NBK111 Glimpse : NBK111 గ్లింప్స్ వచ్చేసింది - బాలయ్య బర్త్ డేకు మాస్ ట్రీట్
NBK111 Update : గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య బర్త్ డే స్పెషల్ వచ్చేసింది. NBK111 నుంచి పవర్ ఫుల్ మాస్ ట్రీట్ ఇచ్చారు డైరెక్టర్ గోపీచంద్ మలినేని. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

Balakrishna's NBK111 First Glimpse Out Now : గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య బర్త్ డే స్పెషల్ వచ్చేసింది. డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'వీర సింహారెడ్డి' తర్వాత అంతే పవర్ ఫుల్ మాస్ గర్జనతో NBK111 స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ వీడియోతో బాలయ్య ఫ్యాన్స్‌కు ఫుల్ మాస్ ట్రీట్ ఇచ్చారు మేకర్స్.
గ్లింప్స్ ఎలా ఉందంటే?
NBK111లో బాలయ్య మాస్ లుక్‌లో విశ్వరూపం చూపించారు. బాంబోలోని ఓ విలాసవంతమైన భవనంలో ఫోన్ మోగడంతో బాలయ్య ఎంట్రీ స్టార్ట్ అవుతుంది. బాలయ్య యంగ్ ఏజ్ స్టైల్ మాస్ లుక్ భారీ హైప్ క్రియేట్ చేస్తోంది. స్పెషల్ వీడియో చూస్తుంటే పవర్ ఫుల్ మాస్ డైలాగ్స్‌తో పాటు అంతే స్థాయిలో వయలెన్స్ కూడా కన్ఫర్మ్ అని తెలుస్తోంది. మొత్తానికి బాలయ్య ఫ్యాన్స్‌కు వీర సింహారెడ్డి తర్వాత అంతే స్థాయి ఎలివేషన్ వచ్చేలా మరో స్క్రిప్ట్ రెడీ చేసినట్లు అర్థమవుతోంది.
ఈ మూవీలో బాలయ్య సరసన చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా చేస్తున్నారు. అంతకు ముందు వీరిద్దరూ కలిసి భగవంత్ కేసరిలో నటించారు. బాలయ్యతో ఆమెకు ఇది రెండో మూవీ. గతంలో నయనతారను హీరోయిన్‌గా ప్రకటించినా... స్టోరీలో చేంజెస్ జరగడంతో ఆమె ప్లేస్‌లో కాజల్ వచ్చినట్లు తెలుస్తోంది. రాకింగ్ మంచు మనోజ్ నెగిటివ్ రోల్‌లో నటిస్తున్నారు. గతంలో ఆయన మిరాయ్‌లో మహావీర్ లామాగా విలన్‌గా అదరగొట్టారు. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ అందిస్తుండగా... వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ప్రొడ్యూస్ చేస్తున్నారు.
This is ENTRY OF AN ERA...
— Gopichandh Malineni (@megopichand) June 10, 2026
Come let's celebrate our #NBK in his most stylish and menacing mode yet. https://t.co/dvEuSYOtVT#NBK111 @NBK111Movie pic.twitter.com/93EywBqlZ6
Also Read : Ram Charan : థాంక్యూ వెరీ మచ్ బన్నీ... వెయిటింగ్ ఫర్ రాకా - రామ్ చరణ్ ట్వీట్... రూమర్స్‌కు చెక్
ట్రెండింగ్ వార్తలు























