.

Nandamuri Kalyan Ram's Arjun Son Of Vyjayanthi OTT Streaming: యంగ్ హీరో నందమూరి కల్యాణ్ రామ్, విజయశాంతి తల్లీకొడుకులుగా నటించిన లేటెస్ట్ మూవీ 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి. ఏప్రిల్ 18న రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ సొంతం చేసుకుంది. ఎలాంటి ముందస్తు అనౌన్స్‌మెంట్ లేకుండానే ఈ మూవీ తాజాగా ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది.
ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఈ మూవీ తాజాగా ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో (Amazon Prime Video) స్ట్రీమింగ్ అవుతోంది. మొన్నటి వరకూ యూకేలో ఉన్న వాళ్లు రెంటల్ విధానంలో మాత్రమే మూవీ చూసే ఛాన్స్ ఉండేది. తాజాగా.. భారత్‌లో ఉచితంగానే ఈ సినిమాను చూసి ఎంజాయ్ చెయ్యొచ్చు. దీంతో మూవీ లవర్స్ ఖుష్ అవుతున్నారు.
ఈ మూవీని భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రదీప్ చిలుకూరి తెరకెక్కించగా.. కల్యాణ్ రామ్ సరసన సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటించారు. సినిమాలో సోహైల్ ఖాన్, శ్రీకాంత్, యానిమల్ ఫేం పృథ్వీరాజ్ కీలక పాత్రలు పోషించారు. అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ అందించారు. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై అశోక్ వర్ధన్, సునీల్ బలుసు నిర్మించారు.
Also Read: ఆమిర్ ఖాన్ వర్సెస్ ఎన్టీఆర్ - పోటాపోటీగా 'దాదాసాహెబ్ ఫాల్కే' బయోపిక్.. ఎవరిది ఎప్పుడు వస్తుందో?
స్టోరీ ఏంటంటే?
వైజయంతి (విజయశాంతి) సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. తనలాగే తన కొడుకు అర్జున్ (నందమూరి కల్యాణ్ రామ్) కూడా పోలీస్ ఆఫీసర్ కావాలనేది ఆమె కల. తల్లి కలను నెరవేర్చేందుకు అర్జున్ కూడా తీవ్రంగా శ్రమిస్తాడు. సివిల్స్ రాసి జాతీయ స్థాయిలో ఆరో ర్యాంక్ సాధిస్తాడు. అయితే.. అనుకోని రీతిలో అర్జున్ తండ్రి మరణం అతని జీవితాన్ని అనుకోని మలుపు తిప్పుతాయి. ఆ తర్వాత జరిగిన పరిణామాలు అతన్ని గ్యాంగ్ స్టర్‌గా మారుస్తాయి. తన కనుసైగలతోనే విశాఖను శాసించే స్థాయికి ఎదుగుతాడు అర్జున్. ఎన్ని మర్డర్స్ చేసినా అతనిపై ఎవరూ కంప్లైంట్ కూడా చేయరు.
తన కలలకు డిఫరెంట్‌గా అర్జున్ వెళ్లడం చూసిన తల్లి వైజయంతి అతన్ని దూరం పెడుతుంది. అలా ఇద్దరి మధ్య ఊహించనంత దూరం పెరుగుతుంది. ఇదే టైంలో ముంబైలో కరుడుగట్టిన తీవ్రవాది నుంచి తన తల్లికి ప్రాణ హాని ఉందని అర్జున్ తెలుసుకుంటాడు. దీంతో తన తల్లిని కాపాడుకునేందుకు అర్జున్ ఏం చేశాడు?, అసలు అతను గ్యాంగ్ స్టర్‌గా మారడానికి దారి తీసిన పరిణామాలేంటి? విశాఖ కమిషనర్ ప్రకాష్ (శ్రీకాంత్) పాత్ర ఏంటి? తల్లీకొడుకులు చివరకు కలిశారా? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.





















