NBK108 Dussehra Release : దసరా బరిలో బాలకృష్ణ సినిమా - రామ్, విజయ్, రవితేజ సినిమాలతో పోటీ
నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న సినిమా విడుదల గురించి చిత్ర బృందం ఓ కీలక ప్రకటన చేసింది.
గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కథానాయకుడిగా వరుస విజయాలతో దూసుకు వెళుతున్న యువ దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) ఓ డిఫరెంట్ సినిమా రూపొందిస్తున్నారు. భాగ్య నగరంలో శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. ఈ రోజు విడుదల తేదీ గురించి చిత్ర బృందం కీలక ప్రకటన చేసింది.
విజయదశమికి విడుదల
దసరా బరిలో బాలకృష్ణ సినిమా విడుదల కానుందని కొన్ని రోజుల క్రితం నుంచి వినబడుతోంది. ఈ రోజు ఆ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. ''విజయ దశమికి ఆయుధ పూజ'' అని చెప్పేశారు. ఇటీవల విడుదలైన బాలకృష్ణ ఫస్ట్ లుక్ అభిమానులను ఆకట్టుకుంది.
దసరా బరిలో నాలుగు సినిమాలు
ఆల్రెడీ దసరా బరిలో మూడు సినిమాలు ఉన్నాయి. మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందుతోన్న పాన్ ఇండియా సినిమా 'టైగర్ నాగేశ్వరరావు'ను అక్టోబర్ 20న విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. అదే రోజున ఉస్తాద్ రామ్ పోతినేని, బాలయ్యతో 'సింహ', 'లెజెండ్', 'అఖండ' వంటి విజయవంతమైన సినిమాలు ఇచ్చిన దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా సినిమా కూడా విడుదల కానుంది. తమిళ స్టార్ విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ తీస్తున్న 'లియో' అక్టోబర్ 19న విడుదలకు రెడీ అయ్యింది. బాలకృష్ణ రాకతో మొత్తం మీద దసరా బరిలో నాలుగు సినిమాలు ఉన్నట్టు అయ్యింది.
బాలకృష్ణ, యువ దర్శకుడు అనిల్ రావిపూడి కలయికలో తొలి చిత్రమిది. దీనిని షైన్ స్క్రీన్స్ పతాకంపై హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్నారు. బాలకృష్ణకు కుమార్తెగా శ్రీలీల నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, ఆ వార్తల్లో నిజం లేదు. సినిమాలో ఆమె హీరోయిన్ అంత కంటే కాదు. కథలో చాలా కీలకమైన శ్రీలీల పాత్రలో కనిపించనున్నారు.
Also Read : బాలీవుడ్ సినిమాలో బతుకమ్మ పాట - బుట్ట బొమ్మ పూజా హెగ్డే ఆట
View this post on Instagram
బాలకృష్ణతో కాజల్ తొలి చిత్రమిది
బాలకృష్ణ, కాజల్ కలయికలో తొలి చిత్రమిది. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన 'లక్ష్మీ కళ్యాణం'తో కాజల్ కథానాయికగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన 'బృందావనం', 'టెంపర్' సినిమాల్లో నటించారు. ఇప్పుడు బాలయ్యతో సినిమా చేస్తున్నారు. దీని కంటే ముందు బాలకృష్ణ, కాజల్ అగర్వాల్ కాంబినేషన్ రెండు మూడు సినిమాలకు పరిశీలనలోకి వచ్చింది. అయితే, ఇప్పటికి కుదిరింది.
తెలుగు అమ్మాయి, కథానాయిక అంజలి మరో కీలక పాత్ర చేస్తున్నారు. ఆమెది విలన్ రోల్ అని టాక్. ఈ చిత్రానికి తమన్ (Thaman) సంగీతం అందిస్తున్నారు. ఇంతకు ముందు 'డిక్టేటర్' చిత్రానికి ఆయన సంగీతం అందించినా... 'అఖండ'తో భారీ విజయం సాధించారు. బాలకృష్ణ, తమన్ కలయికలో 'అఖండ', వీర సింహా రెడ్డి', ఇప్పుడీ సినిమా... హ్యాట్రిక్ అన్నమాట. దీని తర్వాత 'అఖండ 2' కూడా చేయనున్నారు. ఇటీవల ట్విట్టర్ వేదికగా ఎస్.ఎస్. తమన్ 'అఖండ' సీక్వెల్ అనౌన్స్ చేశారు. అనిల్ రావిపూడి సినిమా తర్వాత అఖండ సీక్వెల్ ఉంటుందా? లేదంటే మరో సినిమా చేసిన తర్వాత ఉంటుందా? అనేది ఇప్పుడే చెప్పలేం.
Also Read : విడాకులకు నాగ చైతన్యే కారణమా? సమంత మాటలకు అర్థం ఏమిటి?