అన్వేషించండి

Nandamuri Balakrishna : "ఏ హీరోయిన్ అంటే ఇష్టం?" బాలయ్యను ఇరుకున పెట్టేసిన భువనేశ్వరి... నటసింహం ఎపిక్ రిప్లై ఏంటో తెలుసా?

Nandamuri Balakrishna : నందమూరి స్పెషల్ ఫ్యామిలీ పార్టీలో భువనేశ్వరి తన అన్న బాలయ్యను ఫేవరెట్ హీరోయిన్ ఎవరు అని ప్రశ్నించగా, బాలయ్య ఇచ్చిన సమాధానం వైరల్ అవుతోంది.

Nandamuri Balakrishna : గాడ్ ఆఫ్ మాసస్ నందమూరి బాలకృష్ణకు రీసెంట్ గా కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నందమూరి అభిమానులతో పాటు కుటుంబ సభ్యులు కూడా సంతోషంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. బాలయ్య ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, అలాగే మూడోసారి ఎమ్మెల్యేగా గెలవడం, ఏపీ టీడీపీ మళ్ళీ అధికారంలోకి రావడం, ఈ టైంలోనే బాలయ్యకు పద్మభూషణ్ అవార్డు వరించడం వంటి శుభపరిణామాలతో  అందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే బాలయ్య చెల్లెలు, సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి తన సొంత ఫామ్ హౌస్ లోనే అన్న గౌరవార్థంగా గ్రాండ్ పార్టీని ఏర్పాటు చేసింది. 

అన్నను ఇరుకున పెట్టిన భువనేశ్వరి

ఈ వేడుకకు నారా, నందమూరి కుటుంబ సభ్యులతో పాటు ఇతర ప్రముఖులు కూడా హాజరయ్యారు. అంతేకాదు చీఫ్ గెస్ట్ గా సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి కూడా వేడుకకు విచ్చేశారు. ఈ ఫ్యామిలీ పార్టీ సందర్భంగా నందమూరి బాలకృష్ణ తన కెరీర్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను గుర్తు చేసుకున్నారు. ఇక అక్కా చెల్లెళ్లు భువనేశ్వరి, పురందేశ్వరి ఇద్దరూ బాలయ్యను సరదాగా ఓ ఆట ఆడుకున్నారు. ఈ నేపథ్యంలోనే భువనేశ్వరి తన అన్నని ఇరుకున పెట్టే ప్రశ్న వేసింది. 

సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి, బాలయ్య చెల్లెలు భువనేశ్వరి ఈ ఫ్యామిలీ పార్టీ సందర్భంగా బాలయ్యను రాపిడ్ ఫైర్ లాగా కొన్ని ప్రశ్నలు అడిగింది. అందులో భాగంగా "నీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు ?" అంటూ బాలయ్య అని అడిగి, ఆయనను ఇరుకున పెట్టింది. దీంతో బాలయ్య ఆ ప్రశ్న నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. అయినా అక్కాచెల్లెళ్ళు ఇద్దరూ వదిలిపెట్టలేదు. భువనేశ్వరి మాట్లాడుతూ "మీరు నటించిన వారిలో ఎవరు బెస్ట్ హీరోయిన్ ?" అని ప్రశ్నించింది. 

బాలయ్య సమాధానం ఇదే

ఆ ప్రశ్నకు బాలయ్య "ఎవరంటే ఏం చెప్తాను. నేను చాలా మందితో కలిసి నటించాను. మళ్లీ సమాధానం చెప్తే లేనిపోనివి వస్తాయి" అంటూ ఆ ప్రశ్నలు దాటవేసే ప్రయత్నం చేశారు. కానీ భువనేశ్వరి వదలకుండా "మేము అర్థం చేసుకుంటాము. నేనేం అనుకోను. ఒక్క పేరు" అని చెప్పింది. ఆ వెంటనే పురంధేశ్వరి అందుకుని "యాక్టర్ అనలేదు, యాక్ట్రెస్ అన్నది... నిజజీవితంలో కాదు" అనగానే, "అయితే వసూనే. ఈ ప్రపంచమే ఒక నటనరంగం. ఆ రకంగా చూసుకుంటే వసూ కూడా ఒక నటి" అని చెప్పారు బాలయ్య. దీంతో భువనేశ్వరి ఒప్పుకోకుండా "ఏ భార్యా యాక్ట్ చేయదు. ఆమె భర్తతో రియల్ గా ఉంటుంది. మీరు నటించిన వారిలో బెస్ట్ యాక్ట్రెస్ ఎవరు? ఇప్పుడు చెప్పండి" అని ప్రశ్నించింది. ఇక బాలయ్య చెప్పక తప్పేలా లేదు అనుకున్నారో ఏమోగానీ, ముందుగా విజయశాంతి పేరు చెప్పారు. ముగ్గురు పేర్లు చెప్పమంటే "విజయశాంతి, రమ్యకృష్ణ, సిమ్రాన్" అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం బాలయ్య కామెంట్ చేసిన ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది.

Also Readనందమూరి కుటుంబంతో విజయసాయి రెడ్డి... రాజకీయాలకు గుడ్ బై చెప్పి బంధుత్వాలకు దగ్గరగా!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Donald Trump: మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?

వీడియోలు

అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..
బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Donald Trump: మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Trump: ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
Anasuya Bharadwaj : హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
Kavitha New Party: రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
Nicolas Maduro Guerra Warning:చరిత్ర చెబుతుంది ద్రోహి ఎవరో? తల్లి మీద ఒట్టు అంటూ ట్రంప్‌కు మదురో కుమారుడు వార్నింగ్
చరిత్ర చెబుతుంది ద్రోహి ఎవరో? తల్లి మీద ఒట్టు అంటూ ట్రంప్‌కు మదురో కుమారుడు వార్నింగ్
Embed widget