అన్వేషించండి

Dil Raju: 'ఆ నలుగురు' అంటూ వ్యక్తిగతంగా దాడి చేస్తున్నారు - పవన్ సినిమాను ఆపే ధైర్యం ఎవరికీ ఉందన్న దిల్ రాజు

Dil Raju Press Meet: సినీ ఇండస్ట్రీలో తాజా పరిణామాలు, ఎగ్జిబిటర్ల పర్సంటేజీ అంశాలపై నిర్మాత దిల్ రాజు తాజాగా స్పందించారు. పవన్ కల్యాణ్ కామెంట్స్‌పైనా ఆయన మాట్లాడారు.

Dil Raju About Theaters Band Issue: ఈస్ట్ గోదావరిలో ఓ వ్యక్తితో మొదలైన సమస్య తెలంగాణకు ఆపాదించి ఆ తర్వాత ఏపీ అలా తప్పుడు మెసేజ్ వెళ్లిందని ప్రముఖ నిర్మాత దిల్ రాజు అన్నారు. ఇటీవల థియేటర్స్ బంద్ వ్యవహారం, ఏపీ ప్రభుత్వం, సినీ పరిశ్రమ మధ్య నెలకొన్న తాజా పరిణామాలపై ఆయన సోమవారం ప్రెస్ మీట్‌లో మాట్లాడారు. పవన్ కల్యాణ్ సినిమాను ఆపే ధైర్యం ఎవరికీ లేదన్నారు.

అసలు సమస్య అక్కడే స్టార్ట్

పర్సంటేజ్‌ల విషయంలో ఎగ్జిబిటర్లకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయని తూ.గో జిల్లాకు చెందిన కొందరు ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ తమ దృష్టికి తెచ్చారని దిల్ రాజు తెలిపారు. 'ప్రస్తుతం ఇండస్ట్రీలో రెంట్ అండ్ పర్సంటేజ్ విధానం నడుస్తోంది. ఫస్ట్ వీక్ రెవెన్యూ బాగా వస్తే రెంట్ ఇస్తున్నాం. సెకండ్ వీక్ కలెక్షన్స్ తగ్గగానే పర్సంటేజ్ ఇస్తున్నాం. దీనిపై చర్చిస్తున్నాం. కానీ, ఓ కొలిక్కి రాలేదు. సరిగ్గా ఆ టైంలో 'హరిహర వీరమల్లు' రిలీజ్ డేట్ ప్రకటించారు. కొన్ని కారణాలతో అది వాయిదా పడగా ఆ తర్వాత డేట్ వాళ్లు లాక్ చేయలేదు. పర్సంటేజ్ సమస్య ఈస్ట్ నుంచి మొదలై నైజాంకు వచ్చింది.' అని చెప్పారు.

'ఆ నలుగురు'.. ఇదిగో క్లారిటీ..

నైజాంలో 370 సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఉంటే, ఎస్వీఎస్ సహా మా వద్ద ఉన్న థియేటర్స్ 30 మాత్రమేనని దిల్ రాజు తెలిపారు. 'ఏషియన్, సురేశ్ కంపెనీలో 90 ఉన్నాయి. 250 థియేటర్స్ ఓనర్స్, వాళ్లకు సంబంధించిన వాళ్లు మాత్రమే నడుపుతున్నారు. ఇండస్ట్రీలో 'ఆ నలుగురు' అంటూ మీడియా ఇష్టం వచ్చినట్లు రాస్తోంది. ఈ విషయంలో క్లారిటీ ఇస్తున్నాం. వ్యక్తిగతంగా దాడి చేస్తున్నారు. ' అని చెప్పారు.

Also Read: ఇండస్ట్రీలో కొంతమంది అహంకారంతో వ్యవహరిస్తున్నారు - అల్లు అరవింద్ కామెంట్స్‌‌ స్వాగతించిన మంత్రి కందుల దుర్గేష్

పవన్ సినిమాలు ఆపే ధైర్యముందా?

