Malli Pelli Trailer : బోల్డ్ కపుల్ నరేష్, పవిత్ర కథ మరింత తెలుసుకోవాలని ఉందా?
Naresh Pavitra Latest News : నరేష్, పవిత్రా లోకేష్ జంట గురించి మీరు మరింత తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే, మే 11 వరకు వెయిట్ చేయమని అంటున్నారు ఎంఎస్ రాజు.
నవరస రాయ నరేష్ విజయకృష్ణ (Naresh), ప్రముఖ నటి పవిత్రా లోకేష్ (Pavitra Lokesh)ను బోల్డ్ కపుల్ అంటోంది 'మళ్ళీ పెళ్లి' చిత్ర బృందం. బోల్డ్ కపుల్ గురించి మీరు మరింత తెలుసుకోవాలని అనుకుంటే... మే 11 వరకు వెయిట్ చేయాలి.
నరేష్ హీరోగా రూపొందిన తాజా సినిమా 'మళ్ళీ పెళ్లి' (Malli Pelli Movie). ఇందులో ఆయనకు జోడీగా పవిత్రా లోకేష్ కథానాయికగా నటించారు. ఆల్రెడీ విడుదలైన టీజర్ చూస్తే... నరేష్ & పవిత్రా లోకేష్, నరేష్ మూడో భార్య రమ్యా రఘుపతికి మధ్య జరిగిన ఘటనలతో సినిమా తెరకెక్కిందని సామాన్య ప్రేక్షకులకు సైతం అర్థమైంది. త్వరలో విడుదల కాబోయే ట్రైలర్ లో వాటిని మరింత చూపించనున్నారు.
మే 11న 'మళ్ళీ పెళ్లి' ట్రైలర్
Malli Pelli trailer release on May 11th : మే 11న 'మళ్ళీ పెళ్లి' ట్రైలర్ విడుదల చేయనున్నట్లు ఈ రోజు అనౌన్స్ చేశారు. ఆ రోజు ఉదయం 11.11 గంటల నుంచి యూట్యూబ్ లో తెలుగు, కన్నడ భాషల్లో ట్రైలర్ అందుబాటులో ఉంటుంది. 'బోల్డెస్ట్ కపుల్ గురించి మరింత తెలుసుకోండి' అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. అదీ సంగతి! ఆల్రెడీ మీడియాలో ప్రేక్షకులు చూసినవి కాకుండా తెర వెనుక ఏం జరిగింది? అనే అంశానికి ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది.
#MalliPelli Trailer Releasing on MAY 11th @ 11.11 AM 😍#MalliPelliOnMay26 💥#PavitraLokesh @MSRajuOfficial @vanithavijayku1@sureshbobbili9 @ArulDevofficial @VKMovies_ pic.twitter.com/bfFJh6w7WZ
— H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) May 9, 2023
అనన్యా నాగళ్ళ గ్లామర్ హైలైట్ అయ్యేలా...
'మళ్ళీ పెళ్లి' నుంచి ఇప్పటికి రెండు పాటలు విడుదల చేశారు. తొలి పాట 'ఉరిమే మేఘమా...'లో నరేష్, పవిత్రా లోకేష్ ఎక్కువ కనిపించారు. ఆ తర్వాత విడుదల చేసిన రెండో పాట 'రా రా హుస్సూర్ నాతో...'లో వాళ్ళిద్దరితో పాటు 'వకీల్ సాబ్', 'మల్లేశం', 'ప్లే బ్యాక్' సినిమాల ఫేమ్ అనన్యా నాగళ్ళ గ్లామర్ హైలైట్ అయ్యింది.
Also Read : 'బాహుబలి' క్లైమాక్స్ గుర్తు చేసిన 'ఆదిపురుష్' ట్రైలర్ - ఆ ఒక్క డైలాగ్ లేకపోతే?
మే 26న 'మళ్ళీ పెళ్లి' విడుదల
Malli Pelli Release On May 26th : వేసవిలో 'మళ్ళీ పెళ్లి'ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి చెబుతూ వస్తున్నారు. ఈ నెల 26న థియేటర్లలో చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు తెలిపారు. తెలుగు, కన్నడ భాషల్లో సినిమా విడుదల కానుంది.
Also Read : 'యువ' తర్వాత ఇన్నాళ్ళకు - మాధవన్, సిద్ధార్థ్, మీరా కాంబినేషన్ రిపీట్!
'మళ్ళీ పెళ్లి' చిత్రానికి మెగా మూవీ మేకర్ ఎం.ఎస్. రాజు (MS Raju) దర్శకుడు. నరేష్ విజయ కృష్ణ నిర్మాత. దీంతో లెజెండరీ ప్రొడక్షన్ హౌస్ విజయ కృష్ణ మూవీస్ సంస్థను పున:ప్రారంభించారు. సకుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా 'మళ్ళీ పెళ్లి' అని, ఇది పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని ఆయన తెలిపారు. ఈ సినిమా కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు.
జయసుధ, శరత్ బాబు కీలక పాత్రలు పోషిస్తున్న 'మళ్ళీ పెళ్లి' సినిమాలో వనితా విజయ్ కుమార్, అనన్య నాగెళ్ల, రోషన్, రవివర్మ, అన్నపూర్ణ, భద్రం, యుక్త, ప్రవీణ్ యండమూరి, మధు తదితరులు ఇతర తారాగణం. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి స్వరాలు, అరుల్ దేవ్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు.