News
News
వీడియోలు ఆటలు
X

Chiranjeevi As Chief Guest : సినిమా ఇవ్వలేదు కానీ ఆశీసులు ఇస్తున్న చిరంజీవి

యువ దర్శకుడితో సినిమా చేయాలనుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. అయితే, ఆ సినిమా మధ్యలో ఆగింది. ఆ దర్శకుడికి చిరంజీవి సినిమా ఇవ్వలేదు. కానీ, ఆశీస్సులు మాత్రం ఇస్తున్నారు. 

FOLLOW US: 
Share:

'ఛలో', 'భీష్మ'తో యువ దర్శకుడు వెంకీ కుడుముల (Venky Kudumula) బ్యాక్ టు బ్యాక్ రెండు హిట్స్ అందుకున్నారు. ఆ తర్వాత తన అభిమాన కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)తో సినిమా చేసే అవకాశాన్ని అందుకున్నారు. ఆ మధ్య చిరు, వెంకీ కుడుముల కలయికలో డీవీవీ దానయ్య సినిమా అనౌన్స్ చేశారు. ఏమైందో ఏమో గానీ ఆ సినిమా పట్టాలు ఎక్కలేదు. మధ్యలో ఆగింది. అయితే, ఆ దర్శకుడి కొత్త సినిమాకు చిరు ఆశీస్సులు ఇస్తున్నారు.    

నితిన్, రష్మిక సినిమా...
ముఖ్య అతిథిగా చిరు!
నితిన్ (Hero Nithiin), రష్మికా మందన్నా (Rashmika Mandanna) జంటగా వెంకీ కుడుముల 'భీష్మ' తీసి విజయం అందుకున్నారు. ఇప్పుడు ఈ కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతోంది. నితిన్, రష్మిక, వెంకీ కుడుముల... ఇప్పుడు ఈ ముగ్గురూ కలిసి మరో సినిమా చేయబోతున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. 

నితిన్, రష్మిక జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా శుక్రవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. ఆ కార్యక్రమానికి చిరు వస్తున్నారు. ఉగాది సందర్భంగా ఈ సినిమాను అనౌన్స్ చేశారు. ఓ వీడియో విడుదల చేసిన చిత్రబృందం సెల్ఫ్ సెటైర్స్ వేసుకున్నారు.

Also Read : బ్రహ్మికి చిరు, చరణ్ సత్కారం - స్టార్స్‌ను మెప్పిస్తున్న 'రంగమార్తాండ'

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mythri Movie Makers (@mythriofficial)

మళ్ళీ సేమ్ హీరోయిన్ - వెంకీపై నితిన్!
'భీష్మ' కంటే ముందు 'ఛలో' సినిమాకు వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. దర్శకుడిగా ఆయనకు తొలి సినిమా అది. కథానాయికగా తెలుగులో రష్మికకు కూడా అదే తొలి సినిమా. 'భీష్మ' ఇంటర్వ్యూల్లో వెంకీ కుడుముల స్క్రిప్ట్ రాయడం కంటే ముందు, ఓం కంటే ముందు కథానాయికగా రష్మిక పేరు రాస్తాడని నితిన్ సరదాగా కామెంట్ చేశారు. మరోసారి ఆ విషయాన్ని గుర్తు చేశారు. 

'ప్రభా... ఎవరూ ఇంకా రాలేదా?' అని నితిన్ అడుగుతారు. 'హీరోయిన్ ఉదయం 8 గంటలకు వచ్చారు' అని అసిస్టెంట్ నుంచి సమాధానం వస్తుంది. '8 గంటలకా సేమ్ హీరోయినా?' అంటూ నితిన్ అడుగుతారు. ఇంతలో రష్మిక వచ్చారు. 'సేమ్ హీరోయినే. డౌటా?' అని అడుగుతారు. 'అస్సలు లేదమ్మా! మన డైరెక్టర్ స్క్రిప్ట్ లో ఓం రాసే ముందు నీ పేరే రాస్తాడు. నాకు తెలుసుగా' అని నితిన్ ఆన్సర్ ఇచ్చారు. 

రష్మిక కాంట్రవర్సీలు... నితిన్ ఫ్లాపులు!
ఇటీవల రష్మిక చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాలకు దారి తీశాయి. ఆ విషయాన్నీ దర్శకుడు వెంకీ కుడుముల కామెడీ చేసేశారు. 'ఎనిమిది గంటలకు వచ్చి ఏం చేస్తున్నావ్?' అని నితిన్ అడిగితే... 'ఢిల్లీ, బాంబే అభిమానులతో ఇప్పటి వరకు ఇంస్టాగ్రామ్ లైవ్ పెట్టుకున్నా. ఈ షూట్ అయిన తర్వాత హైదరాబాద్, బెంగళూరు, చెన్నై కొచ్చిన్....' అంటూ రష్మిక చెప్పుకుంటూ వెళితే నితిన్ బ్రేకులు వేస్తారు. నేషనల్ క్రష్ కాబట్టి ఆ మాత్రం ఉంటుందని చెబుతారు. 

