Tollywood Actress: అబ్దుల్ కలాంతో ఉన్న ఈ చిన్నారి ఎవరో తెలుసా? ఒకప్పుడు తెలుగులో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్, ప్రస్తుతం..
Tollywood Actress With Abdul Kalam: ఈ మధ్య హీరోయిన్ల చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో ఓ హీరోయిన్ ఫోటో ఒకటి బయటకు వచ్చింది.
Tollywood Actress With Abdul Kalam: ఈ మధ్య హీరోయిన్ల చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో ఓ హీరోయిన్ ఫోటో ఒకటి బయటకు వచ్చింది. దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంతో దిగిన ఓ హీరోయిన్ చిన్ననాటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో బయటకు వచ్చింది. ఆ చిన్నారి ఇప్పుడు టాలీవుడ్ మంచి క్రేజ్ ఉన్న నటి. తెలుగులో స్టార్ హీరోలు, యంగ్ హీరోల సరసన నటించి ఇండస్ట్రీలో మంచి క్రేజ్ సంపాదించుకుంటుంది. అంతేకాదు ఓ మెగా హీరో సరసన కూడా నటించి రొమాన్స్ చేసింది.
ఆ మధ్య బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరిచింది. ఇంతకి అబ్దుల్ కలాంతో ఉన్న ఆ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా?. ఆమె మరెవరో కాదు అందాల ముద్దుగుమ్మ సురభి పురాణిక్. ఢిల్లీలో చదివిన సురభి తన స్కూల్ ఈవెంట్‌కి అబ్దుల్ కలాం ముఖ్య అతిథిగా వచ్చారట. అదే సమంలో ఆయనతో కలిసి ఇలా ముచ్చటించింది. అయితే తమిళం, తెలుగులో ఎక్కువగా సినిమాలు చేసిన ఈ బ్యూటీ ప్రస్తుతం ఆఫర్స్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తుంది. 2013లో 'ఇవన్ వేరే మాదిరి' అనే తమిళ సినిమాతో హీరోయిన్‌గా కోలీవుడ్‌లో ఆరంగేట్రం చేసింది.
అక్కడ వరుసగా సినిమాలు చేసిన ఈ బ్యూటీ అదే సమయంలో తెలుగు దర్శక-నిర్మాతల దృష్టిని ఆకర్షించింది. ఈ క్రమంలో సందీప్ కిషన్ హీరోగా నటించిన బీరువా అనే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో సురభి తన యాక్టింగ్, స్క్రీన్ ప్రజెన్స్‌తో ఆకట్టుకుంటుంది. దీంతో ఆమెకు తెలుగులో బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ క్యూ కట్టాయి. ఆ తర్వాత వరుసగా శర్వానంద్‌తో కలిసి ఎక్స్‌ప్రెస్_రాజాలో నటించింది. ఈ సినిమాతో మంచి విజయం సాధించిన ఆమె ఆ వెంటనే 'ఎటాక్', నాని సరసన 'జెంటిల్‌మెన్', అల్లు శిరీష్‌తో 'ఒక్క క్షణం', ఓటరులో హీరోయిన్‌గా అలరించింది. ఇక చివరిగా ఆది సాయి కుమార్‌తో శశి సినిమాలో హీరోయిన్‌గా అలరించింది.
View this post on Instagram
అయితే ఆమె నటించిన 'జెంటిల్‌మెన్' మాత్రమే ఆమె కెరీర్‌లో చెప్పుకొదగ్గ హిట్ ఇచ్చింది. సినిమాలు పెద్దగా హిట్ కాకపోయినా సురభికి మాత్రం వరుసగా ఆఫర్స్ క్యూ కట్టాయి. కానీ, ఆమెకు మాత్రం మాత్రం ఆశించిన గుర్తింపు రాలేదు. స్టార్ హీరోల సరసన నటించిన సురభికి మాత్రం అనుకున్న స్థాయిలో హిట్, గుర్తింపు రాలేదు. దీంతో ఆమెకు ఆఫర్స్ కరువయ్యాయి. దీంతో వెండితెరపై సురభి సందడి కరువైంది. ప్రస్తుతం ఆమె మూవీ ఆఫర్స్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తుంది. అయితే ఆమె తెలుగులో నటించిన భిమవరం మూవీ విడుదల కావాల్సి ఉంది. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈచిత్రం రిలీజ్ ఎప్పుడు అవుతుందనేది క్లారిటీ లేదు. అలాగే ఆమె కన్నడలో సకత్ అనే సినిమా చేస్తుంది. ప్రస్తుతం ఈ రెండు సినిమాలే చేతిలో ఉన్నట్టు తెలుస్తోంది.