Ranbir Kapoor: ఆ సన్నివేశాలు చేయడానికి భయపడ్డా, ఆలియా సపోర్ట్ చేసింది: రణబీర్ కపూర్
Ranbir Kapoor: ఆలియా భట్ పై రణబీర్ కపూర్ ప్రశంసల జల్లు కురిపించారు. ‘యానిమల్’ సినిమా విషయంలో తన భార్య నుంచి లభించిన సపోర్టును ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పారు.

Ranbir Kapoor about Alia Bhatt: బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నటించిన లేటెస్ట్ మూవీ ‘యానిమల్’ విడుదలకు రెడీ అవుతోంది. డిసెంబర్ 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్ ముమ్మరం చేసింది. హీరో రణబీర్ కపూర్ వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సినిమాపై అంచనాలను పెంచే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సినిమాతో పాటు తన వ్యక్తిగత విషయాల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. పనిలో పనిగా తన భార్య ఆలియా భట్ మీద ఆయన ప్రశంసల జల్లు కురిపించారు.
ఆలియా మద్దతును మర్చిపోలేను: రణబీర్
‘యానిమల్’ ఈ సినిమా షూటింగ్ సమయంలో తన భార్య ఆలియా నుంచి చాలా సపోర్టు లభించిందని రణబీర్ కపూర్ తెలిపారు. కొన్ని సన్నివేశాల విషయంలో నటుడిగా తనకు చాలా భయం కలిగిందని చెప్పారు. ఆ భయాన్ని దూరం చేయడంలో ఆలియా సాయపడిందన్నారు. “ఆలియా, నేను మా సినిమాల గురించి నిత్యం మాట్లాడుకుంటాం. నటిగా ఆమెను ఎంతో గౌరవిస్తాను. ఆమె ఆలోచించే విధానం కూడా చాలా మెచూర్డ్ గా ఉంటుంది. సినిమా షూటింగ్ కు వెళ్లే సమయంలో ఆమె చర్చిస్తాను. ఆయా సన్నివేశాల్లో ఎలా నటించాలో తను కీలక సూచలను అందిస్తుంది. ఒక నటుడిగా నేను భయపడిన సన్నివేశాల్లోనూ ఆమె అందించిన సపోర్టును మర్చిపోలేను. ‘యానిమల్’ లాంటి ఇంటెన్స్ సినిమా నేను గతంలో ఎప్పుడూ చేయలేదు. నేను ఎప్పుడూ స్క్రీన్ మీద మంచి తనాన్ని ప్రదర్శించేందుకు ప్రయత్నించాను. కానీ, ఇప్పుడు పూర్తి విరుద్ధమైన క్యారెక్టర్ చేశాను. ఈ క్యారెక్టర్ చేసేందుకు ఆలియా అన్ని విధాలుగా నన్ను ప్రోత్సహించింది. ఈ సినిమా విషయంలో ఆమె బలమైన మద్దతునిచ్చింది” అని వెల్లడించారు.
‘యానిమల్’ మూవీ గురించి..
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. బాలీవుడ్ స్టార్ యాక్టర్ బాబీ డియోల్ విలన్ పాత్రలో కనిపించారు. అనిల్ కపూర్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్ లో దర్శకుడు సందీప్ వంగా వయిలెన్స్ అంటే ఎలా ఉంటుందో చూపించారు. 3 నిమిషాల 32 సెకన్ల నిడివితో ఉన్న ట్రైలర్, రణబీర్ లోని హింసాత్మక కోణాన్ని చూపిస్తుంది. తన తండ్రిపై రణబీర్ ఎంతో ప్రేమను కలిగి ఉంటారు. ఆయన మీద ఉన్న ప్రేమతో తనకు అడ్డుగా వచ్చిన ప్రతి ఒక్కరినీ అంతం చేస్తారు. బాబీ డియోల్ పవర్ ఫుల్ విలన్‌గా కనిపించబోతున్నారు. రష్మిక మందన్న, రణబీర్ మధ్య సన్నివేశాలు కూడా ఎమోషన్స్ తో నిండి ఉన్నాయి. ఈ సినిమా డిసెంబర్ 1న విడుదల కానుంది. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రానుంది.
Read Also: ఇకపై ఆమెతో వాదించనని చెప్పా, కత్రినా 'టవల్ ఫైట్'పై భర్త విక్కీ కౌశల్ ఫన్నీ కామెంట్స్
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply
Before You Go
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
ట్రెండింగ్ వార్తలు






















