By: ABP Desam | Updated at : 18 May 2023 10:07 AM (IST)
Photo Credit: Instagram
మెగా డాటర్ నిహారిక తాజాగా సోషల్ మీడియా రూమర్ క్రియేటర్స్ పై రెచ్చిపోయింది. అలాంటి వెధవలు ప్రతిచోట ఉంటారని, వారికి మనం అటెన్షన్ ఇవ్వకూడదంటూ వారిపై ఫైర్ అయింది. దీంతో తాజాగా నిహారిక చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా అంతటా హాట్ టాపిక్ గా మారుతున్నాయి.ఇటీవల పెళ్లి తర్వాత నిహారిక సినిమాలకు దూరమైన సంగతి అందరికీ తెలిసిందే. హీరోయిన్ గా సినిమాలు చేయకపోయినా పెళ్లి తర్వాత సొంతంగా ఓ ప్రొడక్షన్ హౌస్ ని స్టార్ట్ చేసింది. ఆ ప్రొడక్షన్ హౌస్ లో చిన్న సినిమాలు, వెబ్ సిరీస్ లను నిర్మించింది. ఇప్పటికే నిహారిక ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చిన కొన్ని వెబ్ సిరీస్లు మంచి రెస్పాన్స్ ని అందుకున్నాయి. అయితే నిహారిక స్క్రీన్ పై కనిపించి చాలా కాలమైంది. తాజాగా ఆమె 'డెడ్ పిక్సెల్' అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రముఖ ఓటిటి సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ వెబ్ సిరీస్ మే 19 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది.
ఇక చాలా గ్యాప్ తర్వాత నిహారిక నటించిన వెబ్ సిరీస్ కావడంతో ఈ వెబ్ సిరీస్ కోసం ఆడియన్స్ ఆసక్తి ఎదురు చూస్తున్నారు. అయితే ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నిహారిక తనను ట్రోల్ చేసే వాళ్ల గురించి కాస్త ఘాటుగానే స్పందించింది. తాజా ఇంటర్వ్యూలో నిహారిక మాట్లాడుతూ.. పనీపాటా లేని వాళ్లే ట్రోల్స్ చేస్తారని, అలాంటి వాళ్ల గురించి తాను అస్సలు పట్టించుకోనని చెప్పింది.
"నిజానికి మనం అవసరం లేని వాళ్ళకి అటెన్షన్ ఇస్తూ ఉంటాం. అలాంటి వెధవలు ప్రతి చోటా ఉంటారు. వాళ్ళను కనుక మనం పట్టించుకుంటే వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు. అందుకే అలాంటి వాళ్ళని నేను అస్సలు పట్టించుకోను. నన్ను నన్నుగా ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్లకు నేను అటెన్షన్ ఇస్తా. అంతేగాని ఎవడో కోన్ కిస్కా గొట్టం గాడి గురించి నేనెందుకు పట్టించుకుంటా. ఒకప్పుడు సోషల్ మీడియాలో నాపై వచ్చే నెగిటివ్ కామెంట్స్ ని నేను చూసే దాన్ని. కానీ ఇప్పుడు మాత్రం వాటిని అసలు పట్టించుకోవడమే మానేశాను. దానివల్ల అనవసరంగా మన హెల్త్ పాడైపోతుంది. ఇప్పుడు కూడా నా ఫోన్ ఓపెన్ చేస్తే ఇంస్టాగ్రామ్ లో ఎన్నో నెగటివ్ కామెంట్స్ ఉంటాయి. కానీ నేను వాటిని అసలు పట్టించుకోను. చూడను. ఎందుకంటే గతంలో అలాంటి కామెంట్స్ నేను చూశాను కాబట్టి. ఇప్పుడు వాటిని లెక్క చేయను" అంటూ తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది నిహారిక.
దీంతో నిహారిక చేసిన ఈ కామెంట్స్ అయితే ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. కాగా గత కొద్ది రోజులుగా నిహారిక కి తన భర్త చైతన్యతో తరచూ గొడవలు అవుతున్నాయని, అందుకే నిహారిక విడాకులు తీసుకోబోతుందనే వార్తలు సోషల్ మీడియాలో ఎంతలా వైరల్ అయ్యాయో తెలిసిందే. అందుకే నిహారిక ఈ ఇంటర్వ్యూలో సోషల్ మీడియా రూమర్ క్రియేటర్స్ పై అంత వైలెంట్ గా రియాక్ట్ అయి ఉంటుందని ఈ వీడియోని చూసిన నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read : ‘నా ఫ్రెండ్ దేమో పెళ్లి నాకేందిర ఈ లొల్లి’ సాంగ్ - భీమ్స్ మ్యూజిక్ బిందాస్!
Navya Swamy: అందుకే సీరియల్స్ మానేశా, రవి నా కంటే ముందే ప్రయత్నించాడు: నటి నవ్య స్వామి
Rangabali Teaser: ‘మన ఊర్లో మనల్ని ఎవడ్రా ఆపేది’ - నాగశౌర్య ‘రంగబలి’ టీజర్ అదిరిపోయిందిగా
మెగా ఫ్యామిలీలో పెళ్లి భాజాలు, బాలయ్య మూవీ టైటిల్ వచ్చేసింది - ఇంకా మరెన్నో సినీ విశేషాలు మీ కోసం
Dhoomam Telugu Trailer : ధూమం - నా పేరు ముఖేష్ యాడ్ అందరూ చూసేలా చేస్తే?
Tamanna: చేతిలో మందు గ్లాస్, బీచ్లో డ్యాన్స్ - బాల్యాన్ని గుర్తు తెచ్చుకున్న తమన్నా, వీడియో వైరల్
Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్! మహిళా కమిషన్ కీలక ఆదేశం
Kottu Satyanarayana: మనం చేసిన యాగం వల్లే కేంద్రం మనకి నిధులిచ్చింది - మంత్రి కొట్టు వ్యాఖ్యలు
YS Viveka Case : వివేకా కేసులో సీబీఐ అప్ డేట్ - అవినాష్ రెడ్డి A-8 నిందితుడని కోర్టులో కౌంటర్ !
KTR: యువత స్కిల్ సంపాదించాలి, ఉద్యోగం దానికదే వస్తుంది - కేటీఆర్