అవును, ఈ సినిమా కాస్త వెనక్కి వెళ్ళినట్లు తెలుస్తోంది. బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన పోస్టులలో #NBK112 హ్యాష్ ట్యాగ్ లేకపోవడం దీనికి సంకేతం.
Balakrishna Koratala Siva Movie: కొరటాల శివతో బాలకృష్ణ సినిమా వెనక్కి... బర్త్ డేకి క్లారిటీ వచ్చినట్టే!
NBK112 Koratala Siva Project: కొరటాల శివ దర్శకత్వంలో బాలకృష్ణ సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. బాలయ్య బర్త్ డేకి యువసుధ ఆర్ట్స్ విషెష్ చెప్పింది. అయితే ఈ సినిమా వెనక్కి వెళ్ళిందని టాక్.

- నందమూరి బాలకృష్ణ, కొరటాల శివ NBK112 సినిమా ఆలస్యమయ్యే సూచనలు.
- బాలకృష్ణ పుట్టినరోజున #NBK112 హ్యాష్‌ట్యాగ్, నిర్మాతల కలయిక లోపించాయి.
- గోపీచంద్ మలినేని దర్శకత్వంలో NBK111 ప్రస్తుతం చిత్రీకరణలో కొనసాగుతోంది.
- కొరటాల చిత్రం ముందు వివేక్ ఆత్రేయతో బాలయ్య సినిమా ఉండొచ్చు.
నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా ఉంటుంది. అందులో డౌట్ లేదు. అఫీషియల్‌గా NBK x KoratalaSiva అంటూ సినిమాను అనౌన్స్ చేశారు కూడా! అయితే... ఈ సినిమా కాస్త వెనక్కి వెళ్ళిందట. బాలకృష్ణ బర్త్ డే (Balakrishna Birthday) సందర్భంగా క్లారిటీ వచ్చింది. కొరటాల కంటే ముందు మరో యువ దర్శకుడితో బాలకృష్ణ సినిమా చేసే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే...
గోపీచంద్ మలినేని NBK111 తర్వాత...
బాలకృష్ణ సినిమాను డైరెక్ట్ చేసేది ఎవరు?
బాలకృష్ణ, కొరటాల సినిమాను అనౌన్స్ చేసినప్పుడు NBK112 అని పేర్కొన్నారు. హీరోగా ఆ సినిమా బాలకృష్ణ 112వది అని స్పష్టం చేశారు. బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ నిర్మాణ సంస్థ యువసుధ ఆర్ట్స్ చేసిన పోస్టులో #NBK112 హ్యాష్ ట్యాగ్ మిస్ అయ్యింది.
ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో NBK111 చేస్తున్నారు బాలయ్య. ఈ రోజు, బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఎన్‌బికే111 ఫస్ట్ లుక్, గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఆ వీడియో విడుదల చేయడానికి ముందు బాలయ్యను దర్శక నిర్మాతలు కలిశారు. పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. అయితే... బాలయ్యను కొరటాల శివ గానీ, యువసుధ ఆర్ట్స్ అధినేత సుధాకర్ మిక్కిలినేని గానీ కలిసిన ఫోటోలను విడుదల చేయలేదు. హ్యాష్ ట్యాగ్ మిస్ కావడంతో పాటు హీరోని దర్శక నిర్మాతలు కలవకపోవడం వంటివి చూస్తే... సినిమా వెనక్కి వెళ్ళినట్టు అర్థం అవుతోంది.
View this post on Instagram
కొరటాల శివతో సినిమా బదులు ఎవరి దర్శకత్వంలో బాలకృష్ణ సినిమా చేస్తారు? అంటే... వివేక్ ఆత్రేయతో. బాలయ్యను యువ దర్శకుడు కలిశారు. ఎప్పటి నుంచో వాళ్ళ కాంబినేషన్‌లో సినిమా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. బర్త్ డేకి ఆ మూవీ అనౌన్స్ చేయలేదు. కానీ, కలవడంతో సినిమాపై క్లారిటీ వచ్చింది. ఆ సినిమా తర్వాత కొరటాల శివ సినిమా ఉండొచ్చని టాక్.
బాలయ్యతో కొరటాల శివ 'కార్పెంటర్'?
బాలకృష్ణ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వం వహించనున్న సినిమాకు 'కార్పెంటర్' టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. కొరటాల గత సినిమాల తరహాలో దీనిని కూడా సామాజిక సందేశంతో కూడిన మాస్ యాక్షన్ సినిమాగా రూపొందించనున్నారని తెలిసింది. ఈ సినిమాలో కథానాయికగా బాలీవుడ్ భామ విద్యా బాలన్ పేరు పరిశీలనలో ఉంది. ఎన్టీఆర్ బయోపిక్‌లో బసవతారకం పాత్రలో బాలకృష్ణ సరసన ఆమె నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా లేట్ కావడం అనేది కొరటాల అభిమానులను కాస్త కలవరపెట్టే అంశమే. 'దేవర' తర్వాత నుంచి ఆయన ఖాళీగా ఉన్నారు. ఇప్పటి వరకు మరో సినిమా స్టార్ట్ చేయలేదు. 'దేవర 2' ఉంటుందా? అనేది కూడా సందేహమే అని ఫిల్మ్ నగర్ వర్గాల గుసగుస.
Also Read: Salman Khan Kumod Raney Relationship - స్నేహితురాలి మరణంతో సల్మాన్ కంటతడి... ఎవరీ కుముద్ రాణే?
Before You Go
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Frequently Asked Questions
బాలకృష్ణ - కొరటాల శివ కాంబినేషన్ లో సినిమా వాయిదా పడిందా?
బాలకృష్ణ తదుపరి చిత్రం ఏ దర్శకుడితో ఉండవచ్చు?
కొరటాల శివ సినిమా వెనక్కి వెళ్ళడంతో, యువ దర్శకుడు వివేక్ ఆత్రేయతో బాలకృష్ణ సినిమా చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆయన బాలయ్యను కలిసి చర్చించారు.
బాలకృష్ణ, కొరటాల శివ కాంబోలో వచ్చే సినిమాకు ఏ టైటిల్ పరిశీలిస్తున్నారు?
బాలకృష్ణ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వం వహించనున్న సినిమాకు 'కార్పెంటర్' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇది సామాజిక సందేశంతో కూడిన మాస్ యాక్షన్ సినిమాగా ఉంటుందని టాక్.
ట్రెండింగ్ వార్తలు





















