అన్వేషించండి

Naveen Polishetty: నవీన్ పోలిశెట్టి ‘సింగిల్ హ్యాండ్’ కష్టాలు - ఈ వీడియో చూస్తే నవ్వకుండా ఉండలేరు

Naveen Polishetty: నవీన్ పోలిశెట్టికి ఒక యాక్సిడెంట్ వల్ల గాయాలు అయ్యాయని కొన్నాళ్ల క్రితం ప్రకటించాడు. అయితే ఆ గాయాల వల్ల ఎలా ఇబ్బందులు పడుతున్నాడో చూపిస్తూ తాజాగా ఒక రీల్ షేర్ చేశాడు.

Naveen Polishetty: ఇతర హీరోలలాగా బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు చేయకపోయినా యూత్ దృష్టిలో స్పెషల్‌గా నిలిచిపోయాడు నవీన్ పోలిశెట్టి. తనకు ఒక సినిమాతో పాపులారిటీ రాగానే తొందరపడి స్క్రిప్ట్స్‌ను సెలక్ట్ చేసుకోకుండా ఏడాదికి లేదా రెండేళ్లకు మంచి కంటెంట్ ఉన్న మూవీస్‌తో ప్రేక్షకుల ముందుకు రావడం మొదలుపెట్టాడు నవీన్. అందుకే యూత్‌లో ఈ యంగ్ హీరోకు చాలానే క్రేజ్ ఉంది. తాజాగా ఒక యాక్సిడెంట్ వల్ల తన చేతికి, కాలికి గాయాలయ్యాయని ప్రకటించాడు నవీన్ పోలిశెట్టి. ఇప్పుడు చేతికి జరిగిన గాయం వల్ల కట్టుతో తాను ఎన్ని కష్టాలు పడుతున్నాడో చూపించి అందరినీ నవ్వించాడు.

నవీన్ ఫ్రస్ట్రేషన్..

చేతికట్టుతో తాను ఎంత కష్టపడుతున్నాడో చెప్తూ.. నవీన్ పోలిశెట్టి ఒక వీడియోను విడుదల చేశాడు. ఇందులో కూడా తన కష్టాలు చూపిస్తూ ప్రేక్షకులను నవ్వించాడు. ఆ వీడియో మొదలవ్వగానే నవీన్.. టీవీ చూస్తూ ఉంటాడు. ఏ ఛానెల్ మార్చినా కూడా హీరోలు చేతి గురించి చెప్పే డైలాగులే కనిపిస్తుంటాయి. దాంతో తన చేతికి తగిలిన గాయాన్ని చూసి బాధపడుతుంటాడు. ‘‘చేతి మీద డైలాగ్ లేని ఛానెల్ ఏమైనా పెట్టు’’ అని తన ఫ్రెండ్‌తో అంటాడు. అందుకే సినిమాలు వద్దని క్రికెట్ ఛానెల్ పెట్టినా కూడా అందులో ఎంపైర్ తన రెండు చేతులూ పైకెత్తి చూపిస్తాడు. అది చూసి నవీన్‌కు ఫ్రస్ట్రేషన్ వస్తుంది. అందుకే టీవీ ఆఫ్ చేసేయమంటాడు.

విరూపాక్ష చేయిస్తా..

చప్పట్లు కొట్టాలంటే కూడా రెండు చేతులు కావాలి కదా.. ఈ లాజిక్‌ను కూడా నవీన్ పోలిశెట్టి కామెడీ చేశాడు. తన గాయం వల్ల రెండు చేతులతో చప్పట్లు కొట్టలేడు కాబట్టి ఒక చేతిని తన చెంపకు కొట్టుకుంటాడు. ‘‘గోవా ప్లాన్‌కు హ్యాండ్ ఇవ్వొద్దు’’ అని ఒక ఫ్రెండ్ అంటే ‘‘వాడికి హ్యాండ్ ఉంటే కదా ఇవ్వడానికి’’ అని మరొక ఫ్రెండ్ కామెడీ చేస్తాడు. అది విని ఫీల్ అయిన నవీన్.. ‘‘రాత్రి నీ మీద విరూపాక్ష చేయిస్తా’’ అని నవ్వుతూ బెదిరిస్తాడు. పార్టీకి వెళ్లినప్పుడు అక్కడ ఉన్న డీజే హ్యాండ్స్ అప్ అంటుంటే నవీన్‌కు ఫ్రస్ట్రేషన్ వచ్చి ‘‘డీజేవా పోలీసా నువ్వు’’ అని సీరియస్ అవుతాడు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Naveen Polishetty (@naveen.polishetty)

నవ్వించడం ఇష్టం..

కుడి చేతికి గాయమవ్వడం వల్ల ఎడమ చేతితో తింటుంటే సంస్కారం లేదా అని నవీన్ పోలిశెట్టిని తిడతారు. దీంతో తన పెట్ డాగ్‌లాగానే తను కూడా నేరుగా తలను ప్లేట్‌లో పెట్టి తినడం మొదలుపెడతాడు. అలా తన చేతికి జరిగిన గాయాన్ని కారణంగా చూపించి అందరినీ నవ్వించాడు ఈ యంగ్ హీరో. ‘‘కామెడీ అనేది జీవితంలోని కష్టాలను ఎదుర్కోవడానికి ధైర్యం ఇస్తుంది. నవ్వుతూ ఉండండి. నాకు మిమ్మల్ని నవ్వించడం ఇష్టం. పూర్తిగా కోలుకున్న తర్వాత వెండితెరపై కలుద్దాం’’ అంటూ వీడియోను ముగించాడు నవీన్ పోలిశెట్టి.

Also Read: అరుదైన ఘనత సాధించిన ధనుష్‌ 'రాయన్‌' - ఏకంగా ఆస్కార్‌ లైబ్రరీలో చోటు

టాప్ హెడ్ లైన్స్

Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Love Drama OTT : ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
Mahesh Babu : వారణాసి సెట్‌లో రుద్రతో మందాకిని - మహేశ్ బాబుకు స్పెషల్ విషెష్
వారణాసి సెట్‌లో రుద్రతో మందాకిని - మహేశ్ బాబుకు స్పెషల్ విషెష్
Toxic Trailer : టాక్సిక్‌లో వయలెన్స్, రొమాన్స్ - ట్రోలింగ్స్‌, విమర్శలపై యశ్ రియాక్షన్
టాక్సిక్‌లో వయలెన్స్, రొమాన్స్ - ట్రోలింగ్స్‌, విమర్శలపై యశ్ రియాక్షన్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Rukmini Vasanth : అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
ఈ నెలలో Kia కారు కొంటే రూ.లక్షల్లో ఆదా.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్‌ ఉందంటే?
కియా కారు కొనేవాళ్లకు సర్‌ప్రైజ్‌ - రూ.లక్షన్నర మిగిలినట్లే!, ఈ డబ్బుతో మంచి బైక్‌ కొనొచ్చు
Mouneesha Chowdary: బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. జోరుగా ప్రచారం.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు!
Embed widget