అన్వేషించండి

The Paradise: డిఫరెంట్ రోల్... డిఫరెంట్ లుక్... 'ప్యారడైజ్'లో నేచరల్ స్టార్ నాని పేరు కూడా...

Nani First Look: నేచరల్ స్టార్ నాని అవెయిటెడ్ మూవీ 'ది ప్యారడైజ్' నుంచి ఫస్ట్ లుక్ రివీల్ చేశారు మేకర్స్. డిఫరెంట్ టైటిల్‌లో డిఫరెంట్ లుక్‌తో గూస్ బంప్స్ తెప్పించారు.

Nani's First Look From The Paradise Movie: ఈ ఏడాది 'హిట్ 3' బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నారు నేచరల్ స్టార్ నాని. ప్రస్తుతం 'దసరా' ఫేం శ్రీకాంత్ ఓదెలతో 'ది ప్యారడైజ్' మూవీ చేస్తున్నారు. వీరి కాంబోలో ఇది రెండో మూవీ కాగా ఇప్పటికే రిలీజ్ చేసిన లుక్స్, గ్లింప్స్ గూస్ బంప్స్  తెప్పించగా తాజాగా మూవీలో నాని పేరు రివీల్ చేస్తూ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్.

ధగడ్... టైటిల్ కూడా...

ఈ మూవీలో ఎన్నడూ చూడని ఓ డిఫరెంట్ లుక్‌లో నాని కనిపించనున్నట్లు ఇదివరకే స్పష్టమైంది. ఆయన 'జడల్' పాత్రలో కనిపించనున్నట్లు టీం తెలిపింది. నేచరల్ స్టార్ ఫస్ట్ లుక్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. 'ఇది ఒక అల్లికగా ప్రారంభమై... విప్లవంగా ముగిసింది.' అంటూ టీం పేర్కొంది. ముక్కుకు పుడకలు, గుబురు గెడ్డం, రెండు జడలు, వెనుక వెపన్స్‌తో కూడిన చక్రం... టైటిల్‌కు తగ్గట్టుగానే ఊర మాస్ లుక్‌లో అదరగొట్టగా భారీ హైప్ క్రియేట్ అవుతోంది. లుక్స్‌నే ఇలా ఉంటే మూవీ ఇక అదిరిపోతుందంటూ సోషల్ మీడియాలో నాని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: 'అరేబియా కడలి' రివ్యూ: 'తండేల్' కథే... మరి ఈ సిరీస్‌లో కొత్తేముంది? క్రిష్ & కో చూపించిన ఎమోషన్ ఏంటి?

స్టోరీ అదేనా?

'చరిత్రలో అంతా చిలుకలు పావురాల గురించి రాశారు కానీ అదే జాతిలో పుట్టిన కాకుల గురించి ఎవరూ రాయలేదు. ఇది కడుపు మండిన కాకుల కథ. జమానాకెళ్లి నడిచే శవాల కథ. అమ్మ రొమ్ములో పాలు లేక రక్తం పోసి పెంచిన ఓ జాతి కథ.' అంటూ గ్లింప్స్‌లో ఇచ్చిన ఎలివేషన్ మామూలుగా లేదు. నాని లుక్ కూడా అదిరిపోయింది. దీంతో ఈ మూవీ స్టోరీ ఏంటి అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. చరిత్రలో లేని అట్టడుగున ఉన్న ఓ వర్గానికి నాయకుడిగా నాని కనిపించనున్నారని అర్థమవుతోంది. ఆయనకు కాకి రెక్కలు తొడిగినట్లుగా ఉన్న లుక్ భారీ హైప్ క్రియేట్ చేస్తోంది. 1960 బ్యాక్ డ్రాప్‌లో ఓ గ్యాంగ్ స్టర్ డ్రామాగా మూవీని తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.

నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో వచ్చిన 'దసరా' మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ కూడా అంతే స్థాయిలో హిట్ అవుతుందని అంతా భావిస్తున్నారు. మూవీని ఎస్ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. బాలీవుడ్ యాక్టర్ రాఘవ్ జ్యూయెల్ కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది మార్చి 26న 'ది ప్యారడైజ్' మూవీని తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు బెంగాళీ, ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లోనూ రిలీజ్ చేయనున్నారు.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Kavitha New Party: రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు

వీడియోలు

ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..
బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Kavitha New Party: రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
Telugu Woman Murder: అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
Nizamabad Crime News:నిజామాబాద్‌లో మిస్టరీ డెత్‌; గుండెపోటుతో భర్త చనిపోయినట్టు భార్య డ్రామా! ఒక్క ఫోన్ కాల్‌తో ఆటకట్టు!
నిజామాబాద్‌లో మిస్టరీ డెత్‌; గుండెపోటుతో భర్త చనిపోయినట్టు భార్య డ్రామా! ఒక్క ఫోన్ కాల్‌తో ఆటకట్టు!
Gold Jewellery Insurance: బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే ఉచిత బీమా లభిస్తుంది.. ఏ సందర్భాల్లో కవర్ అవుతుంది
బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే ఉచిత బీమా లభిస్తుంది.. ఏ సందర్భాల్లో కవర్ అవుతుంది
Ind vs Ban 5 Major controversies: భారత్, బంగ్లాదేశ్ క్రికెట్ జట్ల మధ్య 5 పెద్ద వివాదాలు.. ఓసారి ఏకంగా కొట్టుకునే వరకు వెళ్లిన ఆటగాళ్లు
భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య 5 పెద్ద వివాదాలు.. ఓసారి ఏకంగా కొట్టుకునే వరకు వెళ్లిన ఆటగాళ్లు
Embed widget