Nagarjuna: వంద 'బాషా'లతో సమానం ఈ 'కూలీ'... నాగ్ స్పీచ్ దెబ్బకు తమిళనాడు షేక్!
Nagarjuna On Coolie: సూపర్ స్టార్ రజనీకాంత్ 'కూలీ'లో నాగార్జున విలన్ రోల్ చేసిన సంగతి తెలిసిందే. ట్రైలర్ విడుదల కార్యక్రమంలో సినిమాకు ఆయన హైప్ ఇచ్చారు.

'కూలీ' ఆగస్టు 14న థియేటర్లలోకి వస్తోంది. సినిమా రిలీజ్ కంటే పది రోజుల ముందు... ఆగస్టు 2న ట్రైలర్ విడుదల చేశారు. ఆ ఈవెంట్ చెన్నైలో జరిగింది. అందులో నాగార్జున ఇచ్చిన స్పీచ్ దెబ్బకు టోటల్ తమిళనాడు షేక్ అవుతోంది. సినిమా మీద అంచనాలు మరింత పెరిగాయి.
ఒక్క కూలి = 100 బాషాలు!
Nagarjuna Speech At Coolie Trailer Launch: 'కూలీ' ట్రైలర్ చూశారా? ఎండింగ్ షాట్ చూస్తే సూపర్ స్టార్ రజనీకాంత్ బ్లాక్ బస్టర్ సినిమాలలో ఒకటైన 'బాషా' గుర్తుకు వస్తుంది. అందులో చివరి విజువల్‌లో నెగిటివ్‌లో రజనీని చూపించాడు దర్శకుడు లోకేష్ కనగరాజ్. ట్రైలర్ విడుదలకు ముందు ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూలలో కూడా 'బాషా' తరహాలో ఉంటుందని చెప్పారు. అయితే నాగార్జున మాత్రం 'బాషా'తో 'కూలీ'ని కంపేర్ చేయడం లేదు. అంతకు మించి అంటున్నారు.
వంద 'బాషా'లతో ఈ 'కూలీ' సమానం అని నాగార్జున చెప్పారు. ఆయన స్పీచ్ మొత్తం మీద తమిళనాడు అంతటని షేక్ చేసిన ఒకే ఒక్క డైలాగ్ అది. దాంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయని చెప్పవచ్చు.
#CoolieUnleashed : #Coolie Event ⭐:#Nagarjuna Speech 🎤:
— Laxmi Kanth (@iammoviebuff007) August 2, 2025
"One Coolie Equals 100 Baasha & OG Superstar is Rajini sir only.."🥵😲
అసలైన ఒరిజినల్ స్టార్ రజని!
'కూలీ' సినిమాను సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ ప్రొడ్యూస్ చేశారు. ఆయన సూపర్ స్టార్ ఫ్యాన్. రజనీకాంత్ గురించి ఆయన మాట్లాడుతూ... ''నాగార్జున గారు నాతో ఒక మాట చెప్పారు. ఒరిజినల్ సూపర్ స్టార్ రజనీకాంత్ అని! ఇప్పుడు నేను ఆ మాట ఎందుకు చెబుతున్నానంటే... ఒరిజినల్ సూపర్ స్టార్ మాత్రమే కాదు వన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్ రజనీకాంత్. ఇవాళ రజనీకాంత్ ఇండియాలో ఏ ముఖ్యమంత్రికి అయినా సరే ఫోన్ చేయగలరు. ఆయన ఫోన్ చేస్తే సీఎంలు సైతం లిఫ్ట్ చేస్తారు. సీఎంలు మాత్రమే కాదు... పీఎం కూడా రజనీకాంత్ ఫోన్ లిఫ్ట్ చేస్తారు. రియల్ లైఫ్ సూపర్ స్టార్ రజనీకాంత్. 50 ఏళ్లలో ఎంతో మంది స్టార్లు వచ్చారు, వెళ్లారు. రజనీకాంత్ మాత్రం సూపర్ స్టార్ కింద ఉన్నారు. 'జైలర్' సినిమాతో రజనీకాంత్ రికార్డులు క్రియేట్ చేశారు. ఇప్పుడు 'కూలీ'తో ఆ 'జైలర్' రికార్డులు బ్రేక్ చేస్తారు. ఇటీవల వచ్చిన యంగ్ హీరోలు చాలా ఆటిట్యూడ్ చూపిస్తున్నారు. కానీ రజనీకాంత్ సింప్లిసిటీతో ఉంటారు. అందరికీ గౌరవం ఇస్తారు. అది ఆయన గొప్పతనం'' అని చెప్పారు.





















