అన్వేషించండి

Nithiin: టాలీవుడ్ హీరోకు ధోనీ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌, నెట్టింట్లో ఫోటో వైరల్

Nithiin: టాలీవుడ్ నటుడు నితిన్ కు అరుదైన గిఫ్ట్ అందింది. టీమిండియా మాజీ కెప్టెన్ ధోని సైన్ చేసిన టీషర్ట్ ను బహుమతిగా అందుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Nithiin gets a special gift from MS Dhoni: టాలీవుడ్ హీరో నితిన్ తాజాగా నటిస్తున్న చిత్రం ‘ఎక్స్‌ ట్రా ఆర్డినరీ మ్యాన్‌’. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాకు వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. క్యూట్ బ్యూటీ శ్రీలీల ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. డిసెంబర్ 8న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. డేంజర్ పిల్లా, బ్రష్‌ వేసుకో అనే పాటలు సంగీత ప్రియులను బాగా అలరిస్తున్నాయి.

ధోని నుంచి సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ అందుకున్న నితిన్

‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’ విడుదల దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన కార్యక్రమాలను ముమ్మరంగా నిర్వహిస్తోంది. నితిన్ తో పాటు మూవీ యూనిట్ వరుస ఇంటర్వ్యూలతో సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నితిన్ సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఓ ఫోటో బాగా వైరల్ అవుతోంది. టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్ ధోనీ సైన్ చేసిన టీ షర్ట్‌ ను నితిన్‌ కు గిఫ్ట్ గా అందించాడు. నితిన్ తాజా మూవీ ‘ఎక్స్‌ ట్రా ఆర్డినరీ మ్యాన్‌’ సినిమా విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ బెస్ట్ విషెస్ చెప్పారు. ఈ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ పై నితిన్ స్పందించాడు. “ఎక్స్‌ ట్రా ఆర్డినరీ మ్యాన్‌ నుంచి ఎక్స్‌ ట్రా ఆర్డినరీ బహుమతి. ఈ కానుక అందించిన ధోనికి ధన్యవాదాలు. లవ్‌ యూ” అంటూ ట్వీట్ చేశాడు. టీషర్ట్‌ పట్టుకొని దిగిన స్టిల్‌ ను షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇంతకీ ధోనీని నితిన్‌ ఎప్పుడు? ఎక్కడ కలిశాడో? తెలియాల్సి ఉంది.     

డిసెంబర్‌ 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదల

‘ఎక్స్‌ ట్రా ఆర్డినరీ మ్యాన్‌’ సినిమా కామెడీ యాక్షన్‌ డ్రామా నేపథ్యంలో రూపొందుతోంది. ఈ చిత్రంలో మోస్ట్ వాంటెడ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. యాంగ్రీ యంగ్‌ మ్యాన్‌ డాక్టర్ రాజశేఖర్‌ ముఖ్యపాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రాన్ని నితిన్ హోం బ్యానర్‌ శ్రేష్ఠ్‌ మూవీస్‌ పై సుధాకర్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నితిన్‌ స్మగ్లర్‌ గా కనిపించనున్నట్టు ప్రచారం జరుగుతోంది. అటు నితిన్ వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ పై నవీన్‌ యేర్నేని, వై రవి శంకర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించనున్నారు. అటు నితిన్ నటించిన ‘ఎక్స్‌ ట్రా ఆర్డినరీ మ్యాన్‌’ సినిమా డిసెంబర్‌ 8న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. 

Read Also: ఆ సన్నివేశాలు చేయడానికి భయపడ్డా, ఆలియా సపోర్ట్ చేసింది: రణబీర్ కపూర్

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply

టాప్ హెడ్ లైన్స్

Comrade Kalyan Live Updates - 'కామ్రేడ్ కళ్యాణ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ మీ కోసం... హైదరాబాద్‌లో ప్రీమియర్స్ షురూ
'కామ్రేడ్ కళ్యాణ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ మీ కోసం... హైదరాబాద్‌లో ప్రీమియర్స్ షురూ
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఎపిక్ To థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఐస్... ఈ సినిమాలు అస్సలు మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఎపిక్ To థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఐస్... ఈ సినిమాలు అస్సలు మిస్ కావొద్దు
Aggipetti Macha : ఆగిన అగ్గిపెట్టె మచ్చ అంత్యక్రియలు - ఆస్తి వివాదాలే కారణమా?
ఆగిన అగ్గిపెట్టె మచ్చ అంత్యక్రియలు - ఆస్తి వివాదాలే కారణమా?
Ranabaali Trailer Review : విజయ్ దేవరకొండ రణబాలి ట్రైలర్ రివ్యూ - శింగనమల బొబ్బిలి యాక్షన్, వయలెన్స్ వేరే లెవల్
విజయ్ దేవరకొండ రణబాలి ట్రైలర్ రివ్యూ - శింగనమల బొబ్బిలి యాక్షన్, వయలెన్స్ వేరే లెవల్

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Ravindra Jadeja Viral Post: అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, జడేజా కామెంట్ వైరల్
అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, సోషల్ మీడియాలో జడేజా కామెంట్ వైరల్
Indian 3 Movie Release : సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
AP Local Elections: ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
Embed widget