అన్వేషించండి

Nara Rohit: నారావారి ఇంట మరో వారసుడు... రోహిత్, శిరీష దంపతులకు అబ్బాయి

Nara Rohit Becomes Father: నారా చంద్రబాబు నాయుడు సోదరుని కుమారుడు నారా రోహిత్ తండ్రి అయ్యారు. ఆయన భార్య శిరీష పండంటి మగబిడ్డకు జన్మ ఇచ్చారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • నారా రోహిత్, శిరీష దంపతులకు పండంటి మగబిడ్డ జన్మించాడు.
  • జూన్ 23న జన్మించిన బిడ్డతో వారి కుటుంబంలో ఆనందం నిండింది.
  • ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మేనల్లుడు రోహిత్ తండ్రి అయ్యారు.
  • పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు వారికి అభినందనలు తెలిపారు.

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబంలో ఓ సంతోషకరమైన శుభ పరిణామం చోటు చేసుకుంది. ఆయన సోదరుని కుమారుడు, యంగ్ హీరో నారా రోహిత్ తండ్రి అయ్యారు. ఆయన భార్య, నటి శిరీష పండంటి మగ బిడ్డకు జన్మ ఇచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే...

రోహిత్ - శిరీష దంపతులకు అబ్బాయి
నారా రోహిత్, ఆయన సతీమణి శిరీషకు తల్లిదండ్రులుగా ప్రమోషన్ వచ్చింది. తమ జీవిత ప్రయాణంలో కొత్త అధ్యాయాన్ని, ప్రయాణాన్ని ప్రారంభించారు. జూన్ 23న ఈ దంపతులు పండంటి బిడ్డకు జన్మ ఇచ్చినట్లు తెలిసింది. గత ఏడాది అక్టోబర్ 30వ తేదీన ఈ దంపతులు పెళ్లి జరిగిన విషయం తెలిసిందే.  పెళ్లి ఫోటోలను దంపతులు ఇద్దరూ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

కథానాయకుడిగా తెలుగు ప్రేక్షకులలో నారా రోహిత్ మంచి పేరు తెచ్చుకున్నారు. 'వీర భోగ వసంత రాయులు' తర్వాత ఆరేళ్ళు విరామం తీసుకుని 'ప్రతినిధి 2' చేశారు. ఆ తర్వాత 'భైరవం', 'సుందరకాండ' సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఆయన చేతిలో రెండు మూడు సినిమాలు ఉన్నాయి. హీరోగా ఒక వైపు బిజీ... మరో వైపు వ్యక్తిగత జీవితంలోనూ సంతోషం నెలకొంది.

Also ReadChiranjeevi On Samantha Pregnancy - సమంత ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసిన చిరంజీవి... మా ఇంటి బంగారానికి మెగా రివ్యూ

ప్రస్తుతం కుటుంబంతో కలిసి ఆనంద క్షణాలను ఆస్వాదిస్తున్నారు నారా రోహిత్. అయితే... ఆయన తదుపరి సినిమా కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ 'పేరెంట్‌ హుడ్' న్యూస్ పెద్ద సర్‌ప్రైజ్‌. తండ్రి కావడంతో సినిమా చిత్రీకరణలకు కొన్ని రోజులు విరామం ఇచ్చే అవకాశం ఉంది.

Also ReadRam Charan - మల్టీప్లెక్స్‌లకు రామ్ చరణ్ షాక్... థియేటర్లలో పాప్‌కార్న్ రేట్లపై సంచలన వ్యాఖ్యలు

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Siree Lella (@siree_lella)

ప్రస్తుతం నారా రోహిత్, శిరీష దంపతులకు సోషల్ మీడియా వేదికగా పలువురు సినీ - రాజకీయ ప్రముఖుల అభినందనలు తెలియజేస్తున్నారు. రామూర్తి నాయుడు మరణం తర్వాత నారా రోహిత్ పెళ్లి బాధ్యతలను చంద్రబాబు నాయుడు - భువనేశ్వరి దంపతులు తమ భుజాలపై వేసుకున్నారు. ముఖ్యంగా రోహిత్ పెళ్లి విషయంలో భువనేశ్వరి అంతా తానై చూసుకున్నారు. ఇప్పుడు వాళ్ళ ఇంట మరో వారసుడు రావడంతో నారా వారి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ - బ్రాహ్మణి దంపతులకు ఓ బిడ్డ జన్మించారు. నారా వారి మొదటి వారసుడు దేవాన్ష్. నారా చంద్రబాబు నాయుడు తమ్ముడి ఇంట కూడా అబ్బాయి జన్మించడం విశేషం.

Also ReadArya On Vishal Avan Ivan Look - 45 రోజులు తీసిందంతా వేస్ట్, చెత్తబుట్టలోకి... వంద రోజులు షూట్ చేశాక కథ - 'వాడు వీడు' తెర వెనుక సంగతులు

Frequently Asked Questions

నారా రోహిత్ తండ్రి అయ్యారు. ఆయన భార్య ఎవరు?

నారా రోహిత్ భార్య నటి శిరీష. వారికి పండంటి మగబిడ్డ జన్మించాడు.

నారా రోహిత్, చంద్రబాబు నాయుడుకు ఏమవుతారు?

నారా రోహిత్ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుని కుమారుడు. రామూర్తి నాయుడు మరణం తర్వాత ఆయన పెళ్లి బాధ్యతలను చంద్రబాబు దంపతులు చూసుకున్నారు.

నారా రోహిత్ - శిరీష దంపతులకు ఎప్పుడు బిడ్డ జన్మించాడు?

జూన్ 23న నారా రోహిత్ - శిరీష దంపతులకు పండంటి మగబిడ్డ జన్మించినట్లు తెలిసింది. ఇది వారి కుటుంబంలో సంతోషకరమైన శుభ పరిణామం.

తండ్రి అయిన తర్వాత నారా రోహిత్ సినిమాలకు విరామం తీసుకుంటారా?

తండ్రి కావడంతో నారా రోహిత్ సినిమా చిత్రీకరణలకు కొన్ని రోజులు విరామం ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆయన చేతిలో రెండు మూడు సినిమాలు ఉన్నాయి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Bigg Boss Winner Wedding: తమిళ నటుడిగా బిగ్ బాస్ విన్నర్ పెళ్లి... సింపుల్‌గా గురువాయూర్ టెంపుల్‌లో!
తమిళ నటుడిగా బిగ్ బాస్ విన్నర్ పెళ్లి... సింపుల్‌గా గురువాయూర్ టెంపుల్‌లో!
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Embed widget