Nayanthara: నయన తారకు ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన భర్త విఘ్నేష్ - మీరంటే డబ్బున్నోళ్లు బ్రో!
Nayanthara: ఇటీవల నయనతార తన 39వ పుట్టినరోజును జరుపుకోగా ఆ సందర్భంగా తన భర్త విఘ్నేష్ శివన్ తనకొక కాస్ట్‌లీ కారును బహుమతిగా ఇచ్చాడు.
Nayanthara Birthday Gift: లేడీ సూపర్ స్టార్ నయనతార పుట్టినరోజు సందర్భంగా ఆమె భర్త విఘ్నేష్ శివన్ ఖరీదైన గిఫ్టుతో సర్‌ప్రైజ్ చేశాడు. నయన్ ఇటీవలే 39వ ఏటలోకి అడుగుపెట్టింది. భర్త, పిల్లలతో తన బర్త్‌డే సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంది. దానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేసింది. అయితే, గిఫ్ట్ విషయాన్ని మాత్రం ఆ రోజు చెప్పలేదు. తాజాగా ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా బయటపెట్టింది నయన్.
మెర్సిడీజ్ ఎస్ క్లాస్ కారు గిఫ్ట్..
విఘ్నేష్ శివన్.. తనకు ఇచ్చిన గిఫ్ట్ గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది నయనతార. అదేంటో పూర్తిగా చూపించకపోయినా.. నెటిజన్లు మాత్రం ఆ గిఫ్ట్ ఏంటో కనిపెట్టేశారు. విఘ్నేష్ శివన్.. నయన్ కోసం సౌకర్యవంతమైన మెర్సిడీజ్ మేబ్యాచ్ ఎస్ క్లాస్ కారును గిఫ్ట్‌గా ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఈ కారు విలువ దాదాపు రూ.2.7 కోట్లు ఉంటుందట. ఆ కారుపై ఉన్న మెర్సిడీజ్ సింబల్ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన నయనతార.. దానికి క్యూట్ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ‘ఇంటికి స్వాగతం బ్యూటీ. ఈ బర్త్ డే గిఫ్ట్‌కు థ్యాంక్స్ మై డియర్ హజ్బెండ్. లవ్ యూ’ అని పోస్ట్‌ను షేర్ చేసింది నయనతార. ఈ పోస్ట్ చూసిన నెటిజనులు.. మీరంటే డబ్బున్నోళ్లు బ్రో అంటూ విఘ్నేష్‌పై సరదా కామెంట్స్ చేస్తున్నారు. అలాంటి భర్త దొరకడం మీ అదృష్టం అని అంటున్నారు.
View this post on Instagram
ఎవరి కెరీర్‌తో వారు బిజీ..
ఇక నయనతార సినిమాల విషయానికొస్తే.. తను ప్రస్తుతం తన కెరీర్‌లోని 75వ చిత్రంపై ఫుల్ ఫోకస్ పెట్టింది. ‘అన్నపూర్ణి’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం.. ఈ శుక్రవారమే థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా సక్సెస్‌పై నయన్ ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉంది. ఇక విఘ్నేష్ శివన్ విషయానికొస్తే.. ‘కాతువాకులా రెండు కాదల్’ చిత్రంతో గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ ఏడాది మొత్తం తన నుండి మరే సినిమా రాలేదు. ప్రదీప్ రంగనాథన్‌ను హీరోగా పెట్టి విఘ్నేష్.. ఒక యూత్‌ఫుల్ సినిమాను తెరకెక్కిస్తున్నాడంటూ వార్తలు వైరల్ అయ్యాయి. కానీ ఆ మూవీపై కూడా ఎలాంటి క్లారిటీ లేదు. డైరెక్టర్‌గా కాకపోయినా.. లిరిసిస్ట్‌గా ఈ ఏడాది రజినీకాంత్ సినిమా ‘జైలర్’లో ‘రథమారే’ అనే పాటను రాశాడు విఘ్నేష్.
సోషల్ మీడియాలో యాక్టివ్..
నయనతార, విఘ్నేష్ శివన్.. పెళ్లయిన తర్వాత సినిమాల్లో ఎంత యాక్టివ్‌గా ఉంటున్నారో పర్సనల్ లైఫ్‌లో కూడా అంతే యాక్టివ్‌గా ఉంటున్నారు. పైగా పెళ్లి జరిగి సంవత్సరం అవ్వకముందే సరోగసీ ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చింది నయన్. వారే ఉయిర్, ఉలగ్. ఇక తన పిల్లలకు సంబంధించిన దాదాపు ప్రతీ విషయాన్ని, వారితో షేర్ చేసుకునే ప్రతీ మూమెంట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన ఫ్యాన్స్‌తో పంచుకుంటుంది నయనతార. కొన్నాళ్ల క్రితం వరకు నయనతారకు ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్ లేదు. కానీ తన బాలీవుడ్ డెబ్యూ ‘జవాన్’ ప్రమోషన్స్ కోసం ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను క్రియేట్ చేసుకున్న నయన్.. అందులో ప్రొఫెషనల్ లైఫ్ గురించి కంటే పర్సనల్ లైఫ్ గురించే ఎక్కువగా పోస్ట్ చేస్తుంటుంది.
Also Read: మహిళను హింసించడం భావోద్వేగమా? ‘యానిమల్‘ దర్శకుడి కామెంట్స్‌పై నెటిజన్ల ఆగ్రహం
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply