అన్వేషించండి

'పుష్ప' విలన్ లేటెస్ట్ మూవీ 'ధూమం' - తెలుగు రిలీజ్ లేనట్టేనా?

ఫహద్ ఫజిల్ నటించిన లేటెస్ట్ మూవీ 'ధూమం' సినిమాని జూన్ 23న పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు చిత్ర యూనిట్ రిలీజ్ విషయంలో షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

మలయాళ ఇండస్ట్రీలో హీరో ఫహాద్ ఫజిల్ కి ఎలాంటి స్టార్డం ఉందో అందరికీ తెలిసిందే. కెరియర్ ప్రారంభంలో ఎన్నో వినూత్న సినిమాలు చేసి ప్రేక్షకుల్లో భారీ క్రేజ్ ను సంపాదించుకున్నాడు ఈ మలయాళ హీరో. ఇక ఓటిటి వేదికగా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యాడు. ముఖ్యంగా కరోనా లాక్డౌన్ టైంలో ఫహద్ ఫాజిల్ నటించిన సినిమాలు ఓటీటీలో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక అదే క్రేజ్ తో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన 'పుష్ప' సినిమాలో ఛాన్స్ అందుకున్నాడు. పుష్ప మూవీలో భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో ప్రేక్షకులను ఎంతగా భయపెట్టాడో తెలిసిందే. పుష్ప పార్ట్ వన్ చివరి 15 నిమిషాలు బన్వర్ సింగ్ షికావత్ గా భయపెట్టిన ఫహాద్ ఫజిల్ పాత్ర 'పుష్ప 2' లో ఇంకెలా ఉంటుందోనని ఆడియన్స్ లో సర్వత్ర ఆసక్తి నెలకొంది.

ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఫహాద్ ఫజిల్ వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. అందులో 'ధూమం' అనే సినిమా కూడా ఒకటి. 'కేజిఎఫ్',  'కాంతారా' వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన హోంబలే ఫిలిం సంస్థ ఈ సినిమాని నిర్మిస్తోంది. సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'యూ టర్న్' అనే సినిమాని తెరకెక్కించిన పవన్ కుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాలో ఫహద్ ఫాజిల్ సరసన అపర్ణ బాలమురళి హీరోయిన్ గా నటించింది. వినీత్, రోషన్ మాథ్యూ, అచ్యుత్ కుమార్ ఇతర కీలకపాత్రను పోషించారు. రీసెంట్ గానే ఈసినిమా ట్రైలర్ను విడుదల చేయగా మంచి రెస్పాన్స్ అందుకుంది. ట్రైలర్ తో సినిమాపై ఒక్కసారిగా అంచనాలను పెంచేశారు. ఇక ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ముందుగా ప్రకటించారు. జూన్ 23న ధూమం సినిమాని మలయాళం తో పాటు హిందీ, తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

కానీ తాజా సమాచారం ప్రకారం జూన్ 23న 'ధూమం' సినిమాకు సంబంధించి కేవలం మలయాళం, కన్నడ వెర్షన్ మాత్రమే విడుదల చేస్తున్నారట. ఒకవేళ మలయాళంలో కనుక సినిమా సక్సెస్ అయితే ఆ తర్వాత ఇతర భాషల్లో విడుదల చేయాలని మేకర్స్ డిసైడ్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మలయాళ వెర్షన్ ని విడుదల చేసిన కొన్ని వారాలకు తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.

ప్రస్తుతం హైదరాబాద్ తో పాటు పలు ఇతర ప్రధాన నగరాల్లో ధూమం సినిమా మలయాళ వెర్షన్ బుకింగ్స్ మాత్రమే అందుబాటులోకి ఉన్నాయి. ఇక త్వరలోనే చిత్ర యూనిట్ నుంచి ఇందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది. కాగా ఈ సినిమా క్రైమ్ నేపథ్యంలో సాగే సస్పన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. ఈ విషయాన్ని మూవీ టీం ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ లో స్పష్టం చేశారు. డబ్బు, కిడ్నాప్, పోలీసులు, చేజింగ్ సీన్స్.. వీటన్నింటినీ బట్టి చూస్తే ఈ సినిమా ఆడియన్స్ కి మంచి థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

