Nithiin : నిర్మాత దిల్ రాజును దారుణంగా వాడేస్తున్న నితిన్.. మరీ ఇంతగానా!
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్.. తనకు ‘దిల్’లాంటి బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని ఇచ్చిన నిర్మాత దిల్ రాజును దారుణంగా వాడేస్తున్నాడు. నితిన్ వాడకం గురించి తెలిసిన వారంతా ఇదే కామెంట్ చేస్తున్నారు. మ్యాటర్ ఏంటంటే..
Nithiin Viral Dialogue : నిర్మాత దిల్ రాజును నితిన్ దారుణంగా వాడేస్తున్నాడు. అవును మీరు వింటున్నది నిజమే. తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిన్న డిస్ట్రిబ్యూటర్‌గా ప్రయాణం స్టార్ట్ చేసిన దిల్ రాజు.. నేడు టాలీవుడ్‌లో టాప్ నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా కొనసాగుతున్నారు. ఆయన నిబద్ధతకి టాలీవుడ్ ఎన్నో ఇచ్చింది. టాలీవుడ్ పరంగా ఎన్నో బాధ్యతలను నిర్వహించిన దిల్ రాజు.. ఇప్పుడు నిర్మాతగా పాన్ ఇండియా స్థాయి సినిమాలను నిర్మిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఆయనకు కీలక పదవిని ఇచ్చి, గౌరవించింది. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా దిల్ రాజుని నియమించి.. టాలీవుడ్ బాధ్యతను ఆయన చేతిలో పెట్టింది. సో.. సక్సెస్‌కి కేరాఫ్ అడ్రస్ అంటే కచ్చితంగా దిల్ రాజును చూపించవచ్చు. అలాంటి దిల్ రాజును నితిన్ దారుణంగా వాడేస్తున్నాడంటే వార్త కాకుండా ఎలా ఉంటుంది? అసలు విషయం ఏమిటంటే..
Also Read: అమెరికాలో విష్ణు... విశ్రాంతిలో మోహన్ బాబు... మనోజ్ కొట్లాట కథనాల్లో నిజమెంత?
ఆ మధ్య కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌తో దిల్ రాజు నిర్మించిన తెలుగు, తమిళ ప్రాజెక్ట్ ‘వారసుడు/ వారిసు’ చిత్ర ప్రమోషన్స్‌లో దిల్ రాజు వచ్చి రానీ తమిళంలో మాట్లాడిన మాటలు ఎలా వైరల్ అయ్యాయో తెలిసిందే. ‘డ్యాన్స్ వెనుమా డ్యాన్స్ ఇరుక్కు, ఫైట్స్ వెనుమా ఫైట్స్ ఇరుక్కు..’ అంటూ ‘అది దా సర్‌ప్రైజ్’ అని దిల్ రాజు ఇచ్చిన ప్రసంగం, ఆ తర్వాత ఏ రేంజ్లో వైరల్ అయిందో తెలియంది కాదు. ఈ ప్రసంగం ఓ పాటగా కూడా ఈ మధ్య ఓ సినిమాలో వచ్చింది. ఇప్పుడు నితిన్ వంతు వచ్చింది. దిల్ రాజు మాట్లాడిన ప్రసంగంలోని ‘అది దా సర్‌ప్రైజ్’ పదంతో నితిన్ సినిమాలో ఓ ఐటమ్ సాంగ్‌ని ప్లాన్ చేశారు. ఈ సాంగ్‌కి సంబంధించిన అధికారిక ప్రకటన రావడంతో.. అంతా దిల్ రాజుని నితిన్ ఎలా వాడుతున్నాడో చూశారా? అంటూ కామెంట్స్ స్టార్ట్ చేస్తున్నారు. అన్నట్లు.. దిల్ రాజు పేరులోని ‘దిల్’ అనే పేరు రాజుకి యాడ్ అయింది దిల్ రాజు నిర్మించిన ‘దిల్’ చిత్రంతోనే అనే విషయం తెలిసిందే.
The hottest & the most sizzling surprise of the year - @TheKetikaSharma will set your screens on fire 🌟🔥 #Robinhood Second Single #AdhiDhaSurprisu Song Promo Out Today At 5:04 PM.
— Mythri Movie Makers (@MythriOfficial) December 9, 2024
Full Song Out on December 10th, 5.04 PM ❤🔥
A @gvprakash musical
Lyrics by Academy Award… pic.twitter.com/NRftqh05Om
నితిన్, శ్రీలీల, వెంకీ కుడుముల కాంబినేషన్‌లో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న చిత్రం ‘రాబిన్‌హుడ్’. శ్రీలీల ప్లేస్‌లో ఫస్ట్ రష్మికా మందన్నా ఈ సినిమాకు హీరోయిన్‌గా సెలక్ట్ అయ్యారు. ఈ ప్రాజెక్ట్ నుండి.. కొంత మేర షూటింగ్ అనంతరం రష్మిక తప్పుకుంది. ఆమె ప్లేస్‌లోనే శ్రీలీలను హీరోయిన్‌గా తీసుకున్నారు. ఇప్పుడీ సినిమాలో శ్రీలీలతో పాటు మరో హీరోయిన్ కూడా ఐటమ్ సాంగ్తో యాడ్ అవుతోంది.
ఆ హీరోయిన్ ఎవరో కాదు.. కేతికా శర్మ. ఈ మధ్య కేతికా శర్మకు సరైన అవకాశాలు లేవు. ఇప్పుడు నితిన్ ‘రాబిన్‌హుడ్’లో ఆమెకు ఐటమ్ సాంగ్ చేసే అవకాశం వరించింది. ‘అది దా సర్‌ప్రైజ్’ అంటూ సాగే ఈ పాట ప్రోమోని సోమవారం విడుదల చేసి ఫుల్ సాంగ్‌ని డిసెంబర్ 10 సాయంత్రం 5గంటల 4 నిమిషాలకు విడుదల చేయబోతున్నట్లుగా తెలుపుతూ.. కేతికా శర్మ స్టన్నింగ్ లుక్‌తో ఓ పోస్టర్ వదిలారు. ఈ సినిమాకు జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను క్రిస్మస్ స్పెషల్‌గా డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.
Also Read: బూత్ బంగ్లాలో RC 16... అమెరికాలో Game Changer... ఇదీ డిసెంబర్‌లో రామ్ చరణ్ షెడ్యూల్