News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Swayambhu Movie: స్వయంభూ’ షూటింగ్ మొదలు, ఆకట్టుకుంటున్న నిఖిల్ వారియర్ లుక్

యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ‘స్వయంభూ’. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయినట్లు నిఖిల్ తెలిపారు. ‘The Epic Journey Begins’ అంటూ అదిరిపోయే పోస్టర్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

FOLLOW US: 
Share:

సినిమా ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చున్నాడు  హీరో నిఖిల్ సిద్దార్థ్. మినిమమ్ గ్యారెంటీ సినిమాలతో రాణించాడు. కెరీర్ మొదట్లో మంచి హిట్లు తెచ్చుకున్నా, తర్వాత కథల ఎంపిక విషయంలో కాస్త తడబడ్డారు. ప్రస్తుతం పాన్ ఇండియా రేంజి హిట్లతో దూసుకుపోతున్నారు.  ఆయన రీసెంట్ మూవీ ‘స్పై’ ప్రేక్షకులను అనుకున్న స్థాయిలో అలరించకపోయినా, మరో పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘స్వయంభూ’ పేరుతో ఈ మూవీ తెరకెక్కుతోంది. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తున్నది.  ఈ రోజు సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యింది.  ఈ విషయాన్ని నిఖిల్ అధికారికంగా ప్రకటించారు. ‘The Epic Journey Begins’ అంటూ  మూవీకి సంబంధించిన పోస్టర్ ను షేర్ చేశారు. 

ఆట్టుకుంటున్న‘స్వయంభూ’ లేటెస్ట్ పోస్టర్

ఈ పోస్టర్‌లో గుర్రంపై ఉన్న నిఖిల్‌ లుక్‌ ఆకట్టుకుంటోంది. డ్రాగన్‌పై బాణం గురిపెట్టి ఉన్న నిఖిల్‌ను యోధునిగా చూపించారు మేకర్స్. గతంలో ఎన్నడూ కనిపించని రీతిలో కనిపించారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన తొలి పోస్టర్ ఆకట్టుకోగా, ఈ పోస్టర్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచుతోంది. ‘స్వయంభూ’ సోసియో ఫాంటసీ చిత్రంగా రూపొందుతోంది. నిఖిల్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కుతోంది. ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ పతాకంపై భువన్, శ్రీకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా మనోజ్ పరమహంస పని చేస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఎం ప్రభాహరన్ సెట్టింగ్స్ డిజైన్ చేయగా, వాసుదేవ్ మునెప్ప  డైలాగ్స్ అందిస్తున్నారు. ఇక ఈ మూవీతో పాటు సుధీర్‌ వర్మతో నిఖిల్‌ ఓ సినిమా చేస్తున్నారు. రామ్‌ చరణ్‌ సమర్పణలో ‘ది ఇండియా హౌస్‌’ పేరుతో ఇది తెరకెక్కనుంది. అటు ‘కార్తికేయ3’ కూడా లైనప్ లో ఉంది.

View this post on Instagram
 
A post shared by Nikhil Siddhartha (@actor_nikhil)

వరుస విజయాలతో దూసుకుపోతున్న నిఖిల్

గత కొద్ది కాలంగా నిఖిల్ నటించిన సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ‘కార్తికేయ-2’ పాన్ ఇండియా రేంజి సక్సెస్ ను అందుకుంది. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందింది.  నార్త్ లో బాలీవుడ్ బడా హీరోలను కాదని టాలీవుడ్ హీరో జైకొట్టారు అక్కడి  ప్రేక్షకులు. విడుదలైన  అన్ని చోట్ల మంచి వసూళ్లను రాబట్టింది.  అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్ నటించిన లాల్ సింగ్ చడ్డా, రక్షాబంధన్ సినిమాలను వెనక్కి నెట్టి మరీ దూసుకెళ్లింది. ఈ సినిమాపై ప్రసిద్ధ ఆధ్యాత్మిక సంస్థ ఇస్కాన్ ప్రశంసలు కురిపించింది. శ్రీకృష్ణుడి తత్త్వం గురించి ఈ సినిమాలో చూపించడం పట్ల సంతోషం వ్యక్తం చేసింది. ఇస్కాన్ కేంద్రం  బృందావనానికి ‘కార్తికేయ-2’ బృందాన్ని ఆహ్వానించింది. ఈ సినిమా తర్వాత చేసిన ‘18 పేజెస్’ కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను పల్నాటి సూర్య ప్రతాప్ తెరకెక్కించారు. జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ల పై బన్నీ వాస్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించింది.    

