అన్వేషించండి

Nani - 35 Chinna Katha Kadu: నివేదా థామస్ సినిమాకు నాని రివ్యూ - ఆమిర్ ఖాన్‌తో ఏ నటుడ్ని కంపేర్ చేశారంటే?

35 Chinna Katha Kadu First Review: నివేదా థామస్ ప్రధాన పాత్రలో నటించిన '35 చిన్న కథ కాదు' ప్రీ రిలీజ్ వేడుకకు నాని అతిథిగా వచ్చారు. తాను సినిమా చూశానని, బావుందని చెప్పారు. ఆయన రివ్యూ ఏంటో చూద్దామా?

'35 చిన్న కథ కాదు' (35 Chinna Katha Kadu Movie) సినిమాతో ఈ శుక్రవారం (సెప్టెంబర్ 6న) థియేటర్లలోకి వస్తున్నారు నివేదా థామస్ (Nivetha Thomas). తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల అవుతోంది. ఈ రోజు, రేపు (సెప్టెంబర్ 4, 5 తేదీల్లో) ప్రీమియర్లు వేస్తున్నారు. ఆల్రెడీ కొంత మంది ప్రముఖులు సినిమా చూశారు. వారిలో న్యాచురల్ స్టార్ నాని ఉన్నారు. ప్రీ రిలీజ్ వేడుకలో ఈ సినిమా గురించి ఆయన ఏమన్నారంటే?

అరుదైన సినిమా... పిల్లల్ని స్కూల్ మాన్పించి మరీ
ఈ మధ్య కాలంలో నేను చూసిన అందమైన తెలుగు సినిమా '35 చిన్న కథ కాదు' అని నాని చెప్పారు. ఇది యువతకు ఎక్కుతుందా? లేదంటే మాస్, క్లాస్ జనాలు చూస్తారా? వంటివి తనకు తెలియదని, కానీ ప్రతి అమ్మ, ప్రతి నాన్న వాళ్ల పిల్లల్ని తీసుకుని వెళ్లాల్సిన సినిమా అని నాని చెప్పారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... ''ప్రతి ఒక్కరికీ వ్యక్తిగతంగా కనెక్ట్ అయ్యే సినిమా. నివేదా థామస్ చెప్పినట్టు... మీ పిల్లలు ఒక్క రోజు స్కూల్ ఏమైనా మిస్ అయినా సరే నష్టం ఏమీ లేదు. ఆ రోజు థియేటర్లలో ఎక్కువ నేర్చుకుంటారు. నాకు 'సరిపోదా శనివారం' లాంటి సినిమాలు మళ్లీ మళ్లీ వస్తాయేమో కానీ '35 చిన్న కథ కాదు' లాంటి సినిమాలు మళ్లీ మళ్లీ రావు. అందుకని, పొరపాటున కూడా మిస్ కాకండి '' అని చెప్పారు నాని. 

నివేదా థామస్ పొరపాటున అబద్ధం చెప్పదు
'జెంటిల్‌మన్' సినిమాతో నివేదా థామస్ తనకు పరిచయమైందని, తమ ఇంట్లో ఓ మనిషి అయ్యిందని చెప్పారు నాని. ఆవిడ మీద ప్రశంసలు కురిపించారు. ఆమె పొరపాటున కూడా అబద్ధం చెప్పదని వివరించారు. ఆవిడ ఏ పని చేసినా సరే 100 పర్సెంట్ ఇస్తుందన్నారు. థియటర్లలో నివేదాను చూసినప్పుడు ప్రతి అమ్మ ఆ పాత్రతో కనెక్ట్ అవుతుందని నాని తెలిపారు. హీరో విశ్వదేవ్ సర్‌ప్రైజ్ చేశాడని తెలిపారు. స్క్రీన్ మీద ప్రసాద్ పాత్ర తప్ప మరొకటి గుర్తు రాలేదన్నారు.

Also Read: శ్రీను వైట్ల మార్క్ కామెడీతో 'విశ్వం' టీజర్ - వైఎస్ జగన్‌ను వాడేసిన గోపీచంద్


తెలుగు సినిమాకు ఆమిర్ ఖాన్ లాంటోడు ప్రియదర్శి
తనకు వ్యక్తిగతంగా ఇష్టమైన వ్యక్తి ప్రియదర్శి అని చెప్పారు నాని. అంతే కాదు... తను ఎంపిక చేసుకునే పాత్రలు గానీ, పెర్ఫెక్షన్ కోరుకునే విధానం చూస్తుంటే ఆమిర్ ఖాన్ అనిపిస్తాడని ఆయన వివరించారు. ''ప్రియదర్శి గనుక మన తెలుగు సినిమా ఆమిర్ ఖాన్... అతని ఫిల్మోగ్రఫీలో 'తారే జమీన్ పర్' లాంటి సినిమా '35 చిన్న కథ కాదు'. అందులో డౌట్ లేదు'' అని నాని తెలిపారు.