ఇండస్ట్రీలో పవన్ సినిమాలు ఆపే ధైర్యం ఎవరికీ లేదని దిల్ రాజు స్పష్టం చేశారు. 'మే 18న ఛాంబర్ మీటింగ్‌లో ఏం జరిగిందో తెలియకుండానే మీడియా న్యూస్ ప్రచురించింది. జూన్ 1 నుంచి థియేటర్స్ బంద్ చేస్తామని ఎగ్జిబిటర్స్ చెబితే వద్దని వారించాను. ఛాంబర్‌కు వాళ్ల పర్సంటేజీల విషయంలో లేఖ రాశారు. వాళ్లు అనుకున్నది జరగకుంటే బంద్ చేస్తామనేది కేవలం ఆలోచన మాత్రమే. కొవిడ్ టైంలో తప్ప ఎప్పుడూ థియేటర్స్ బంద్ కాలేదు.

56 రోజులు మేం షూటింగ్స్ ఆపేసి నిర్మాతలుగా ఏమీ సాధించలేకపోయాం. నిర్మాతలందరం ఎగ్జిబిటర్ల సమస్యలపై చర్చించాం. 'హరిహర వీరమల్లు' విషయంలో తప్పుగా మెసేజ్ వెళ్లింది. పవన్ కల్యాణ్ సినిమాలు ఆపే దమ్ము, ధైర్యం ఎవరికీ లేదు. మంత్రి దుర్గేష్ గారు నాకు ఫోన్ చేస్తే అది తప్పుడు సమాచారం అని చెప్పాను. జూన్‌లో పెద్ద సినిమాల రిలీజ్ ఉంది. ఆ టైంలో పరిశ్రమను ఎలా కాపాడుకోవాలనేదే మా ఆలోచన.' అని అన్నారు.

ఐక్యంగా ఉందాం

ఇండస్ట్రీలో టికెట్స్ ధరల పెంపు వంటి అంశాలపై అవసరం ఉంటే ఎవరికి వారే వెళ్లి కలుస్తున్నారని దిల్ రాజు అన్నారు. 'తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సినీ పరిశ్రమకు అండగా ఉన్నాయి. ఛాంబర్‌లోనే కొట్టుకుంటారు. ఐక్యత లేదు. సినిమా వాళ్లకు రెండు ప్రభుత్వాలు చాలా ముఖ్యం. కల్యాణ్ గారు చెప్పాక పక్కింటికి వెళ్లినంత సులభంగా వెళ్లి పేపర్ పట్టుకుని టికెట్ ధరలు పెంచుకుని వస్తున్నారు. అందరం కలిసి ఉండాలనే ఆలోచన మా దగ్గర తక్కువ. ఈ ఎపిసోడ్‌తో ఇప్పటికైనా తెర దించుదాం.' అని అన్నారు.

పవన్ కల్యాణ్ రిటర్న్ గిఫ్ట్ అంటూ అడిగిన ప్రశ్నకు దిల్ రాజు స్పందించారు. ఇండస్ట్రీకి పవన్ కల్యాణ్ పెద్ద అని ఆయన ఓ మాటంటే తీసుకోమా? అని దిల్ రాజు అన్నారు. ఓ సందర్భంలో తప్పుడు మెసేజ్ వెళ్లి పవన్‌‌కు కోపం వచ్చిందని అందువల్లే ఆయన అలా స్పందించారని ఆయన ఏమన్నా తీసుకుంటామని చెప్పారు.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

I Nobody OTT : ఓటీటీలోకి వారణాసి విలన్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి వారణాసి విలన్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Samantha Cooking Show : సమంత హోస్ట్‌గా కుకింగ్ షో - సెలబ్రిటీస్ వంటలు వెరీ స్పెషల్... ప్రోమో చూశారా!
సమంత హోస్ట్‌గా కుకింగ్ షో - సెలబ్రిటీస్ వంటలు వెరీ స్పెషల్... ప్రోమో చూశారా!
Ameer Log: రానా చేతికి 'అమీర్ లోగ్'... బస్తీల్లో పెరిగిన కుర్రాళ్ళే హీరోలుగా... సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
రానా చేతికి 'అమీర్ లోగ్'... బస్తీల్లో పెరిగిన కుర్రాళ్ళే హీరోలుగా... సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?

వీడియోలు

Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Embed widget