Also Read: మంగళవారం రోజు పాప పుట్టడం సంతోషం - జాతకం కూడా చాలా బాగుందంటున్నారు: చిరంజీవి

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

 

టాప్ హెడ్ లైన్స్

Ranabaali OTT : రణబాలి ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ - విరోష్ కపుల్ కొత్త మూవీ స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
రణబాలి ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ - విరోష్ కపుల్ కొత్త మూవీ స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
Cult First Weekend Collections : విశ్వక్ సేన్ 'కల్ట్' ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - మాస్ కా దాస్ వయలెంట్ యాక్షన్ మూవీ ఎంత వసూళ్లు సాధించిందంటే?
విశ్వక్ సేన్ 'కల్ట్' ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - మాస్ కా దాస్ వయలెంట్ యాక్షన్ మూవీ ఎంత వసూళ్లు సాధించిందంటే?
Irumudi Controversy : మరో వివాదంలో రవితేజ ఇరుముడి - నిర్మాతలకు కార్మిక శాఖ నోటీసులు... వయలేషన్స్ జరిగితే?
మరో వివాదంలో రవితేజ ఇరుముడి - నిర్మాతలకు కార్మిక శాఖ నోటీసులు... వయలేషన్స్ జరిగితే?
Nayanthara Simbu: మాజీ ప్రేమికులు మళ్లీ సినిమా చేస్తారా? - శింబు నయనతారలతో యంగ్ డైరెక్టర్ కొత్త మూవీ
మాజీ ప్రేమికులు మళ్లీ సినిమా చేస్తారా? - శింబు నయనతారలతో యంగ్ డైరెక్టర్ కొత్త మూవీ

వీడియోలు

Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amit Shah Telangana BJP Padayatra: తెలంగాణపై అమిత్ షా కన్ను - హైదరాబాద్ పాదయాత్రతో బీజేపీ గేర్ మార్చబోతుందా?
తెలంగాణపై అమిత్ షా కన్ను - హైదరాబాద్ పాదయాత్రతో బీజేపీ గేర్ మార్చబోతుందా?
Cyclone Murasu: 22 కి.మీ వేగంతో దూసుకొస్తున్న మురసు తుపాను.. ఏపీలో ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
22 కి.మీ వేగంతో దూసుకొస్తున్న మురసు తుపాను.. ఏపీలో ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
Raptadu Girl Attack Case: రాప్తాడు దాడి నిందితుడి కాళ్లు తొలగించే అవకాశం? బుల్లెట్లు దిగడంతో పరిస్థితి విషమం
రాప్తాడు దాడి నిందితుడి కాళ్లు తొలగించే అవకాశం? బుల్లెట్లు దిగడంతో పరిస్థితి విషమం
School Holidays: మురసు తుపాను ఎఫెక్ట్.. ఏపీలో పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు
మురసు తుపాను ఎఫెక్ట్.. ఏపీలో పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు
KTR: కరువు పరిస్థితులకు రేవంత్ రెడ్డిదే బాధ్యత.. రైతులకు రూ.60 వేలు చెల్లించాలి: కేటీఆర్
కరువు పరిస్థితులకు రేవంత్ రెడ్డిదే బాధ్యత.. రైతులకు రూ.60 వేలు చెల్లించాలి: కేటీఆర్
Murasu Cyclone: దూసుకొస్తున్న మురసు తుపాను.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు! 3న తీరం దాటే అవకాశం
దూసుకొస్తున్న మురసు తుపాను.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు! 3న తీరం దాటే అవకాశం
Electric Car Sound: అక్టోబర్ నుంచి ఎలక్ట్రిక్ కార్లకు తప్పనిసరిగా AVAS.. వేగం 20km కంటే తగ్గితే ప్రత్యేక సౌండ్ అలర్ట్
ఎలక్ట్రిక్ కారు నడుస్తున్నప్పుడు సౌండ్ తప్పనిసరి, కొత్త రూల్స్ ఇవే!
Cult First Weekend Collections : విశ్వక్ సేన్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - మాస్ కా దాస్ వయలెంట్ యాక్షన్ మూవీ ఎంత వసూళ్లు సాధించిందంటే?
విశ్వక్ సేన్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - మాస్ కా దాస్ వయలెంట్ యాక్షన్ మూవీ ఎంత వసూళ్లు సాధించిందంటే?
Embed widget