Ananganaga Oka Raju Release Date: సంక్రాంతి కానుకగా నవీన్ పోలిశెట్టి 'అనగనగా ఒక రాజు' - థియేటర్లలో నవ్వుల పండుగే..
Naveen Polishetty: యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి లేటెస్ట్ ఫ్యామిలీ కామెడీ ఎంటర్‌టైనర్ 'అనగనగా ఒక రాజు' నుంచి బిగ్ అప్‌డేట్ వచ్చింది. ఈ మూవీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ తాజాగా అనౌన్స్ చేశారు.

Naveen Polishetty's Anaganaga Oka Raju Movie Release Date: టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి లేటెస్ట్, అవెయిటెడ్ కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'అనగనగా ఒక రాజు'. ఈ మూవీ రిలీజ్ డేట్‌పై తాజాగా బిగ్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్.
వచ్చే సంక్రాంతికి..
ఈ మూవీని వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ తెలిపారు. 'ఈ సంక్రాంతికి దద్దరిల్లే నవ్వులని ఆనందాన్ని తీసుకొస్తున్నాం.' అంటూ సోషల్ మీడియా వేదికగా ఓ మోషన్ పోస్టర్ రిలీజ్ చేయగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంతో నవీన్ థియేటర్లలో నవ్వుల పండుగను తీసుకురాబోతున్నాడని అర్థమైంది.
'నెక్స్ట్ రాబోతోంది.. ఆరడుగుల అందగాడు, పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టపడేవాడు. అమ్మాయిల గుండెచప్పుడు. ముందుకొచ్చేదెప్పుడు. ఇక టెన్షన్ ఎందుకు దండగ. రాజుగారు ఎక్కడుంటే అక్కడ పండుగ.' అంటూ మోషన్ పోస్టర్‌లో డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. తనదైన కామెడీ టైమింగ్, పంచులతో నవీన్ నవ్వులు పూయిస్తుంటారు. ఈ సినిమాలోనూ కామెడీ వేరే లెవల్‌లో ఉండనుందని మోషన్ పోస్టర్ బట్టి అర్థమవుతోంది. వచ్చే ఏడాది జనవరి 14న సంక్రాంతికి థియేటర్స్ నవ్వులతో దద్దరిల్లడం ఖాయమంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Tension endhuku Dandaga….
— Sithara Entertainments (@SitharaEnts) May 26, 2025
Raju garu ekkadunte akkada pandaga 😎
The Star Entertainer @NaveenPolishety is back with the perfect family entertainer for Sankranthi ❤️🔥
▶️ https://t.co/LlmVZCFstt#AnaganagaOkaRaju Worldwide Grand Release on JAN 14th, 2026.#AOROnJan14th 💫… pic.twitter.com/79jfweTycp
Also Read: 'ఆ నలుగురు' అంటూ వ్యక్తిగతంగా దాడి చేస్తున్నారు - పవన్ సినిమాను ఆపే ధైర్యం ఎవరికీ ఉందన్న దిల్ రాజు
మరో హిట్ ఖాయమేనా..
ఈ చిత్రానికి మారి దర్శకత్వం వహిస్తుండగా.. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్నారు. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణ సంస్థలు కొన్నేళ్లుగా వరుస ఘన విజయాలను సొంతం చేసుకుంటున్నాయి. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన 'డాకు మహారాజ్' బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 2026 సంక్రాంతికి 'అనగనగ ఒక రాజు'తో మరో పండగ విజయాన్ని ఖాతాలో వేసుకోవడానికి సిద్ధమవుతున్నారు.
'జాతిరత్నాలు' మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చి తన కామెడీ టైమింగ్, పంచులతో మంచి హిట్ అందుకున్నారు నవీన్ పోలిశెట్టి. అంతకు ముందు పలు సినిమాల్లో కీలక పాత్రలు పోషించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' మూవీతో అలరించారు. ఈ సినిమాలో అనుష్క హీరోయిన్‌గా నటించారు. ఆ తర్వాత గ్యాప్ వచ్చింది. 'అనగనగా ఒక రాజు' మూవీ అనౌన్స్ చేసిన తర్వాత నవీన్‌కు యాక్సిడెంట్ కావడంతో కొంత గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత ఈ మూవీని మళ్లీ ట్రాక్‌లోకి ఎక్కించారు. ఇందులో భాగంగానే అప్పట్లో గ్లింప్స్, లుక్స్ రిలీజ్ చేశారు. తాజాగా.. రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తూ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు.





















