By: ABP Desam | Updated at : 26 May 2022 08:43 PM (IST)
Edited By: Suresh Chelluboyina
Image: Mythri Movie Makers/YouTube
‘అంటే సుందరానికి’ టీజర్ ఏ స్థాయిలో హైప్ క్రియేట్ చేసిందో తెలిసిందే. కుటుంబ సమేతంగా కూర్చొని హాయిగా నవ్వుకొనే సినిమాతో హీరో నాని వస్తున్నాడని.. టీజర్ చూస్తే తెలిసిపోతుంది. క్రిస్టియన్ అమ్మాయితో బ్రాహ్మణ యువకుడు ప్రేమలో పడితే? ఏమవుతుందనే కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో నానికి జంటగా నజ్రియా నజీమ్ నటించారు. ఇందులో ఆమె లీల పాత్రలో కనిపించనుంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవిశంకర్.వై ఈ చిత్రాన్ని నిర్మించారు.
'అంటే సుందరానికి' సినిమా రొమాన్స్ అండ్ కామెడీతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తుందని దర్శక నిర్మాతలు అంటున్నారు. సనాతన ఆచారాలు పాటించే బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన సుందర్ ప్రసాద్ పాత్రలో నాని ఒదిగిపోయాడు. మరి సుందరం క్రిస్టియన్ కుటుంబానికి చెందిన లీలా ప్రేమలో పడితే ఏం జరుగుతుందనేది జస్ట్ సాంపిల్ మాత్రమే. వీరి ప్రేమ, మతాల గురించి పక్కన పెడితే.. మరో సస్పన్స్ సర్‌ప్రైజ్ కూడా ఈ సినిమాలో ఉన్నట్లు టీజర్‌లో చూపించారు. అదేంటో తెలుసుకోవాలంటే జూన్ 10వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. ‘అంటే సుందరానికి’ సినిమా తెలుగులోనే కాకుండా తమిళంలో ‘ఆదదే సుందర’, మలయాళంలో ‘ఆహా సుందర’ టైటిల్స్‌తో విడుదల కానుంది. ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందించారు.
Also Read: 'ఎఫ్ 3'లో పవర్ స్టార్ - పవన్ సహా టాలీవుడ్ టాప్ హీరోలను వాడేసిన అనిల్
సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్రయూనిట్ గురువారం ఓ ‘అంటే సుందరానికి’ మూవీ మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో నాని ఫన్నీ మూవ్‌మెంట్స్‌ను చూపించారు. కొన్ని సీన్లకు అంతా పగలబడి నవ్వడాన్ని ఈ వీడియో చూడవచ్చు.
Also Read: 36 ఏళ్ళ తర్వాత సీక్వెల్ - టామ్ క్రూజ్ 'టాప్ గన్: మావెరిక్' ఎలా ఉంది? టాప్ ప్లేస్‌లో ఉంటుందా? లేదా?
Balakrishna: 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' టీమ్ తో బాలయ్య - లుక్ అదుర్స్
Pavithra Lokesh: సహజీవనం ఏంటి? పవిత్ర నా భార్య - మాకు ఇద్దరు పిల్లలు
Raghava Lawrence: రాఘవ లారెన్స్ ఈవిల్ గెటప్ - 'రుద్రుడు' రిలీజ్ డేట్ ఫిక్స్
Satyadev: కొరటాల శివతో సత్యదేవ్ సినిమా - 'కృష్ణమ్మ' ఫస్ట్ లుక్
Prashanth Neel-Ramya: నరేష్ మూడో భార్యతో 'కేజీఎఫ్' డైరెక్టర్‌కు ఉన్న రిలేషన్ ఏంటి?
MP Raghurama Krishna Raju : ఎంపీ రఘురామకృష్ణరాజు భీమవరం పర్యటన రద్దు, మధ్యలోని ట్రైన్ దిగిపోయిన ఎంపీ
IndiGo flights Delay : సిక్ లీవ్ పెట్టి ఇంటర్య్వూకు చెక్కేసిన ఇండిగో సిబ్బంది, 900 విమాన సర్వీసులపై ప్రభావం
PM Modi Speech: తెలంగాణలోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది, అభివృద్ధి డబుల్ అవుతుంది-ప్రధాని మోదీ
Minister Harish Rao : తెలంగాణకు మోదీ మొండి చెయ్యి, ప్రధాని కల్లబొల్లి కబుర్లు చెప్పారు- మంత్రి హరీశ్ రావు
IND vs ENG 5th Test Day 3: ఆరంభంలోనే వికెట్ కోల్పోయిన భారత్ - టీ సమయానికి స్కోరు ఎంతంటే?