Sundarakanda Trailer: మిడిల్ ఏజ్డ్ బ్యాచిలర్... 5 క్వాలిటీస్ - హిలేరియస్‌గా 'సుందరకాండ' ట్రైలర్
Sundarakanda Trailer Out: యంగ్ నారా రోహిత్ లేటెస్ట్ ఫుల్ లెంగ్త్ లవ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ 'సుందరకాండ' ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఆద్యంతం కామెడీ టైమింగ్స్ పంచులతో ఆకట్టుకుంటోంది.

Nara Rohit's Sundarakanda Trailer Released: రీసెంట్‌గా 'భైరవం'తో ఆకట్టుకున్న యంగ్ హీరో నారా రోహిత్ మరో ఫుల్ లెంగ్త్ లవ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌తో అలరించబోతున్నారు. ఆయన కెరీర్‌లో ఇది 20వ మూవీ కాగా తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. న్యూ డైరెక్టర్ వెంకటేశ్ నిమ్మలపూడి దర్శకత్వం వహిస్తుండగా... ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.
హిలేరియస్ ట్రైలర్
ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్ భారీ హైప్ క్రియేట్ చేయగా ట్రైలర్ సైతం హిలేరియస్‌గా ఉంది. ఓ మిడిల్ ఏజ్డ్ బ్యాచిలర్ తన లైఫ్ పార్ట్‌నర్‌లో ఉండాల్సిన అయిదు క్వాలిటీస్ కోసం సెర్చ్ చేయడమే ప్రధానాంశంగా ఈ స్టోరీ సాగనున్నట్లు ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. ఈ జర్నీలో అతని కాలేజి డేస్ లవ్ స్టోరీ, ప్రజెంట్ లవ్ స్టోరీ... ఇలా రెండు ప్రేమకథలతో హిలేరియస్‌గా సాగుతుంది. ట్రైలర్‌లో ఈ రెండు టైమ్ లైన్ల మధ్య లవ్ టగ్ - ఆఫ్ - వార్‌ని ఫన్, మనసుని హత్తుకునే ఎమోషన్‌తో అద్భుతంగా చూపించారు.
నారా రోహిత్ కామెడీ టైమింగ్, పంచులు అదిరిపోయాయి. ఆయనతో పాటే నరేశ్, సత్య, వీటీవీ గణేష్, అభినవ్ గోమటం పోటాపోటీగా నవ్వులు పూయించారు. మూవీలో సీన్స్ క్రిస్ప్‌గా, సిట్యుయేషనల్ కామెడీ, ఎమోషనల్ బీట్స్‌కి స్మార్ట్ బ్యాలెన్స్ చేశాయి.
Also Read: సినీ కార్మికుల సమ్మెపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్.. 2 రోజుల్లో కార్మికులకు న్యాయం !
ఈ మూవీలో నారా రోహిత్ సరసన వృతి వాఘని, శ్రీదేవి విజయ్ కుమార్ హీరోయిన్లుగా నటించారు. వీరితో పాటే నరేష్, వాసుకి ఆనంద్, సత్య, అజయ్, వీటీవీ గణేష్, అభినవ్ గోమటం, విశ్వంత్, రూపలక్ష్మి, సునైనా, రఘుబాబు కీలక పాత్రలు పోషించారు. లియోన్ జేమ్స్ మ్యూజిక్ అందించగా... సందీప్ పిక్చర్ ప్యాలెస్ (SPP) బ్యానర్‌పై సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మిస్తున్నారు. ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది మూవీ.
రిలీజ్‌కు ముందే బిగ్ డీల్
ఈ మూవీ రిలీజ్‌కు ముందే నాన్ థియేట్రికల్ బిజినెస్‌లో అదరగొట్టింది. ప్రముఖ ఓటీటీ సంస్థ 'జియో హాట్ స్టార్' డిజిటల్ రైట్స్ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. సంస్థకు చెందిన 3 టీమ్స్ మూవీని చూసి కంటెంట్ బాగా నచ్చడంతో బిగ్ డీల్ కుదిరిందనే టాక్ వినిపిస్తోంది. రిలీజ్‌కు ముందే రూ.12 కోట్ల డీల్ కుదరగా... డిజిటల్ రైట్స్ 'స్టార్ మా' సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. థియేట్రికల్ రన్ తర్వాత ఈ మూవీ 'జియో హాట్ స్టార్'లో స్ట్రీమింగ్ కానుండగా... స్టార్ మాలో ప్రీమియర్ కానుంది. తెలుగు డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ రూ.9 కోట్లు, హిందీ డబ్బింగ్ ఆడియో రైట్స్ రూ.3 కోట్లకు కొనుగోలు చేశారనే టాక్ వినిపిస్తోంది.
ఈ మూవీలో సీనియర్ హీరో నరేష్ కీలక పాత్ర పోషిస్తుండగా... వాసుకి సైతం కీ రోల్ ప్లే చేస్తున్నారు. టాప్ కమెడియన్స్ నటిస్తుండడంతో మూవీపై భారీ హైప్ క్రియేట్ అవుతోంది.






















