Kakinada News: కాకినాడ జిల్లాలో పులి సంచారం - స్థానికుల ఆందోళన, అటవీ అధికారుల గాలింపు
Tiger Migration: కాకినాడ జిల్లాలో పులి సంచారం ఆందోళన కలిగిస్తోంది. ప్రత్తిపాడు సమీప ప్రాంతాల్లో పులి వచ్చిందన్న అనుమానాలు నెలకొనగా స్థానికులు పోలీసులు, అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు.
Tiger Migration In Kakinada District: కాకినాడ జిల్లాలో (Kakinada District) మళ్లీ పులి సంచారం కలకలం రేపుతోంది. ప్రత్తిపాడు సమీప ప్రాంతాల్లో పులి వచ్చిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాపన్నధార పరిసర ప్రాంతాల్లో ఓ పశువు మృతి చెందడం పులి సంచార వార్తలను మరింత బలపరుస్తున్నాయి. ఈ ఘటనపై స్థానికులు.. పోలీసులు, అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో ఆదివారం బాపన్నధార, ధారపల్లి, బురదకోట పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. పులి సంచారంపై త్వరలోనే స్పష్టత ఇస్తామని అధికారులు తెలిపారు.
కాగా, 2022, మేలో 37 రోజుల పాటు కాకినాడలోని పలు ప్రాంతాల్లో పులి సంచరించింది. ప్రత్తిపాడు, ఏలేశ్వరం, రౌతులపూడి, శంఖవరం, తుని మండలాల్లో సంచరించింది. ఇటీవల సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకూ దాదాపు 45 రోజులు రాజమహేంద్రవరం, కడియం, ఆలమూరు, రావులపాలెం పరిసర ప్రాంతాల్లో పులి సంచరించింది. తాజాగా, ప్రత్తిపాడు మండలంలోనూ పులి సంచరించిందనే సమాచారంతో స్థానికులంతా ఆందోళనకు గురవుతున్నారు.