Also Read'బిగ్ బాస్ 8'లోకి కృష్ణ ముకుంద మురారి హీరోయిన్ ప్రేరణ... హైదరాబాద్‌లో పెరిగిన తమిళమ్మాయ్ బ్యాగ్రౌండ్ ఇదే

నివేదా థామస్, విశ్వదేవ్ రాచకొండ జంటగా నటించిన '35 చిన్న కథ కాదు'లో ప్రియదర్శి పులికొండ టీచర్ రోల్ చేశారు. గౌతమి, భాగ్యరాజ్, కృష్ణ తేజ, అరుణ్ దేవ్, అభయ్, అనన్య ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్: లతా నాయుడు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎన్ సౌమిత్రి, క్రియేటివ్ నిర్మాత: శివాని దోభాల్, పాటలు: కిట్టు విస్సాప్రగడ - భరద్వాజ్ గాలి, మాటలు: నంద కిశోర్ ఈమాని -  ప్రశాంత్ విఘ్నేష్ అమరావతి, కూర్పు: టీసీ ప్రసన్న, ఛాయాగ్రహణం: నికేత్ బొమ్మి, సంగీతం: వివేక్ సాగర్, నిర్మాణ సంస్థలు: సురేష్ ప్రొడక్షన్స్ - ఎస్ ఒరిజినల్స్ - వాల్టెయిర్ ప్రొడక్షన్స్,  నిర్మాతలు: రానా దగ్గుబాటి - సృజన్ యరబోలు - సిద్ధార్థ్ రాళ్లపల్లి,  రచన - దర్శకత్వం: నంద కిశోర్ ఈమాని. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh Budget 2024-25: ఏపీ బడ్జెట్‌లో పవన్ కల్యాణ్‌, లోకేష్ శాఖలకు ఇచ్చిన నిధులు ఎంతంటే?
ఏపీ బడ్జెట్‌లో పవన్ కల్యాణ్‌, లోకేష్ శాఖలకు ఇచ్చిన నిధులు ఎంతంటే?
Bandi Sanjay: లారీ కింద ప్రమాదవశాత్తు ఇరుక్కున్న యువతి - మానవత్వం చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్
లారీ కింద ప్రమాదవశాత్తు ఇరుక్కున్న యువతి - మానవత్వం చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్
Andhra Pradesh Budget 2024-25: ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ 2024-25 హైలైట్స్‌ - వివిధ శాఖలకు కేటాయింపుల పూర్తి వివరాలు ఇవే
ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ 2024-25 హైలైట్స్‌ - వివిధ శాఖలకు కేటాయింపుల పూర్తి వివరాలు ఇవే
Mahindra Scorpio Sales: మహీంద్రా స్కార్పియో కోసం క్రేజీ అయిపోతున్న జనాలు - షాకిస్తున్న సేల్స్ లెక్కలు!
మహీంద్రా స్కార్పియో కోసం క్రేజీ అయిపోతున్న జనాలు - షాకిస్తున్న సేల్స్ లెక్కలు!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆసీస్ తో టెస్టుకు రోహిత్ దూరం! కెప్టెన్ గా బుమ్రా?ట్రోలర్స్‌కి ఇచ్చి పడేసిన రౌడీ, ఒక్క వీడియోతో గప్‌చుప్బెల్టు తీస్తానన్నారు? రోజా సంచలన ట్వీట్గేమ్ చేంజర్ టీజర్ టాక్ ఎలా ఉందంటే?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Budget 2024-25: ఏపీ బడ్జెట్‌లో పవన్ కల్యాణ్‌, లోకేష్ శాఖలకు ఇచ్చిన నిధులు ఎంతంటే?
ఏపీ బడ్జెట్‌లో పవన్ కల్యాణ్‌, లోకేష్ శాఖలకు ఇచ్చిన నిధులు ఎంతంటే?
Bandi Sanjay: లారీ కింద ప్రమాదవశాత్తు ఇరుక్కున్న యువతి - మానవత్వం చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్
లారీ కింద ప్రమాదవశాత్తు ఇరుక్కున్న యువతి - మానవత్వం చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్
Andhra Pradesh Budget 2024-25: ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ 2024-25 హైలైట్స్‌ - వివిధ శాఖలకు కేటాయింపుల పూర్తి వివరాలు ఇవే
ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ 2024-25 హైలైట్స్‌ - వివిధ శాఖలకు కేటాయింపుల పూర్తి వివరాలు ఇవే
Mahindra Scorpio Sales: మహీంద్రా స్కార్పియో కోసం క్రేజీ అయిపోతున్న జనాలు - షాకిస్తున్న సేల్స్ లెక్కలు!
మహీంద్రా స్కార్పియో కోసం క్రేజీ అయిపోతున్న జనాలు - షాకిస్తున్న సేల్స్ లెక్కలు!
Anna Canteen: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం - పల్లెల్లో కూడా అన్న క్యాంటీన్లు 
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం - పల్లెల్లో కూడా అన్న క్యాంటీన్లు 
Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య - సూసైడ్ నోట్ రాసి మరీ..
బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య - సూసైడ్ నోట్ రాసి మరీ..
SEO Poisoning: గూగుల్ సెర్చ్‌లో కూడా స్కామ్ - మళ్లీ కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన సైబర్ కేటుగాళ్లు!
గూగుల్ సెర్చ్‌లో కూడా స్కామ్ - మళ్లీ కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన సైబర్ కేటుగాళ్లు!
Minister Atchennaidu: 'రాష్ట్రానికి వ్యవసాయం వెన్నెముక వంటిది' - రూ.43,402 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి అచ్చెన్నాయుడు
'రాష్ట్రానికి వ్యవసాయం వెన్నెముక వంటిది' - రూ.43,402 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి అచ్చెన్నాయుడు
Embed widget