Nandamuri Balakrishna: మోక్షజ్ఞ ఎంట్రీపై బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు - నన్ను ఇన్‌స్పరేషన్‌గా తీసుకోవద్దని చెప్పా...
Nandamuri Balakrishna: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ఈవెంట్‌లో నందమూరి బాలకృష్ణ హీరో విశ్వక్ సేన్ తాను కవలమంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలాగే మోక్షజ్ఞ ఇండస్ట్రీ ఎంట్రీపై ఊహించని కామెంట్స్ చేశారు.
Nandamuri Balakrishna Comments at Gangs of Godavari Event యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన మూవీ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'. పలు వాయిదాల తర్వాత ఎట్టకేలకు మే 31న ఈ మూవీ థియేటర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మూవీ రిలీజ్ సందర్భంగా నేడు మూవీ టీం గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నేడు నిర్వహించారు. మే 28న సాయంత్రం హైదరాబాద్‌లోని ఎన్ కన్వెషన్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఈవెంట్‌కు హాజరైన ఆయన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీంకి శుభాకాంక్షలు తెలిపారు.
ఇక హీరో విశ్వక్ సేన్‌పై ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నారు. ఈ మాస్ కా దాస్ అచ్చం తనలాగే ఉంటాడంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. "విశ్వక్ సేన్ గురించి చెప్పాలంటే అతడిది ఉడుకు రక్తం. అచ్చం నాలాగే. సినిమాలో ఏదోక వైవిధ్యం ఉండేలా ప్రయోగాలు చేస్తున్నాడు. విశ్వక్ సేన్ చూస్తుంటే నన్ను నేను చూసుకుంటున్నట్టు ఉంది. ఇద్దరం మంచి సోదరులం. ఒకే తల్లి కడుపున పుట్టకపోయినా బయటక మమ్మల్ని చూస్తే కవలలు అంటారు. ఇద్దరం అన్నదమ్ముళ్లు లాంటి వాళ్లం. కానీ, నేనే అతడికి కంటే చిన్న. నాకు విశ్వక్ సేన్ అన్నయ్య అవుతాడు. సినిమా అంటే ప్యాషన్.
సినిమా సినిమాకు కొత్తదనం ఉండేలా చూస్తున్నాడు. నేను కూడా అంతే కొత్తగా ఇవ్వాలనుకుంటున్నాడు. నాలా ఎలా అయితే దూకుడు తనం ఉందో తనకి కూడా అలాగే ఉంది. ఇక గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టైటిల్ విచిత్రంగా ఉంది. ఇలా ఉండాలి మూవీ టైటిల్స్ అంటే. ఈ సినిమా మంచి హిట్ అవుతుంది.. మీరంత సినిమా ఆదరిస్తారు.. మూవీ హిట్ చేస్తారు. ఇక ఈ మూవీ నిర్మాతలు పేర్లు ఎంటో చాలా టఫ్‌గా ఉంది. ముగ్గురు ఈ సినిమా నిర్మిస్తున్నారు. వారి పేర్లు చెప్పడం కష్టంగా ఉంది. గ్యాంగ్స్ గోదావరి నిర్మాతలు ఎవరని అన్‌స్టాపబుల్‌లో క్వశ్చన్ కూడా అడగోచ్చు అలా ఉంది" అంటూ చెప్పుకొచ్చారు.
మోక్షజ్ఞ ఎంట్రీ...
అనంతరం తన తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీపై కూడా స్పందించారు. విశ్వక్ సేన్ ఉద్దేశిస్తూ మీరంత నెక్ట్స్ జనరేషన్ ఇన్‌స్పరెషన్‌గా ఉండాలన్నారు. నెక్ట్స్ నా కొడుకు మోక్ష ఎంట్రి ఇవ్వాల్సి ఉంది. వాడు ఇండస్ట్రీకి వస్తాడు. అలాంటి వారికి మీరంతా స్ఫూర్తిగా ఉండాలి. నన్ను అసలు ఇన్‌స్పరెషన్‌గా తీసుకోవద్దని మోక్షకి చెబుతుంటాను. నన్నే కాదు మీ తాత నందమూరి తారకరామారావుని కూడా తీసుకోవద్దు ఎవ్వరు అవసరం లేదు. విశ్వక్ సేన్, అడవి శేష్, సిద్ధు జొన్నలగడ్డ వంటి వారిని ఇన్‌స్పరేషన్‌గా తీసుకోమని చెబుతుంటాను" అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
నేహా కత్తి, అంజలి ఖతర్నాక్
హీరోయిన్లు అంజలి,నేహా శెట్టిలపై కూడా షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ ముద్దుగుమ్మల గురించి చెప్పాలంటే ఒకరు కత్తి, ఒకరు ఖతర్నాక్. నేహా శెట్టి కత్తి అయితే అంజలి ఖతర్నాక్. కత్తి అంటే నేరు గుచ్చేస్తుంది. వెన్నుపోటు ఏం ఉండదు నేరుగా పోడిచేయడమే. ఇక అంజలి పోడుస్తుందో, పోడవదో తెలియదు అసలు అంటూ చమత్కిరించారు.ఇక గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మంచి విజయం సాధిస్తుందని, మళ్లీ మూవీ విజయోత్సవానికి వస్తానంటూ కామెంట్ చేశారు.