Also Read మృగాలను భయపెట్టే మగాడిగా ఎన్టీఆర్ - స్టోరీలైన్ చెప్పేసిన కొరటాల 

'లైవ్ యేనా? కాంట్రవర్సీలు ఏమైనా?' అని నితిన్ అడగబోతే... 'అక్కడికి వెళ్ళవద్దు. నేను ఒక్క మాట్లాడితే రెండు మూడు కాంట్రవర్సీలు అవుతున్నాయి' అని రష్మిక ఆవేదన వ్యక్తం చేశారు. 'అది చాలా బెటర్. నేను ఒక్క హిట్ ఇస్తే రెండు మూడు ఫ్లాపులు అవుతున్నాయ్' అని నితిన్ సెల్ఫ్ సెటైర్ వేసుకున్నారు.  

జీవీ... నువ్వు హీరో కాదమ్మా?
నితిన్, రష్మిక, వెంకీ కుడుముల సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీత దర్శకుడు. ఆయన తమిళంలో హీరోగా కూడా నటిస్తున్నారు. ఈ సినిమాకు మేకప్ వేసుకోవడం లేదని, కేవలం మ్యూజిక్ ఇస్తే చాలంటూ అతడి మీద సెటైర్ వేశారు. 'భీష్మ' సినిమా విడుదలైన మూడేళ్లకు వెంకీ కుడుముల సినిమా పట్టాలు ఎక్కుతోంది. ఆ లేటు మీద కూడా సెటైర్ పడింది. తాము ఎవరి మనోభావాలు దెబ్బ తీయడం లేదని, తమ మనోభావాలు తామే దెబ్బ తీసుకుంటున్నామని వీడియో స్టార్టింగులో నితిన్, రష్మిక చెప్పడం విశేషం

Published at : 23 Mar 2023 07:26 PM (IST) Tags: Rashmika Mandanna Nithiin Venky Kudumula Chiranjeevi

సంబంధిత కథనాలు

Cannes 2023: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సత్తా చాటిన 'శాకుంతలం', ఏకంగా నాలుగు కేటగిరీల్లో అవార్డులు

Cannes 2023: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సత్తా చాటిన 'శాకుంతలం', ఏకంగా నాలుగు కేటగిరీల్లో అవార్డులు

Keerthy Suresh Dating: ఆ అసత్య వార్తలతో మనఃశాంతి కరువవుతోంది - కీర్తి సురేష్‌ తండ్రి ఆవేదన!

Keerthy Suresh Dating: ఆ అసత్య వార్తలతో మనఃశాంతి కరువవుతోంది - కీర్తి సురేష్‌ తండ్రి ఆవేదన!

చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్

చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్

గీతా ఆర్ట్స్‌లో అక్కినేని, శర్వానంద్‌కు యాక్సిడెంట్ - నేటి టాప్ 5 సినీ విశేషాలివే!

గీతా ఆర్ట్స్‌లో అక్కినేని, శర్వానంద్‌కు యాక్సిడెంట్ - నేటి టాప్ 5 సినీ విశేషాలివే!

NTR In Rest Mode : 'దేవర'కు ఇంకో వారం విశ్రాంతి - ఎన్టీఆర్ మళ్ళీ సెట్స్‌కు వచ్చేది ఎప్పుడంటే?

NTR In Rest Mode : 'దేవర'కు ఇంకో వారం విశ్రాంతి - ఎన్టీఆర్ మళ్ళీ సెట్స్‌కు వచ్చేది ఎప్పుడంటే?

టాప్ స్టోరీస్

Balakrishna at Mahanadu: ఎన్టీఆర్ తెచ్చిన సంక్షేమ పథకాలు చిరస్మరణీయం, చంద్రబాబు విజన్ ఎందరికో ఆదర్శం

Balakrishna at Mahanadu: ఎన్టీఆర్ తెచ్చిన సంక్షేమ పథకాలు చిరస్మరణీయం, చంద్రబాబు విజన్ ఎందరికో ఆదర్శం

IPL 2023: వర్షం కారణంగా ఐపీఎల్ ఫైనల్ వాయిదా - రేపు కూడా జరగకపోతే!

IPL 2023: వర్షం కారణంగా ఐపీఎల్ ఫైనల్ వాయిదా - రేపు కూడా జరగకపోతే!

Ambati Rayudu Political Entry: క్రికెట్ కు అంబటి రాయుడు గుడ్‌ బై - నెక్ట్స్ పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడతారా!

Ambati Rayudu Political Entry: క్రికెట్ కు అంబటి రాయుడు గుడ్‌ బై - నెక్ట్స్ పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడతారా!

NTR కి నిజమైన రాజకీయ, పరిపాలన వారసుడు సీఎం కేసిఆర్ : మంత్రి ఎర్రబెల్లి

NTR కి నిజమైన రాజకీయ, పరిపాలన వారసుడు సీఎం కేసిఆర్ : మంత్రి ఎర్రబెల్లి