Read Also: ఆస్పత్రిలో ‘ఠాగూర్‌’ సినిమా సీన్ చూపించారు - శ్రీహరి మరణం వెనక అసలు కారణం చెప్పిన డిస్కో శాంతి

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 18 Aug 2023 03:35 PM (IST) Tags: Samyuktha Menon Nikhil Siddhartha Swayambhu Movie Bharat Krishnamachari Swayambhu Shooting

ఇవి కూడా చూడండి

Allari Naresh : 'బచ్చలమల్లి'గా అల్లరి నరేష్ - ఆసక్తి రేకెత్తిస్తోన్న పోస్టర్,  గజదొంగగా కనిపించనున్నఅల్లరోడు!

Allari Naresh : 'బచ్చలమల్లి'గా అల్లరి నరేష్ - ఆసక్తి రేకెత్తిస్తోన్న పోస్టర్, గజదొంగగా కనిపించనున్నఅల్లరోడు!

Prabhas: తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేయని ప్రభాస్ - కారణం అదేనా?

Prabhas: తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేయని ప్రభాస్ - కారణం అదేనా?

Animal Movie Review - యానిమల్ రివ్యూ: ఇంటర్వెల్‌కే క్లైమాక్స్ 'హై' ఇచ్చిన రణబీర్, సందీప్ రెడ్డి వంగా - మరి, ఆ తర్వాత?

Animal Movie Review - యానిమల్ రివ్యూ: ఇంటర్వెల్‌కే క్లైమాక్స్ 'హై' ఇచ్చిన రణబీర్, సందీప్ రెడ్డి వంగా - మరి, ఆ తర్వాత?

Animal Review - ‘యానిమల్’ ఆడియన్స్ రివ్యూ: ఓపెనింగ్ సీన్ నుంచి అటెన్షన్ షురూ - బ్లాక్ బస్టర్ టాక్

Animal Review - ‘యానిమల్’ ఆడియన్స్ రివ్యూ: ఓపెనింగ్ సీన్ నుంచి అటెన్షన్ షురూ - బ్లాక్ బస్టర్ టాక్

Vijay Rashmika: ఒకే తరహా డ్రెస్‌లో రష్మిక, విజయ్ దేవరకొండ - దొరికిపోయారుగా!

Vijay Rashmika: ఒకే తరహా డ్రెస్‌లో రష్మిక, విజయ్ దేవరకొండ - దొరికిపోయారుగా!

టాప్ స్టోరీస్

Counting Centers in Telangana: ఈవీఎంల్లో అభ్యర్థుల భవితవ్యం - ఓట్ల లెక్కింపునకు జిల్లాల వారీగా కౌంటింగ్ సెంటర్లు, స్ట్రాంగ్ రూంల వద్ద భారీ భద్రత

Counting Centers in Telangana: ఈవీఎంల్లో అభ్యర్థుల భవితవ్యం - ఓట్ల లెక్కింపునకు జిల్లాల వారీగా కౌంటింగ్ సెంటర్లు, స్ట్రాంగ్ రూంల వద్ద భారీ భద్రత

YSRCP Leader Arrest in US : బానిసత్వం, హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులు - అమెరికాలో వైసీపీ నేత సత్తారు వెంకటేష్ రెడ్డి అరెస్ట్ !

YSRCP Leader Arrest in US : బానిసత్వం, హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులు - అమెరికాలో వైసీపీ  నేత సత్తారు వెంకటేష్ రెడ్డి అరెస్ట్ !

భారత్, ఆస్ట్రేలియా T20 మ్యాచ్ జరిగే స్టేడియంలో పవర్ కట్, రూ.3 కోట్ల బిల్ పెండింగ్

భారత్, ఆస్ట్రేలియా T20 మ్యాచ్ జరిగే స్టేడియంలో పవర్ కట్, రూ.3 కోట్ల బిల్ పెండింగ్

Rs 2000 Notes: రూ.2,000 నోట్లు ఇప్పటికీ చెల్లుతాయి, కీలక అప్‌డేట్‌ ఇచ్చిన ఆర్‌బీఐ

Rs 2000 Notes: రూ.2,000 నోట్లు ఇప్పటికీ చెల్లుతాయి, కీలక అప్‌డేట్‌ ఇచ్చిన ఆర్‌బీఐ