అన్వేషించండి

నో డేటింగ్, నవ్య స్వామితో రిలేషన్షిప్ గురించి రవికృష్ణ ఓపెన్ కామెంట్స్ 

బుల్లితెరపై ఫేమస్ అయిన రవికృష్ణ - నవ్యస్వామి జోడీ మరోసారి వార్తల్లో నిలిచింది. వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారన్న వార్తలపై తాజాగా రవికృష్ణ స్పందించారు. నవ్యస్వామి తన ఫ్రెండ్ మాత్రమేనని క్లారిటీ ఇచ్చారు.

బుల్లితెరపై సూపర్ జోడీగా పేరు తెచ్చుకున్నరవికృష్ణ (Ravi Krishna) - నవ్య స్వామి (Navya Swamy) ప్రేమలో ఉన్నారని, డేటింగ్ లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ ఇప్పటికే చాలా కథనాలు వచ్చాయి. ఇక వీరిద్దరూ మరోసారి వార్తల్లోకెక్కారు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదరడంతో... కొన్ని రోజుల నుంచీ వీరిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారనే వార్త తెగ వైరల్ అవుతోంది. అంతే కాదు ప్రస్తుతం వారు డేటింగ్ ఉన్నారని కూడా జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ రకమైన వార్తలపై రవికృష్ణ తాజాగా స్పందించారు.

నవ్య స్వామి తనకు మంచి స్నేహితురాలని ఆయన కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేశారు. సినిమాల్లోకి రాకముందు నవ్య స్వామితో కలిసి ఓ టీవీ సీరియల్‌లో కనిపించాను. నవ్య స్వామికి, నాకు మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా చర్చనీయాంశమైంది. ఫలితంగా, గాసిప్‌లు మొదలయ్యాయి. ఆఫ్‌ స్క్రీన్ రిలేషన్‌షిప్‌పై ఊహాగానాలు చేయడం సహజమే. కానీ నిజానికి ఆమె నాకు మంచి స్నేహితురాలు. మేం డేటింగ్ లో లేము” అని రవికృష్ణ స్పష్టం చేశారు.

రవికృష్ణ తాజాగా చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇన్ని రోజులూ వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని సంతోషించిన వారికి ఈ వ్యాఖ్యలు తీవ్ర నిరాశను మిగిల్చినట్టు తెలుస్తోంది. ఇక ఇప్పట్నుంచైనా ప్రేక్షకులు, అభిమానులు.. వారిద్దరినీ స్నేహితుల్లా చూస్తారా.. లేదంటే రవికృష్ణ చెప్పిన మాటల్ని పక్కన పెడతారా అన్నది చూడాలి మరి.

రవికృష్ణ, నవ్యస్వామిలు స్మాల్ స్క్రీన్ మీద పలు సీరియళ్లు, షోలతో అలరించి, ప్రేక్షకులను మెప్పించిన సంగతి తెలిసిందే. మొన్నటిదాకా టీవీలో కనిపించిన వీరిద్దరూ... ఇటీవల వచ్చిన కొన్ని సినిమాల్లోనూ నటించారు. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా వచ్చిన 'విరూపాక్ష'లో ఓ పాత్రలో రవికృష్ణ కనువిందు చేశారు. ఇక నవ్య స్వామి కూడా “బుట్ట బొమ్మ”లో నటించారు. ఆ తర్వాత మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రలో నటించిన 'రావణాసుర'లోనూ నటించారు. ఇలా వీరిద్దరూ బుల్లితెర అభిమానుల్నే కాకుండా... బిగ్ స్క్రీన్ మీద తమ టాలెంట్ ను చూపిస్తూ... పాపులారిటీని సొంతం చేసుకుంటున్నారు.

Also Read మాస్ ఉస్తాద్ వచ్చేశాడు - పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు పండగే, రచ్చ రచ్చే!

'మొగలిరేకులు', 'వరూధినీ పరిణయం',' శ్రీనివాస కల్యాణం', 'మనసు మమత', 'బావా మరదళ్లు', 'ఆమె కథ'.. ఇలా సీరియల్స్‌, టీవీషోలతో  రవికృష్ణ బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆ తర్వాత ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్‌లోనూ సందడి చేశారు. ఓ సీరియల్‌లో జంటగా నటించిన రవి- నవ్య అప్పట్నుంచి ఎక్కడ చూసినా జంటగానే కనిపించారు. దాంతో పాటు పలు టీవీ షోల్లోనూ జోడీగానే పార్టిసిపేట్‌ చేశారు. ఇంకేముంది... వీరి మధ్య సంథింగ్‌ సంథింగ్‌ ఉందంటూ వార్తలు అల్లేశారు. అది రాను రాను మితిమీరి.. డేటింగ్ లో ఉన్నారనే స్థాయికి వచ్చింది. ఈ వార్తలపై ఇప్పటి వరకూ వారిద్దరిలో ఎవరూ గానీ స్పందించలేదు. కానీ తాజాగా రవికృష్ణ ఇచ్చిన క్లారిటీతో ఈ రూమర్స్ కు చెక్ పడినట్టయింది.

Also Read : శకుంతలే కాదు, సమంత 'శాకుంతలం' కూడా అనాథే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Chandrababu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Chandrababu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
Yogi Adityanath: ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్-  అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్- అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
Daaku Maharaaj: డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
Embed widget