Nagarjuna 100th Movie Update: సెంచరీకి స్పెషల్ ప్లాన్ ప్రిపేర్ చేసిన నాగార్జున! కింగ్ వందో సినిమాకు దర్శకుడు ఆయనేనా?
అక్కినేని నాగార్జున తన వందో సినిమాకు స్పెషల్ ప్లాన్ రెడీ చేశారా? దర్శకుడిని ఖరారు చేశారా?
కింగ్ అక్కినేని నాగార్జున వందో సినిమాకు రెడీ అవుతున్నారని టాలీవుడ్ టాక్. కొన్ని రోజులుగా ఆయన వందో సినిమా గురించి చర్చ నడుస్తోంది. హీరోగా ఆయన 80 సినిమాల్లో నటించారు. అతిథి పాత్రలు పది వరకూ చేశారు. ఇతర భాషల్లోనూ సినిమాలు చేశారు. సో... సెంచరీకి దగ్గరకు వచ్చినట్టే! ఈ సినిమా దర్శకుడిని ఆయన ఖరారు చేశారట.
మోహన్ రాజా దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి అక్కినేని నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఫిల్మ్ నగర్ ఖబర్. అది ఆయనకు సెంచరీ సినిమా అట. ఇంకో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఏంటంటే... అందులో ఆయన రెండో కుమారుడు అఖిల్ కూడా నటించనున్నారట. అయితే... నాగార్జునదే మెయిన్ రోల్ అని తెలుస్తోంది. కథ, కథనాలు కొత్తగా ఉండబోతున్నాయని సమాచారం. త్వరలో ఈ సినిమా గురించి అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం.
నాగార్జున మాత్రం ఈ స్పెషల్ మైల్ స్టోన్ మూవీ గురించి పెదవి విప్పడం లేదు. అతిథి పాత్రలను కౌంట్ చేయాలా? వద్దా? అనే విషయంలో ఆగుతున్నారట. ఆయన లెక్కలు ఆయనకు ఉన్నాయి. సినిమా రిజల్ట్ బట్టి డిసైడ్ అవ్వాలని అనుకుంటున్నట్టు టాక్. అది పక్కన పెడితే... సెంచరీ సినిమా కోసం ఆయన ఆలోచిస్తున్నారని క్లారిటీ వచ్చింది.
Also Read: నాగార్జున... సోనాల్ చౌహన్... దుబాయ్‌లో డిష్యూం... డిష్యూం!
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న 'గాడ్ ఫాదర్' సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. మరోవైపు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో 'ది ఘోస్ట్' సినిమా చేస్తున్నారు నాగార్జున. ఈ రెండు సినిమాల తర్వాత నాగార్జున వందో సినిమా గురించి ప్రకటిస్తారేమో చూడాలి.
Also Read: అవన్నీ పుకార్లే... నేను అలా అనలేదు! - నాగార్జున క్లారిటీ
View this post on Instagram