War 2 Deleted Scenes: టాలీవుడ్ To బాలీవుడ్ - 'వార్ 2'లో డిలీటెడ్ సీన్స్ ఏంటో తెలుసా?
War 2 Movie: ఎన్టీఆర్, హృతిక్ అవెయిటెడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ 'వార్ 2' కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో సెన్సార్ బోర్డ్ కొన్ని సీన్స్ కట్ చెప్పినట్లు తెలుస్తోంది.

NTR Hrithik Roshan's War 2 Deleted Scenes: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ లేటెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ 'వార్ 2' చూసేందుకు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీకి సెన్సార్ బోర్డ్ యు/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. అయితే, ఒక్కో భాషలో ఒక్కో రన్ టైం ఉండడంతో ఎక్కువ రన్ టైంలో ఏ సీన్స్ ఉంటాయనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.
ఈ మూవీ రన్ టైం తెలుగు, తమిళ భాషల్లో 2 గంటల 51 నిమిషాల 44 సెకన్లు కాగా... హిందీలో రన్ టైం 2 గంటల 53 నిమిషాల 24 సెకన్లుగా ఉంది. తెలుగులో కంటే హిందీ రన్ టైం 2 నిమిషాలు ఎక్కువగా ఉంది. మూవీలో కొన్ని సీన్స్ సెన్సార్ బోర్డ్ తొలగించాలని మేకర్స్‌కు సూచించినట్లు తెలుస్తోంది. మరి అవేంటో ఓసారి చూస్తే...
కియరా బికినీ సీన్స్ కట్?
మూవీలో హీరోయిన్ కియారా అద్వానీ బికినీ సీన్స్ ఉన్న సంగతి తెలిసిందే. టీజర్, సాంగ్స్‌లో ఆ సీన్స్ వైరల్ అయ్యాయి. ఆ సీన్లకు సంబంధించి 9 సెకన్లు తొలగించాలని సీబీఎఫ్‌సీ సూచించిందట. లేకుంటే 'ఏ' సర్టిఫికెట్ ఇస్తామని చెప్పగా... ఎలాగో అవి వైరల్ అయ్యాయి కాబట్టి తొలగించినా పెద్ద నష్టం లేదని భావించిన మేకర్స్ ఆ సీన్స్ తొలగించారట. ఈ న్యూస్ వైరల్ అవుతుండగా... ఆ సీన్స్ ఉంటే బాగుంటుందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఎన్టీఆర్ హృతిక్ మధ్య వార్ సీన్స్ కట్!
ఎన్టీఆర్, హృతిక్ మధ్య మూవీలో భారీ యాక్షన్ సీక్వెన్స్ ఉండగా వాటిలో ఛేజింగ్ సీన్స్‌లో దాదాపు 11 కట్స్ సూచించినట్లు తెలుస్తోంది. షిప్ లాగ్ షాట్, ఎన్టీఆర్ (విక్రమ్) హృతిక్ (కబీర్) మధ్య బోటు ఛేజింగ్ సీన్స్ 29 సెకన్సు, రేసింగ్ ట్రాక్‌పై ఇద్దరి యాక్షన్ సీక్వెన్స్ 3 సెకన్లు, టెలిఫోన్ బూత్ షాట్, విక్రమ్, సారంగ్ లాంగ్ షాట్... క్లైమాక్స్‌లో విక్రమ్, కబీర్ మధ్య యాక్షన్ సీక్వెన్స్ 8 సెకన్స్, కబీర్ కావ్య విక్రమ్ మధ్య యాక్షన్ సీక్వెన్స్ 7 సెకన్లు కట్ చెప్పినట్లు తెలుస్తోంది.
ఈ సీన్స్‌తో పాటే విక్రమ్, కబీర్ మధ్య క్లైమాక్స్ యాక్షన్ సీన్ 8 సెకన్స్, కబీర్ విక్రమ్ కావ్య మధ్య క్లోజప్ షాట్ 5 సెకన్స్, వీటితో పాటే ఎండ్ క్రెడిట్స్ నిడివి స్పీడ్ పెంచి 1 నిమిషం 47 సెకన్స్ చేంజేస్ సూచించారు. మొత్తంగా 6 నిమిషాల 25 సెకన్ల పాటు మూవీ కట్స్ సూచించినట్లు తెలుస్తోంది.
Also Read: మిడిల్ ఏజ్డ్ బ్యాచిలర్... 5 క్వాలిటీస్ - హిలేరియస్‌గా 'సుందరకాండ' ట్రైలర్
ఎన్టీఆర్‌కు ఇదే ఫస్ట్ బాలీవుడ్ మూవీ కాగా ఇద్దరు స్టార్స్ మధ్య వార్ చూసేందుకు ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తుండగా... హృతిక్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. స్పై అధికారిగా ఎన్టీఆర్ కనిపించనున్నారు. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా ఆరో మూవీగా 'వార్ 2' వస్తోంది. తెలుగులో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ రిలీజ్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో హిందీ వెర్షన్ తక్కువ థియేటర్లలో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది.





















