అన్వేషించండి
Advertisement
NTR Jayanthi: మహానాయకుడు ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించిన కళ్యాణ్ రామ్, తారక్
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు జయంతి నేడు. ఈ సందర్భంగా ఆయనకు నందమూరి కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ నివాళులు అర్పించారు.
తిరుగులేని కథానాయకుడు... ఎదురులేని మహానాయకుడు... విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) జయంతి నేడు. తెలుగు ప్రజల కీర్తిని ఖండాంతరాలకు చాటి చెప్పిన శక పురుషుని శత జయంతి సంవత్సరం ఇది.
ప్రతి ఏడాది ఎన్టీఆర్ జయంతి, వర్ధంతి రోజున నందమూరి కుటుంబ సభ్యులు హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర గల ఎన్టీఆర్ ఘాట్‌కు వెళ్లి మహానాయకుడి నివాళులు అర్పించడం ఆనవాయితీ. హరికృష్ణ కుమారులు, ప్రముఖ హీరోలు తారక్ (జూనియర్ ఎన్టీఆర్), కళ్యాణ్ రామ్ ఈ రోజు ఉదయమే ఎన్టీఆర్ ఘాట్ చేరుకున్నారు. తాతయ్యకు నివాళులు అర్పించారు.
View this post on Instagram
తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు నేడు ఘనంగా ప్రారంభం అయ్యాయి. తమ అభిమాన కథానాయకుడు, మహానాయకుడిని ప్రజలు స్మరించుకుంటున్నారు.
తారక్, కళ్యాణ్ రామ్ ఒకే కారులో వచ్చారు. కారును తారక్ స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ వచ్చారు.
View this post on Instagram
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
విజయవాడ
బిగ్‌బాస్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement